Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్ ముందు అబద్ధాలు చెప్పినందుకు పారిజాతంను కార్తీక్ నిలదీస్తాడు. జ్యోత్స్నకు ఎందుకు ఇంత పెద్ద అన్యాయం చేశావని కార్తీక్ అంటాడు. అసలు జ్యోత్స్నకు అన్యాయం చేసింది మీరు. సూరజ్ గాడిని జ్యోత్స్న జీవితంలోకి తీసుకొచ్చింది మీరని పారు అంటుంది.
సూరజ్ గాడికి ఏమైనా క్యారెక్టర్ ఉందా

అరిగిపోయిన టేప్ రికార్డుల ఒకటే మాట ఎన్నిసార్లు చెబుతారు. మమ్మల్ని అనేందుకు ఇదో సాకు అయిపోయింది. ఆరోజు సూరజ్ చేసిన మోసం కంటే ఇవాళ నువ్వు చేసింది పెద్ద మోసం. వాడు జ్యోత్స్న జీవితం మీద కొడితే నువ్వు జ్యోత్స్య క్యారెక్టర్ మీద కొట్టావ్ అని కార్తీక్ అంటాడు. ఆ సూరజ్ గాడికి ఏమైనా క్యారెక్టర్ ఉందా. అలాంటివాళ్లముందు క్యారెక్టర్ కోసం చూడటం మూర్ఖత్వం అని పారిజాతం అంటుంది.
అక్కడెందుకు అబద్ధాలు చెప్పావ్. డబ్బుకోసం జ్యో నిన్ను పంపిందా అని పారిజాతంపైకి కోపంగా వెళ్తాడు కార్తీక్. మీద మీదకు వస్తావేంట్రా. కొడతావా అని పారు అంటే.. చావు దెబ్బ నువ్వు కొట్టావుగా అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నను నేను కాపాడాను. ఇప్పుడు జ్యోత్స్న మొహం సూరజ్ గాడు చూడడు. ఇప్పుడైనా దీనికి బుద్ధి వస్తుందని పారు అంటుంది.
నీకు కొంచెం కూడా పాపం అనిపించట్లేదా అని కార్తీక్ అంటాడు. సూరజ్ చుట్టూ ఇది మతిలేనిదానిలా తిరిగే కంటే నాకు పాపం అంటుకున్న పర్వాలేదని పారు అంటుంది. ఎంతకు అమ్ముడుపోయావ్. మాలిని పిన్ని నిన్ను ఎంతకు కొంది అని కార్తీక్ అడుగుతాడు. మాలిని చాలా మంచిది కాబట్టి జ్యోత్స్న నా కొడుకు వెంట ఎన్నాళ్లు తిరిగినా దానికే టైమ్ వేస్ట్ తప్పా దాన్ని నా కోడలు అవ్వనివ్వనని సోఫా గుద్ది మరి చెప్పిందని జరిగింది చెబుతుంది పారిజాతం.
నువ్వు చచ్చిపోయావ్ గ్రానీ
ప్రేమ అనే ఊబిలో పడిన జ్యోత్స్న బయటకు లాగాను. ఇది పాత జ్యోత్స్న అయితే సూరజ్ గాడిని బయటకు పంపేది. కానీ, ఇది మారిపోయింది. చేతకానిది అయిపోయింది. ఇది పాత జ్యోత్స్నలా మారేందుకు ఇంకా ఏమైనా చేస్తాను. మీ వల్ల కానిది నేను చేసి చూపిస్తాను. జ్యోత్స్న కోసం ఎంత దూరమైన వెళ్తాను అని పారిజాతం అంటుంది.
{{/usCountry}}ప్రేమ అనే ఊబిలో పడిన జ్యోత్స్న బయటకు లాగాను. ఇది పాత జ్యోత్స్న అయితే సూరజ్ గాడిని బయటకు పంపేది. కానీ, ఇది మారిపోయింది. చేతకానిది అయిపోయింది. ఇది పాత జ్యోత్స్నలా మారేందుకు ఇంకా ఏమైనా చేస్తాను. మీ వల్ల కానిది నేను చేసి చూపిస్తాను. జ్యోత్స్న కోసం ఎంత దూరమైన వెళ్తాను అని పారిజాతం అంటుంది.
