Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- మాలినిపై కేసు, ఎస్సై కండిషన్స్- వంట మనిషిగా సుమిత్ర- సూరజ్ పశ్చాత్తాపం

Karthika Deepam 2 Serial October 24th Episode: కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 24వ ఎపిసోడ్‌‌‌లో మాలినిపైనే అనుమానం ఉందని జ్యోత్స్న చెబుతుంది. దాంతో మాలినికి తమకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకూడదని ఎస్సై కండిషన్స్ పెడతాడు. శివ నారాయణ తనకున్న హోటల్ ప్లాన్ గురించి చెబుతాడు. సుమిత్ర వంట మనిషిగా చేరుతుంది.

Published on: Oct 24, 2026, 07:23:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న కిడ్నాప్ గురించి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మీకు అనుమానం ఉన్న వ్యక్తులు ఎక్కడున్నారని ఎస్సై అడిగితే.. ఇక్కడే ఉన్నారని చెబుతుంది జ్యోత్స్న. దాంతో అంతా షాక్ అవుతారు.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 24 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 24 ఎపిసోడ్

మాలినిపైనే అనుమానం ఉంది

అంటే ఈ ఆఫీస్‌లోనే ఉన్నారా. మీ అనుమానం ఎవరి మీద అని ఎస్సై అడుగుతాడు. దాంతో మాలినివైపు వేలు చూపిస్తుంది జ్యోత్స్న. మాలిని ఉలిక్కిపడుతుంది. నాకున్న అనుమానం ఛైర్మన్ గారి అమ్మగారి మీదే అని జ్యోత్స్న అంటుంది. నీకు అనుమానం ఉంటే సరిపోతుందానే. ఆధారాలు చూపించే.. లేకుంటే నీ మీద రివర్స్ కేసు పెడతాను. పరువు నష్టం దావా వేస్తాను అని మాలిని అరుస్తుంది.

ఎందుకో కారణం చెప్పాలని సూరజ్ అడుగుతాడు. ఆధారాలు కూడా ఉన్నాయని జ్యో అంటుంది. అవేంటో చూపించమని ఎస్సై అడుగుతాడు. మాలిని గారు నన్ను చాలా సార్లు తిట్టారు, నేను ఆఫీస్‌లో జాబ్ చేయడం నచ్చదు. సూరజ్ గారికి కూడా ఇష్టం లేదు అని సూరజ్ పంపిన వాయిస్ రికార్డ్స్ వినిపిస్తుంది జ్యోత్స్న. దానికి దీనికి సంబంధం ఏంటని ఎస్సై అడుగుతాడు.

సూరజ్ గారు తిట్టింది మాలిని గారి వల్లే అని జ్యోత్స్న అంటుంది. మా అమ్మ వల్ల తిట్టడం ఏంటీ. నువ్వు రిప్లై ఇవ్వలేదని అన్నాను. అయినా అవి తిట్లు కాదు నా మాటలు అని సూరజ్ అంటాడు. సరే మీకు మాటలు మాకు తిట్లు. అయినా నేను రిప్లై ఇవ్వకపోడానికి కారణం ఏంటీ నేను మాయమైపోవడం. అందుకు నాకు ఎవరి మీద డౌట్ ఉందని జ్యో అంటే.. మా అమ్మపైనా అని సూరజ్ అంటాడు.

మాలినికి ఎస్సై కండిషన్స్

ఇప్పటికైనా లాజిక్ అర్థమైందా అని జ్యో అంటుంది. నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. మాలిని మేడమ్ గారు జ్యోత్స్న కనిపించకుండా పోయినందుకు కారణం అయ్యారు కాబట్టి సూరజ్ గారు తిట్టారు. ఇప్పుడు చెప్పు జ్యోత్స్న కనిపించకుండా పోవడానికి కారణం ఎవరని కార్తీక్ అంటాడు. మాలిని అని దీప అంటుంది. మాలిని అరుస్తుంది. అనుమానం ఉందన్నమాత్రానా తప్పు చేసినట్లు కాదమ్మా. నిజాలు పోలీసులు కనిపెడతారని సూరజ్ అంటాడు.

నువ్వు తప్పు చేయలేదు కాబట్టి జ్యోత్స్న ఆరోపణ తప్పు అని తేలుతుందని సూరజ్ అంటాడు. అవును, కానీ, అప్పటివరకు మాలినిపై కేసు అలాగే ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలన్న పోలీస్ స్టేషన్‌లో ఇన్ఫార్మ్ ఇవ్వాలి. మాకు తెలియకుండా వేరే స్టేట్ కానీ, కంట్రీగానీ వెళ్లకూడదు. అవసరం అయితే ఎంక్వైరీకి వస్తాం. లేదా మీరు పోలీస్ స్టేషన్‌కి రావాల్సి ఉంటుందని ఎస్సై కండిషన్స్ పెడతాడు.

