...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: ట్విస్టులే ట్విస్టులు- జ్యోకి ఆస్తి దక్కనివ్వనన్న పారిజాతం- పెళ్లి రెజెక్ట్ చేసిన సూరజ్

Karthika Deepam 2 Serial August 7th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 7వ ఎపిసోడ్‌‌ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగింది. సూరజ్‌ను పెళ్లి చేసుకోకుంటే ఆస్తిలో ఒక్క రూపాయి కూడా దక్కనివ్వనని, నువ్వు సుమిత్ర కూతురు అనే నిజాన్ని అందరికి చెప్పేస్తాను అని జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ షాక్ ఇస్తుంది పారిజాతం.

Published on: Aug 7, 2026, 07:51:19 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ వీలునామా గురించి జ్యోత్స్న ఆలోచిస్తుంది. పారిజాతం వెళ్లి పెళ్లికి ఒప్పుకోమంటుంది. ఆస్తికోసం ఆ సూరజ్ గాడిని పెళ్లి చేసుకోలేను. ఆస్తి కోసం, డబ్బు కోసం తలదించలేను. నాకు డబ్బు కావాలి. కానీ, డబ్బంటే ప్రాణం కాదు డబ్బంటే ఇష్టం అని జ్యో అంటుంది.

ఇంటి వారసురాలిని కాబట్టి

కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 7 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 7 ఎపిసోడ్

నేను పెళ్లి చేసుకోకపోయిన ఈ ఆస్తి అంతా నాదే. ఎందుకంటే నేను ఈ ఇంటి వారసురాలిని కాబట్టి అని జ్యోత్స్న అంటుంది. మతిలేకుండా మాట్లాడకు అని పారిజాతం అంటుంది. ఎవరు చెప్పిన వినను. ఇదంతా బావ, దీప ఆడుతున్న నాటకం. ఈ పెళ్లి చేయాలని వాళ్లకెందుకు అంత తాపత్రయం అని జ్యోత్స్న అంటుంది.

ఇది మీ అమ్మ తాపత్రయం, కార్తీక్ దీప కేవలం సాయంగా నిలబడతారు అంతే. ఈ పెళ్లి చేసుకుంటే అందరి మనసులను గెలుస్తావ్ అని పారు అంటుంది. నేను ఓడిపోను. ఎందుకంటే నేను ఫైటర్‌ని లూజర్‌ని కాదు అని జ్యోత్స్న అంటుంది. నీ మంచికోసమే చెబుతున్నా నష్టపోయేది నువ్వే అని పారిజాతం హెచ్చరిస్తుంది. మా అమ్మ నీకు ఏదో నగ ఇచ్చినట్టుంది, అందుకే అటువైపు మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న అంటుంది.

నాకు ఏమివ్వలేదని పారిజాతం అంటుంది. నేను పెళ్లి చేసుకుంటే దీపకు అడ్డు తొలగిపోతుందిగా. నేను ఎప్పటికైనా బావను దక్కించుకుంటానని తన భయం అని జ్యోత్స్న అంటే.. నోర్మూయ్ అని కోపంగా ఒక్కసారిగా అరుస్తుంది పారిజాతం. బంగారు భవిష్యత్తు కాళ్లముందుకు వచ్చి నిలబడితే చూడలేనిదానివే నువ్వు. సూరజ్‌ను పెళ్లి చేసుకుంటే నువ్వు కోరుకున్న జీవితాన్ని గడపవచ్చు. ఇంకా కార్తీక్ గాడిని తలుచుకుంటే నీ గొయ్యి నువ్వు తీసుకున్నట్లే అని పారిజాతం అంటుంది.