{{/usCountry}}ఇక చాలు ఆపుతావా. ఇప్పటికీ నువ్వు చేసింది చాలు అని జ్యోత్స్న అంటుంది. నీ మంచికోసమే చేశానే. అంత మర్చిపో. నువ్వు మారిపో. నీ గుండె రాయి చేసుకో. సూరజ్ గాడు నీ లైఫ్‌లో లేనట్లే అని పారిజాతం అంటుంది. వాడు కాదు గ్రానీ నువ్వు నా లైఫ్‌లో లేవు. చచ్చిపోయావ్. నన్ను చంపేసి నువ్వు చచ్చిపోయావ్ గ్రానీ. పాత జ్యోత్స్న ఏనాడో చచ్చిపోయింది. అది మళ్లీ బతకదు. ఒకవేళ బ్రతికొస్తే నిన్ను ప్రాణాలతో ఉంచదు అని జ్యోత్స్న కోపంగా వార్నింగ్ ఇస్తుంది.
జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది. కట్ చేస్తే బెడ్ మీద ఉండి సూరజ్ మాటలను తలుచుకుంటూ బాధపడుతుంది. ఇంకోవైపు తాళి పట్టుకుని సూరజ్ బాధపడతాడు. సుమిత్ర వచ్చి జ్యోని, సూరజ్‌ను మాలిని భోజనానికి పిలుస్తారు. జ్యో, సూరజ్ అన్నం కలపుతుంటారు కానీ ఆలోచనలతో తినకుండా ఉంటారు. జ్యోత్స్న ఎందుకు అలా ఉందని శివ నారాయణ అడుగుతాడు.
పారును ఇరికించిన కార్తీక్
జ్యోత్స్న అంటే గిట్టనివాళ్లు ఆఫీస్‌లో జ్యోత్స్న నిజాయతీపై నింద వేశారని, ఈ విషయం పారుకు తెలుసు. నిజాయతీ పోతే ఇంత బాధపడాలా అని పారు అందని ఇరికిస్తాడు కార్తీక్. దాంతో పారును శివ నారాయణ కోప్పడతాడు. తిట్లదండకం చదువుతాడు. పగ ఇలా తీర్చుకున్నావు కదరా అని పారు అనుకుంటుంది. ఇటు జ్యో అటు సూరజ్ తినకుండా వెళ్లిపోతారు.
జ్యోత్స్న తినకుండా వెళ్తే దశరథ్ అడుగుతాడు. నేను తినిపిస్తాలే నాన్న అని దీప అంటుంది. అంతా షాక్ అవుతారు. ఏదో ప్రేమతో పిలిచింది అని కార్తీక్ కవర్ చేస్తాడు. జ్యోత్స్నకు దీప అన్నం తినిపిస్తుంది. మనం చేయని తప్పుకు మనమెప్పుడు శిక్ష అనుభవించకూడదు అని తినిపిస్తుంది దీప. మరోవైపు సూరజ్ తిరిగి వచ్చి భోజనం చేస్తుంటాడు.
ఎవరి కోసమో నేనెందుకు భోజనం మానేయాలి. తింటాను అని సూరజ్ అంటాడు. నేను అనుకుంది జరుగుతుంది. జ్యోత్స్నను సూరజ్ మర్చిపోతాడని మాలిని అనుకుంటుంది. జ్యోత్స్న నాటకాలు చాలా త్వరగానే తెలుసుకున్నావ్ అని మాలిని అంటుంది. ఎవరు ఎలాంటివాళ్లో కాలమే నిర్ణయిస్తుందని దక్షిణామూర్తి అంటాడు. పారిజాతం చెప్పినంతమాత్రాన నీ మీద మచ్చ పడదు. ఇదంతా మాలిని ఆడిన ఆట. నువ్వు నీలాగే ఉండు అని దీప అంటుంది.
ముగ్గు వేసిన కార్తీక్
మరుసటి రోజు ఉదయం కార్తీక్ ముగ్గు వేస్తాడు. రాత్రంతా నిద్ర పట్టలేదని కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. దీప ఎలా ఉండాల్సింది. ఎక్కడ మొదలుపెట్టిన ప్రయాణం ఎక్కడికి వచ్చింది. జీవితమే పీడకల అయిపోయింది. మన గురించి మనం ఆలోచించుకుని ఎన్ని నెలలు దాటిపోయింది. నిజం చెప్పాలంటే మనల్ని మనమే మర్చిపోయాం. గట్టుకు చేరుకునేలోపే సముద్రంలో తీసుకెళ్లి పడేస్తున్నారు అని కార్తీక్ అంటాడు.