సరే. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని సూరజ్ అంటాడు. ఈ కేసుకు సంబంధించి మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చని ఎస్సై వెళ్లిపోతాడు. కార్తీక్, దీప, జ్యో వెళ్లిపోతారు. మాలిని చిరాకుగా ఉంటారు. జ్యోని ఇంకాస్తా జాగ్రత్తగా ఉండమని చెప్పిన ఎస్సై కార్తీక్‌కు షెక్ హ్యాండ్ ఇస్తాడు. అది చూసిన మాలిని ఇదంతా కార్తీక్ గాడి పనా. చెబుతా అని మాలిని అనుకుంటుంది.

శివనారాయణ హోటల్ ప్లాన్

మరోవైపు కిరాణ సామానుకు డబ్బులు వచ్చే దారిలో కడతానని అడిగి తీసుకుంటాడు దశరథ. ఈ బండి ఓనర్ కూడా డబ్బులు అడిగాడని శివ నారాయణ అంటే.. సరిపోతాయి కదా అని దశరథ అంటాడు. సంపాదన ఖర్చులకు, అవసరాలకు సరిపోతే జీవితంలో ఎదుగుదల ఉండదు. ఈ చివర్లో చిన్న కొట్టు ఉంది. చిన్న హోటల్ పెట్టుకునేందుకు మంచి స్థలం ఉంది. నేను ఓనర్‌తో మాట్లాడితే 3 నెలల అడ్వాన్స్ అడిగాడు అని శివ నారాయణ అంటాడు.

దాన్ని తీసుకుని పెద్ద హోటల్ కింద మార్చాలి. తర్వాత రెస్టారెంట్ ఓపెన్ చేయాలి. అదే నా కల. కానీ, దానికి చాలా టైమ్ పట్టేలా ఉంది అని శివ నారాయణ అంటాడు. మీ బాధ నాకు అర్థమైంది. నా కూతురు పెళ్లి బారం మీ మీద పడనివ్వను. అందుకు ఏం చేయాలో తెలుసు అని సుమిత్ర మనసులో అనుకుంటుంది. డబ్బులు కట్టేందుకు దశరథ వెళ్తాడు.

సుమిత్ర కూడా వెళ్తానంటే సరేనంటాడు శివ నారాయణ. మరోవైపు కార్తీక్, దీపతో మాట్లాడిన మాలిన వీళ్ల మన ఉప్పు తింటూ విశ్వాసం లేదని అంటుంది. ఎస్సై నీ ఫ్రెండే కదా. కేసు పెట్టించింది నువ్వేగా అని మాలిని అడుగుతుంది. కూతురు మిస్ అయితే కేసు పెట్టరా. రేపు నీ కొడుకు మిస్ అయితే కేసు పెట్టవా అని కార్తీక్ అంటాడు.

మాలినికి దీప వార్నింగ్

ఎగ్జాంపుల్ చెబుతున్నావా ఫ్యూచర్ చెబుతున్నావా. నా మీద అనుమానం ఉందని నింద వేసింది. దాన్ని కేసు వెనక్కి తీసుకోమ్మని చెప్పండి అని మాలిని అడుగుతుంది. ఇక్కడ పీఏ జాబ్ చేయొద్దని అందరూ చెప్పారు. వినిందా. అలాంటిది మా మాట ఎందుకు వింటుంది. విన్నా కూడా మేమెందుకు చెప్పాలి. నీ మాట మేమెందుకు వినాలి అని కార్తీక్ రివర్స్ అవుతాడు.

ఇది ఎవ్వరికి మంచిదికాదని మాలిని అంటే.. నీకైతే అస్సలు మంచిది కాదు. జ్యోత్స్న బాగా కాలుతున్న పెనంలాంటిది. అది నీ మీద పడిందని కార్తీక్ అంటాడు. అత్తకు పెద్ద కష్టమే వచ్చిందని దీప అంటుంది. నాకు కోపం తెప్పిస్తే ఏం చేస్తానో తెలియదని మాలిని అంటే.. నీకే తెలియనప్పుడు ఎలా చేస్తావ్. ఎందుకు వణుకుతున్నావ్. దేనికి భయపడుతున్నావ్. అనవసరంగా జ్యోని వదిలేశానని ఫీల్ అవుతున్నావా అని దీప అంటుంది.

