కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న తప్పించుకోవడం గురించి దీపకు చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నను మళ్లీ టెస్ట్‌లు చేయించాలని మావయ్య అనుకుంటున్నాడని కార్తీక్ చెబుతాడు. ఈసారి మనం చెప్పకుండానే అందరికి తెలుస్తుంది అని దీప అంటుంది.
మామయ్యను దాచినట్లు అనిపిస్తుంది

జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావు. నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావ్ కాబట్టి నువ్వే కాపాడుతావ్. దాసు మావయ్య నిజం చెప్పడానికి రాడు. జ్యోత్స్న మావయ్యను దాచినట్లు అనిపిస్తుంది. ఇక నువ్వు చీకటి పరదా దాటి రావాల్సిందే. ఇదే లాస్ట్ రౌండ్ అని కార్తీక్ అంటాడు. మరోవైపు దాసుతో జ్యోత్స్న కాల్ మాట్లాడుతుంది.
ఈసారి నేను నీకు కథ చెబుతాను. భయం అవుతుంది నాన్న. నాకోసం ఏం చేయవా నాన్న. అందరం కలిసి ఉందాం నాన్న అని జ్యోత్స్న అంటే దాసు సెటైర్లు వేస్తాడు. నీలాంటి తండ్రికి ఆ నరకంలో కూడా చోటు దొరకదు. నీకు ఫోన్ చేయడం కూడా నాదే తప్పు. ఈ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. నేను ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాను నాన్న అని జ్యోత్స్న అనుకుంటుంది.
మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్తారు కార్తీక్, దీప. ఆనందం, బరువు గురించి మాట్లాడుకుంటారు. నీ పక్కన ఉంటే నేను ఎక్కడున్నా నేను రాణినే. ఈ రాజుకు సింహాసనం, కిరిటాలు అవసరం లేదు అని దీప అంటుంది. నీ స్థానంలో నువ్వు ఉండటమే న్యాయం. అందుకే నేను వేస్తున్న రోడ్లు ఇవి అని తాను చేస్తున్న పనుల గురించి అంటాడు కార్తీక్.
డాక్టర్ కాల్
ఇంతలో కార్తీక్కు డాక్టర్ కాల్ చేస్తుంది. రిపోర్ట్స్ వచ్చాయని చెబుతుంది. దాంతో కార్తీక్, దీప హాస్పిటల్‌కు వెళ్తారు. మరోవైపు ఇంట్లో తలకు శివ నామం పెట్టుకుని ఇంట్లో దూపం వేస్తుంది పారిజాతం. అది చూసి శివ నారాయణ షాక్ అవుతాడు. ఇదంతా ఏంటని అడుగుతాడు. జ్యోత్స్న పనులు గుర్తుకు చేసుకుని భయపడిన పారిజాతం ఇంట్లో అందరి మంచి కోసం అని చెబుతుంది.
{{/usCountry}}ఇంతలో కార్తీక్కు డాక్టర్ కాల్ చేస్తుంది. రిపోర్ట్స్ వచ్చాయని చెబుతుంది. దాంతో కార్తీక్, దీప హాస్పిటల్‌కు వెళ్తారు. మరోవైపు ఇంట్లో తలకు శివ నామం పెట్టుకుని ఇంట్లో దూపం వేస్తుంది పారిజాతం. అది చూసి శివ నారాయణ షాక్ అవుతాడు. ఇదంతా ఏంటని అడుగుతాడు. జ్యోత్స్న పనులు గుర్తుకు చేసుకుని భయపడిన పారిజాతం ఇంట్లో అందరి మంచి కోసం అని చెబుతుంది.
{{/usCountry}}ఇంతలో దశరథ్ వచ్చి జ్యోత్స్నకు మళ్లీ టెస్ట్‌లు చేయించాలి, జ్యోత్స్న ప్రవర్తన కూడా సరిగా లేదు. అందుకే జ్యోత్స్నకు చెప్పకుండా తీసుకెళ్లాలని అంటాడు. పారిజాతం చెప్పేందుకు వెళ్తే శివ నారాయణ ఆపుతాడు. జ్యోత్స్నను పిలుస్తాడు. జ్యోత్స్న వస్తుంది. మనం బయటకెళ్లాలని శివ నారాయణ అంటాడు. పారిజాతం సైగ చేయబోతుంటే శివ నారాయణ అడ్డుపడి సుమిత్రను చూసుకోమంటాడు.
దశరథ్, జ్యోత్స్న, శివ నారాయణ బయలుదేరుతారు. మరోవైపు దీప శాంపిల్స్ సుమిత్రకు మ్యాచ్ అవడం ఏంటీ. అలా జరగాలంటే దీప కూతురు అయిండాలని డాక్టర్ హారిక అంటుంది. మీరు అనుకుంది నిజమే. కానీ, దీప తన కూతురు అని మా ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు అని కార్తీక్ అంటాడు. ఈ విషయం వెంటనే దశరథ్‌కు చెప్పాలి అని హారిక కాల్ చేయబోతుంటే కార్తీక్ వద్దంటాడు.
అమ్మను కాపాడుకోలేవు
బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినంత ఈజీ కాదు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లంట్ చేయడమంటే. కూతురు అని తెలియకుండా ఎలా చేస్తారనుకున్నావ్ అని హారిక అంటుంది. అదంతా నేను చూసుకుంటాను అని కార్తీక్ అంటాడు. కానీ, నేను మీ అత్తను బతికించలేను. నువ్వు నీ అమ్మను కాపాడుకోలేవు దీప. అది సాధ్యం కాదు. నేను చెప్పబోయేది వింటే మీరు తట్టుకోలేరు అని హారిక అంటుంది.
ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్. మీ అమ్మ బతకాలంటే నీ కడుపులో ఉన్న ప్రాణాన్ని వదులుకోవాలి అని హారిక అంటుంది. దాంతో కార్తీక్, దీప షాక్ అయి లేచి నిల్చుంటారు. నీ బాడీ కండిషన్ బాగా లేనప్పుడు నువ్వు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లంట్ చేయకూడదు. ఒకవేళ చేసిన కడుపులో బిడ్డ బతకదు. నువ్వు గర్భవతివని అన్ని టెస్టులు చేయించాను. నీ ఆరోగ్యం బాగోలేదు. ఈ ట్రాన్స్‌ప్లంట్‌కు నువ్వు పనికిరావు అని డాక్టర్ హారిక చెబుతుంది.
దాంతో ఇద్దరు షాక్ అవుతారు. అయినా రిస్క్ చేస్తానంటే కన్నతల్లి ప్రాణం కోసం కడుపులోను ప్రాణాన్ని వదులుకోవాలి. ఏ ప్రాణం వదులుకుంటావ్. ఏ ప్రాణం కాపాడుకుంటావ్ అని హారిక అడుగుతుంది.
గుండె పట్టుకున్న కార్తీక్
ఇది నేనే ఒప్పుకోను. ఒక ప్రాణం కాపాడేందుకు ఇంకో ప్రాణాన్ని తీయగలనా. మీ బిడ్డ ప్రాణాన్ని తీసుకోగలరా కార్తీక్ అని హారిక అంటుంది. దాంతో షాక్‌తో గుండె పట్టుకుని కుర్చీ మీద చేయి వేసి కూలిపోతుంటాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.