తాత ఆస్తులు పోగొట్టుకుంటే మనం ఆశలు పొగొట్టుకున్నాం అని కార్తీక్ అంటాడు. మనం అంటే ముగ్గురమే. మన పడవలో అందరం ఉన్నాం. అందరి గురించి ఆలోచించాలని దీప అంటుంది. శౌర్యకు మంచి జీవితం ఇవ్వాలి. తాత ఆస్తులు తాతకు ఇవ్వాలి. నిన్ను వారసురాలిగా వాళ్లముందు నిలబెట్టాలనుకున్నాం. ఎవరికి ఎంత న్యాయం చేస్తానో తెలియదు. కానీ, నీకైనా భర్తగా న్యాయం చేయాలని కార్తీక్ అంటాడు.
ఇప్పుడు నేను శివ నారాయణ గారి మనవరాలిని అని చెప్పుకుంటే ఏమైనా లాభమా. ఏం లేనప్పుడు బాధపడటం ఎందుకని దీప సర్దిచెబుతుంది. ఈ ఉదయం లాగే మన జీవితంలో వెలుగు వస్తుంది. ఈ ముగ్గులాగే అన్ని నీ చేతులతో జరుగుతాయని దీప అంటుంది. ఆ ఇంట్లో కూడా నిద్రపోని మనుషులు ఉంటారని దీప అంటుంది. మరోవైపు దక్షిణామూర్తి దిగాలుగా ఉంటే మాలిని కాఫీ ఇస్తుంది.
మళ్లీ మొదటికి తెచ్చేలా ఉన్నాడు
రాత్రంతా ఆలోచిస్తూ పడుకుకుండా ఇక్కడే ఉన్నట్లు ఉన్నారు. జరిగింది నమ్మలేకపోతున్నట్లు ఉన్నారని మాలిని అంటుంది. ఇంట్లో మనిషి చెప్పినప్పుడు నమ్మకుండా ఎందుకు ఉంటానని, ఒకవేళ పారిజాతం చెప్పింది అబద్ధం అని జ్యోత్స్న చెప్పుంటే అందుకు కారణం ఇంకేదైనా ఉండేదనుకునేవాన్ని. కానీ, జ్యోత్స్న వారించలేదని ఉందంటే నిజమే కదా అని దక్షిణామార్తి అంటాడు.
సూరజ్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా వస్తాడు. సూరజ్ అంతా వదిలేశాడని మాలిని అంటే.. మనసులోని మనిషిని ఎలా మర్చిపోతాడమ్మా. అది కూడా అలవాటు లాంటిదే. ఎంతలా దూరం పెట్టాలనుకుంటే అంతలా గుర్తుకొస్తాయని దక్షిణామార్తి అంటాడు. చూస్తుంటే మావయ్య గారు కథ అంతా మళ్లీ మొదటికి తెచ్చేలా ఉన్నాడని మాలిని మనసులో అనుకుంటుంది.
మనసు ఎంత బలహీనంగా ఉంటే మనిషి అంత బాధపడతాడు. జ్యోత్స్న నా అత్తకూతురే. నిన్ను జ్యోత్స్నకు దగ్గరగా చేయాలనుకుంటున్నా. కానీ అదంతా ఒక్క రాత్రిలో జరగదు. మనుషులు అపార్థాలు దాటి రావాలని, అర్థమయ్యే క్రమంలోనే ఊహించని వ్యక్తిత్వాలు బయటపడితే డైజెస్ట్ చేసుకోవడం కష్టం.. మర్చిపోడానికి అని సూరజ్ అంటాడు.
సూరజ్ తాళి కట్టకుండా మంచిపనే చేశాడు
వీడు మనసు ఎంతగా విరిగిపోయిందో అర్థమవుతోందని మాలిని అనుకుంటుంది. జ్యోత్స్న విషయంలో మనింట్లో జరిగింది అంతా అబద్ధం అయితే బాగుండు అనిపిస్తుందని, ఇదంతా పారిజాతం కావాలని చేస్తే బాగుండనిపిస్తుందని దక్షిణామూర్తి అంటాడు. పారిజాతం కావాలని ఎందుకు చేస్తుందని. పారిజాతం ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషి అని మాలిని అంటుంది.
జ్యోత్స్న మెడలో సూరజ్ తాళికట్టకుండా మంచిపనే చేశాడని నాకు ఇప్పుడు అనిపిస్తుందని మాలిని అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.