నీకు ఆస్తి దక్కనివ్వను

నేను ఏ లక్ష్యం కోసం నిన్ను మార్చానో అదే జరగనప్పుడు ఇంకెందుకు. నేను ఏమైపోయినా పర్వాలేదు అని పారిజాతం అంటే.. నా జీవితం నాశనం అవుతుందని జ్యో అంటుంది. ఇప్పుడు నువ్వు చేసుకుంటుంది అదే. నీ అహంకారం, పొగరు అన్ని పక్కన పెట్టి సూరజ్‌తో పెళ్లికి ఒప్పుకో. వాడు వస్తాడు. నీకు పెళ్లి ఇష్టమేనా అడుగుతారు అవును అని ఒప్పుకో, వద్దని ఏదైనా సాకు చెప్పావో అక్కడే దాసు కూతురివి అని చెప్పేస్తాను అని పారు అంటుంది.

నువ్వు పుట్టకముందు పారిజాతాన్ని చూడలేదు. చూస్తే తట్టుకోలేవు. సైలెంట్‌గా ఒప్పుకో లేకుంటే నాలో వైలెంట్ చూడాల్సి వస్తుందని పారిజాతం బెదిరిస్తుంది. పారిజాతం కిందకు దిగుతుంది. అప్పుడే సూరజ్ వస్తాడు. జ్యోత్స్న కిందకు వస్తుంది. వచ్చినందుకు శివ నారాయణ థ్యాంక్స్ చెబితే.. దీనికి కూడా కారణం ఉందని, తనకిచ్చిన ఐదు లక్షలను టేబుల్‌పై పెడతాడు సూరజ్.

డబ్బు కోసం రమ్మన్నారనుకుంటున్నావా

నాకు అవసరమైనప్పుడు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చినట్లు సూరజ్ చెప్పి వెళ్లిపోతాడు. సుమిత్ర ఆపి ఛైర్మన్ గారు ఎందుకు రమ్మన్నారో అడగవా అని అంటుంది. కొన్ని అడక్కుండానే అర్థమైపోతాయని సూరజ్ అంటాడు. డబ్బుకోసం రమ్మన్నారు అనుకున్నావా ఏంటీ అని కార్తీక్ అంటాడు. నేను ఒకటి తెలుసుకోవాలి. నువ్వేందుకు అవుట్ హౌజ్ వదిలిపెట్టి వెళ్లావ్ అని సుమిత్ర అడుగుతుంది.

ఒక అనుమానం, ఒక అవమానం అని సూరజ్ అంటాడు. వివరంగా చెప్పమని శివ నారాయణ అంటాడు. అనుమానం మీరే. నేను ఎవరో మీరు అడగలేదు. నాకు చెప్పాల్సిన అవసరం రాలేదు. కానీ, నా గురించి నా వెనుక ఎంక్వైరీ జరిగింది. అది మీరే చేశారు. నేను అనాథను అని తెలుసుకున్నారు. నా వెనుక నాకు తెలియకుండా ఎంక్వైరీ చేయడం నచ్చలేదని సూరజ్ అంటాడు.

నేను అనాథ అని తెలిసి జ్యోత్స్న నా దగ్గరకు వచ్చి నోటికొచ్చినట్లు అవమానించారు. అనుమానం జరిగిన చోట అవమానం జరిగినచోట ఉండకూడదని నిర్ణయించుకున్నాను అని సూరజ్ అంటాడు. గతంలో కూడా అనుమానించాను అప్పుడు తప్పుగా అనుకోని నువ్వు ఇప్పుడెందుకు తప్పుగా అనుకుంటున్నావ్ శివ నారాయణ అడుగుతాడు.

అనుమానం కంటే అవమానమే

జ్యోత్స్న గారు అన్న మాటలు బాధపెట్టాయని సూరజ్ అంటాడు. మా అనుమానం కంటే జ్యోత్స్న అవమానమే ఎక్కువ బాధపెట్టిందంటావ్ అని శివ నారాయణ అడిగితే.. అవును అంటాడు సూరజ్. నీకు జ్యోత్స్న అంటే ఇష్టమేనా అని శివ నారాయణ అడుగుతాడు. ఇష్టమే అని సూరజ్ అంటాడు. జ్యోత్స్నకు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం అని శివ నారాయణ అంటాడు.

