కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఆస్పత్రిలో జ్యోత్స్నకు టెస్టులు- భయంతో చచ్చిపోతున్న జ్యో- ఇంటికి శాపంగా కాంచన కన్నీళ్లు

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 17వ ఎపిసోడ్‌లో సుమిత్రకు నిజం తెలియడంతో స్పృహ తప్పి పడిపోతుంది. డాక్టర్ వచ్చి సుమిత్రకు ధైర్యం చెబుతుంది. భయపడితే త్వరగా చస్తారని, మీకు పునర్జన్మ ఇచ్చేది మీ కూతురే, జ్యోత్స్న, దీపతో మీకు ఇద్దరు కూతుళ్లు అని డాక్టర్ చెబుతుంది. జ్యోత్స్నకు టెస్టులు చేయాలని డాక్టర్ అంటుంది.

Published on: Jan 17, 2026, 07:10:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నిజం చెప్పినందుకు జ్యోత్స్నను తిడుతుంది దీప. జ్యోత్స్న నా కూతురు కాబట్టే నాకు నిజం చెప్పింది. నువ్వు అయితే నేను చచ్చిపోయిన పర్వాలేదనుకుని చెప్పేదానివి కాదు అని సుమిత్ర అంటుంది. దానికి దీప బాధ పడుతుంది. సుమిత్ర స్పృహ తప్పి పడిపోతుంది.

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 17వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 17వ తేది ఎపిసోడ్

జరిగింది మర్చిపోదాం

మరోవైపు స్వప్నకు కాల్ చేసిన కాశీ మనిద్దరం విడిగా ఉందాం. వేరే ఇల్లు తీసుకుంటాను. నిన్ను బాగా చూసుకుంటాను, జరిగింది మర్చిపోదాం అని అంటాడు. కానీ, స్వప్న వినదు. మనం విడిపోదాం అని గట్టిగా చెబుతుంది స్వప్న. నువ్వు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావాల్సిందే అని కాశీ అనుకుంటాడు.

మరోవైపు డాక్టర్ వచ్చి సుమిత్రకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. భయం ఎంత చెడ్డతో చెబుతుంది. భయం వల్లే త్వరగా చనిపోతారని డాక్టర్ చెబుతుంది. కానీ, మీ సమస్యకు పరిష్కారం ఉంది. అది మీ కూతురే అని జ్యోత్స్నతో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయించడం గురించి చెబుతుంది డాక్టర్. నీ కన్నకూతురే మీ ప్రాణదాత అని డాక్టర్ అంటుంది.

జ్యోత్స్నకు టెస్ట్‌లు

ఈరోజు మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి. దానికంటే ముందు జ్యోత్స్నకు కొన్ని టెస్ట్‌లు చేయాలి అని డాక్టర్ అంటుంది. కార్తీక్‌ను తీసుకెళ్లమని దశరథ్ అంటాడు. తోడుగా పారిజాతం కూడా వస్తానంటుంది. అయినా వాళ్లు మీ చుట్టూ ఉంటే మీకు ఏం కాదు. అందరేమే కానీ మీరు త్వరగా నయం కావాలని దీప చాలా కోరుకుంది. ఇప్పటికీ ఆమె కన్నీళ్లు అలాగే ఉన్నాయి. మీకు వ్యక్తిగతంగా ఏమైనా సంబంధం ఉందా అని డాక్టర్ అడుగుతుంది.

లేదు కానీ, కార్తీక్ భార్య కాబట్టి కూతురు అవుతుంది అని సుమిత్ర అంటుంది. అయితే మీకు ఇద్దరు కూతుళ్లన్నమాట. ఆ ఇద్దరే నిన్ను కాపాడుతారు అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. టెస్ట్‌లకు వెళ్దామా అని కార్తీక్ అంటే.. జ్యోత్స్న భయంతో చచ్చిపోతుంది. నా పాపం బయట పడే రోజు బయటపడుతుందని పారు కూడా భయపడుతుంది. నిన్ను కన్న నాకు నీ రుణం తీరే రోజు వచ్చింది. నాకు పునర్జన్మ ఇచ్చిన నా ప్రాణదాతవి కాబోతున్నావని కూతురు జ్యోత్స్నతో సుమిత్ర అంటుంది.

నిజాలు బయటపడతాయనా

అవును అని కార్తీక్ అంటాడు. కార్తీక్‌ను ఆగమని పైకి వెళ్తుంది జ్యోత్స్న. వెంటే పారిజాతం వస్తుంది. టెన్షన్‌తో చచ్చిపోతున్న, ఏం చేయాలో తెలియక చచ్చిపోతున్నా, అక్కడికి వెళ్లి తప్పించుకోవడం కష్టం అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే వచ్చిన దీపను చూసి ఇద్దరు షాక్ అవుతారు. కింద మా బావ వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, దేనికి భయపడుతున్నారు, నిజాలు బయటపడతాయనా అని దీప అంటుంది.

ఏంటా నిజాలు అని ఇద్దరు అంటే సుమిత్ర అమ్మ గురించి బయటపెట్టారుగా అని కవర్ చేస్తుంది దీప. అమ్మాయి గారు జాగ్రత్త. అమ్మను కాపాడాల్సింది మీరేగా అని దీప వెళ్లిపోతుంది. దీని వాలకం చూస్తుంటే నిజం తెలిసిపోయినట్లే ఉందే అని పారు అంటే.. అలా ఎలా తెలుస్తుందని జ్యోత్స్న అంటుంది. హాస్పిటల్‌కు వెళ్లి అక్కడ ఏదో ఒకటి చేద్దాం అని జ్యోత్స్నను పారిజాతం తీసుకెళ్తుంది.

ఆడపడుచు కన్నీళ్లు శాపంగా

మరోవైపు కాంచన శివ నారాయణకు కాల్ చేస్తుంది. కష్టాలు, గండాల గురించి మాట్లాడుకుంటున్నారు. పంతులు గారు ఓ రోజు చెప్పారు. ఈ ఇంటి ఆడపడుచు (కాంచన) కన్నీళ్లు ఇంటికి శాపంగా మారి ఉంటుంది అమ్మా. నాకు ఇష్టమైన వాళ్లు ఎప్పుడు నాతో ఉండరు. సుమిత్రకు నిజం తెలిసిపోయింది అని జరిగింది చెబుతాడు శివ నారాయణ. నాకు వచ్చిన పరిస్థితి మీ అన్నయ్యకు వచ్చినట్టు అనిపిస్తుందని శివ నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ఏం చేస్తావో నాకు తెలియదు. వదినను ఎలాగైనా కాపాడాలి. చిన్న పిల్లాడిలా ఏడవకు. ధైర్యంగా ఉండి మమ్మల్ని నడిపించు అని కాంచన అంటుంది. సరేనమ్మా. కాస్తా టైమ్ ఇవ్వు అని శివ నారాయణ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More