మాది రహదారి. మంచి అనిపించింది చేసుకుంటూ వెళ్తాం. దారిలో ఎవరు ఎదురొచ్చిన ముత్యాలమ్మ జాతరే. దయచేసి మా ఫ్యామిలీ జోలికి రావొద్దు అని మాలినికి దీప వార్నింగ్ ఇస్తుంది. ఇద్దరు వెళ్లిపోతారు. చూస్తుంటే.. మీ గురించి అంతా తెలిసిపోయేలా ఉందని బాడీగార్డ్ విజయ్ అంటాడు. తెలియాలంటే కేసు ఉండాలిగా. అది చెప్పాల్సింది చెప్పింది నేను చేయాల్సింది చేస్తానని మాలిని అంటుంది.

వంట మనిషిగా సుమిత్ర

మరోవైపు ఓ ఇంట్లో వంట మనిషిగా సుమిత్ర పని చేస్తుంటుంది. వంట బాగా చేస్తావనే లోనికి రానిచ్చాను. వంట మాకు నచ్చాలి. ముఖ్యంగా మా ఆయనకి. ఆయనకు నచ్చితే నీకు వంట మనిషిగా ఉద్యోగం దొరికినట్లే. కానీ, అందరి వంటలు ఆయనకు నచ్చవు అని ఒకావిడ అంటుంది. నాకు వంట రాక మేము ఇంతకాలం జ్యోత్స్న రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్నాం. అంతలా చేయకున్నా బాగా చేస్తే చాలు అని ఆవిడ అంటుంది.

సుమిత్ర కొన్ని ఐటమ్స్ చేసి ఇస్తుంది. వాటిని తినేసి ఆవిడ భర్త వెళ్లిపోతాడు. ఆయన అలా వెళ్లాలంటే వంటలు నచ్చాయని అర్థం అని చెబుతుంది. ఆవిడ కూడా తిని చాలా బాగున్నాయని. వంట మనిషిగా ఓకే. జీతం ఎంత కావాలని ఆవిడ అడుగుతుంది. జీతం ఎంత అడగాలో తెలియక మీరే చెప్పండని సుమిత్ర అంటుంది. భర్తను అడిగితే 7 వేలు ఇవ్వమని చెబుతాడు.

దాంతో సుమిత్ర సంతోషిస్తుంది. 12 గంటల్లోపు వచ్చి వంట చేసి వెళ్తానని సుమిత్ర చెబుతుంది. ఫోన్ నెంబర్ అడిగితే.. ఫోన్ లేదని చెబుతుంది సుమిత్ర. మొదటి జీతం అందగానే వెయ్యి రూపాయలతో ఫోన్ కొనుక్కో. ఈరోజు నుంచే పనిలో చేరినట్లు రాసుకుంటా. రసం పెట్టమని ఆవిడ చెప్పి వెళ్లిపోతుంది. కత్తి కోసం వెతుకుతూ సుమిత్ర చీర చినిగిపోతుంది.

వెన్నుపోటు వీరుడు శివ నారాయణ గాడు

మరోవైపు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్లి నీ మనవరాలు రుణం తీర్చుకుంది. మీ కూతురు చేయలేని పని మనవరాలు చేసిందని జ్యోత్స్న అనుమానం గురించి చెప్పడం గురించి చెబుతుంది మాలిని. నేను మాట్లాడతాను అని దక్షిణామూర్తి అంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కార్తీక్ ఫ్రెండ్. జ్యోత్స్న పనిచేస్తే సమస్యలు వస్తాయని చెప్పాను. ఇప్పుడు కార్తీక్, దీప, జ్యోత్స్న ముగ్గురు మన పతనానికి పునాది కడుతున్నారని మాలిని అంటుంది.

ఇదంతా చేయిస్తుంది ఆ వెన్నుపోటు వీరుడు శివ నారాయణ గాడు. ఈ కోడలిని కంటికిరెప్పలా కాపాడుకుంటాను. నీ జోలికి వచ్చాడంటే నా జోలికి వస్తాడు. పదా నేను ఏం చెప్పాలో అక్కడే చెబుతాను అని దక్షిణామూర్తి అంటాడు. ఇలా చేస్తే మనమే గొడవ పెంచినవాళ్లం అవుతాం కదా అని సూరజ్ అంటాడు. ఒకరిని ఊరికే బాధపెట్టడం ఎంత పెద్ద తప్పో తెలియజేయాలి. క్షమాపణ చెప్పించాలని దక్షిణామూర్తి వెళ్తాడు.

నువ్వు రావొద్దని సూరజ్‌కి చెప్పి మాలిని వెళ్తుంది. తాత అన్న మాట గుర్తుకు తెచ్చుకుని షెడ్యూల్ ప్లాన్ విషయంలో జ్యోత్స్నను తిట్టి అవమానించింది గుర్తు చేసుకుంటాడు సూరజ్. కుమిలిపోతూ పశ్చాత్తాపపడతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More