వచ్చె నెలలో మంచి ముహుర్తం పెట్టించి పెళ్లి చేస్తాను. ఏమంటావ్ అని శివ నారాయణ అడుగుతాడు. జ్యోత్స్నకు నేను ఇష్టమో కాదో కూడా నాకు తెలియాలిగా అని సూరజ్ అంటాడు. నేను కూడా కొన్ని నిజాలు చెప్పాలి. నాకు జ్యోత్స్న గారు అంటే ఇష్టం కాబట్టే ఇక్కడ ఉన్నా. కానీ, నేనంటే జ్యోత్స్నకు ఫస్ట్ నుంచి ద్వేషమే. అందరు ఒప్పుకోవడం కాదు పెళ్లికి జ్యోత్స్న ఒప్పుకోవాలి. మీ అందరిముందు చెప్పాలని సూరజ్ అంటాడు.

జ్యోత్స్నను చెప్పమంటారు. జ్యోత్స్న చెప్పదు సార్ తనేంటో నాకు బాగా తెలుసు. తన ఇష్టాలు, అలవాట్లు అన్నీ తెలుసు. అన్ని తెలిసిన నాకు నేనంటే తనకు ఇష్టం లేదని తెలియదా. జ్యోత్స్న మనసులో నేను లేను. జ్యోత్స్న మనసులో కార్తీక్ గారే ఉన్నారు. సారీ బ్రదర్ ఈ మాట నేను అనకూడదు కానీ పెళ్లి కాబట్టి అన్నాను. కాదని ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పమనండి. ఇది అందరికి తెలుసు అని సూరజ్ అంటాడు.

జ్యోత్స్న మనసులో కార్తీక్

ఇన్నాళ్లు జ్యోత్స్న పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు కారణం అదే. కార్తీక్‌ను మనసులో పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంటే ఆ జీవితం సరిగా ఉండదు. నేను మీరు పెట్టిన పెళ్లి ప్రపోజల్‌ను రెజెక్ట్ చేస్తున్నాను. నేను జ్యోత్స్నను పెళ్లి చేసుకోలేను అని సూరజ్ అంటాడు. ఏంటీ నన్ను పెళ్లి చేసుకోవా అని జ్యో అంటే.. అవును, నేనే నిన్ను రెజెక్ట్ చేస్తున్నాను అని సూరజ్ అంటాడు.

బంగారం బంగారం అంటూ వెంటపడ్డావ్. మనిద్దరికి రాసిపెట్టిందన్నావ్. ఇంటిముందు పెళ్లి చేసుకుందాం అన్నావ్ అని సూరజ్ చెప్పి అదంతా అబద్ధమేనా అని అడుగుతుంది జ్యోత్స్న. నిజమే. అదంతా నాకు జ్యోత్స్న మీదున్న ఇష్టాలు నా మీద ఉన్న ఇష్టాలు కాదని సూరజ్ అంటాడు. తన మనసులో కార్తీక్ లేడని చెబితే అభ్యంతరం లేదుగా అని సుమిత్ర అంటుంది.

లేదు కానీ బలవంతంగా చెప్పించండం కాదు. నా మాటల్లో, చేతల్లో కళ్లల్లో జ్యోపై ఇష్టం ఎలా కనిపిస్తుందే తనలో నా మీద ప్రేమ కనిపించినప్పుడు జ్యోత్స్న మెడలో తాళి కడతాను అని సూరజ్ అంటాడు. అది జరగదు కాబట్టి పెళ్లి ప్రపోజల్ రెజెక్ట్ చేస్తున్నాను అని సూరజ్ అంటాడు. జ్యోత్స్న కోప్పడితే నేనే నిన్ను రెజెక్ట్ చేస్తున్నా అని సూరజ్ అంటాడు.

ట్విస్టులే ట్విస్టులు

పెద్దవాళ్లు చెప్పేది వినాలిగా అని కార్తీక్ అంటే.. సారీ బ్రదర్ జ్యోత్స్న మిమ్మల్ని మర్చిపోలేదు అని సూరజ్ అంటాడు. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe