Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-జ్యోత్స్నను పని మనిషితో గెంటించమన్న సూరజ్-దక్షిణామూర్తి ఆగ్రహం-పారు శపథం
Karthika Deepam 2 Serial November 20th Episode: కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 20వ ఎపిసోడ్లో జ్యోత్స్న వెళ్తుంటే పారు అడ్డుకుంటుంది. పారు చేతిని లాగేస్తాడు కార్తీక్. మాలిని ఇంటికి వెళ్తుంది జ్యోత్స్న. మనవరాలివి అనుకున్నా. కానీ శివ నారాయణ లాగే నమ్మించి ద్రోహం చేశావని దక్షిణామూర్తి బాధతో కోప్పడతాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న గురించి సూరజ్, మాలిని, దక్షిణామూర్తి మాట్లాడుకుంటారు. జ్యోత్స్నను మీరే పట్టుకుని ఉంటున్నారు. సూరజ్ వదిలేశాడు. మీకే అర్థం కావట్లేదని మాలిని అంటుంది.

ఆస్తి అంతా తనకే అవుతుందిగా
సూరజ్‌కి జ్యోత్స్న మీద ప్రేమ ఉంది. కానీ, జ్యోత్స్న ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. పదరా జ్యోత్స్న దగ్గరికి. ఇలా ఎందుకు చేసిందో అడుగుతాను. నిన్ను పెళ్లి చేసుకుంటే 2 కోట్లు ఏంటీ ఆస్తి అంతా తనకే అవుతుందిగా. ఎందుకు ఇంత తొందరపని చేసిందో అడుగుతాను అని దక్షిణామూర్తి కంగారుగా అంటాడు. చూడబోతుంటే సూరజ్, జ్యోత్స్నను మావయ్య గారు కలిపేలా ఉన్నాడు. ఏదోటి చేయాలని మాలిని మనసులో అనుకుంటుంది.
వెళ్దాం పదా. రెండు కోట్లు కాదు. ఆస్తి మొత్తం రాసిస్తాను. నా కొడుకు కోసం ఏదైనా వదులుకోడానికి నేను సిద్ధం అని రివర్స్ డ్రామా ఆడుతుంది మాలిని. వద్దమ్మా. ఎవరి కోసం ఎవరు ఏది వదులుకోను అవసరం లేదు. ఇక్కడితో వదిలేయండని సూరజ్ వెళ్లిపోతాడు. మీకంటే వీడికే గాయం ఎక్కువైంది. నాకు తెలిసి వీడు మళ్లీ జ్యోత్స్న మొహం చూడడని మాలిని అంటుంది.
మరోవైపు జ్యోత్స్న వెళ్తుంటే పారిజాతం అడ్డుకుంటుంది. సిగ్గులేదా నీకు, రోషం పౌరుషం లేవా. ఇలా ఎంతకాలం పడతావని పారిజాతం అంటుంది. ఇప్పుడు నువ్వు నా మాటే వినాలని పారు అంటుంది. నీ మాట ఎందుకు వినాలి. అసలు నువ్వు ఎవరు అని కార్తీక్, దీప ఎంట్రీ ఇస్తారు. జ్యోత్స్న నా మనవరాలు అని పారు అంటుంది. ఈ మాట చాలా గట్టిగా చెప్పు. శివ నారాయణకు వినపడేలా చెప్పు అని కార్తీక్ అంటుంది.
నీ తప్పుకి నాకు శిక్ష పడింది
జ్యోత్స్న శివ నారాయణ మనవరాలు అని గట్టిగా అంటుంది పారు. కదా.. నువ్వేమైనా జ్యోత్స్న తల్లివా, తండ్రివా. వాళ్లే ఊరుకున్నారు. నువ్వెవరు ఆపేందుకు అని కార్తీక్ అంటాడు. 2 కోట్ల విషయం తెలిస్తే వాళ్లు వెళ్లనివ్వరు. రెండు కోట్లు వాడుకోవే అని పారు అంటుంది. ఇప్పటికే ఓ తప్పు చేశావ్. శిక్ష నాకు పడింది అని జ్యో అంటుంది.
ఏదో ఒకరోజు సూరజ్ గాడు వాళ్ల అమ్మ చెప్పిన సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు బాధపడాల్సింది ఇదే కదా అని పారిజాతం అంటుంది. కార్తీక్, దీప, పారిజాతం వాదించుకుంటారు. జ్యోత్స్న కన్నీళ్లు మింగి మళ్లీ నిల్చుందంటే ఇదే గొప్ప. నీ గురించి తెలియనంతవరకే నీ ఆటలు.. తెలిస్తే.. అని పారిజాతం చేయి పట్టి పక్కకు లాగుతాడు కార్తీక్.
నీ లక్ష్యాన్ని చేరుకునే వరకు నీ అడుగులు ఆగకూడదు. వెళ్లు అని జ్యోత్స్నను పంపిస్తాడు కార్తీక్. జ్యో వెళ్తుంది. జ్యోత్స్న విషయంలో ఏదైనా తప్పు చేస్తే నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు కార్తీక్. సూరజ్, జ్యోత్స్న ఎప్పటికీ కలవరు, కలవనివ్వను అని శపథం చేస్తుంది పారిజాతం. మాలిని ఇంటికి జ్యోత్స్న వెళ్తుంది.
మరి ఇంత స్వార్థపరురాలివి ఏంటమ్మా
జ్యోత్స్నను మాలిని అడ్డుకుంటుంది. దక్షిణామూర్తి నాకు కావాల్సినవాళ్లు ఉన్నారని జ్యోత్స్న అంటే.. ఎవరమ్మా నువ్వు. నువ్వు నాకు మనవరాలివి కాదు. శివ నారాయణ మనవరాలివి. నిన్నటి వరకు మీ తాతతో గొడవ అయ్యేది. ఇప్పుడు వాడే గెలిచాడు. నువ్వు శివ నారాయణ మనవరాలివే అని దక్షిణామూర్తి అంటాడు. అబ్బా ఇది కదా మనకు కావాల్సిందని మాలిని అనుకుంటుంది.
నా ఆశలన్నీ కొట్టుకుపోయాయి. కనిపించిదంతా ప్రేమ అనుకుని పొంగిపోయాను. నీ కష్టం చెబితే నన్ను గుర్తించావనుకున్నా. నీకు ఉద్యోగం ఇవ్వడం నా తొందరపడి చేశాను అని దక్షిణామూర్తి అంటాడు. గ్రహణం పట్టినప్పుడు పాము సూర్యుడిని మింగేసిందంటారు. అది అబద్ధమని మనకు తెలుసు. అయినా మనం అబద్ధాన్నే నమ్ముతాం. ఇది అలాంటిదే తాత అని జ్యోత్స్న అంటుంది.
ఎవరిని నమ్మించడానికి ఈ మాటలని మాలిని అంటే.. నమ్మేవాళ్లు నమ్ముతారని జ్యోత్స్న అంటుంది. ఎవరు నమ్మరమ్మా. నీది నా కూతురు పోలిక అనుకున్నా. కానీ నీకు మా తాత పోలికలు వచ్చాయి. నమ్మినవాళ్లకు ద్రోహం చేయడం వాడికి తెలిసినట్లు ఎవరికి తెలియదు. వాడి నోటి నుంచే పుట్టినట్టు ఉన్నావ్. మరి ఇంత స్వార్థపరురాలివి ఏంటమ్మా. నా కూతురు కడుపున ఎలా పుట్టావమ్మా అని దక్షిణామూర్తి అంటాడు.
పని మనిషితో గెంటించండి
కొన్ని నమ్మాలి తాతయ్య. మాలిని ఆంటీ కడుపున సూరజ్ లాంటోడు పుట్టోడు కదా అని జ్యోత్స్న గట్టిగా ఇస్తుంది. దాంతో సూరజ్ ఫైర్ అవుతాడు. నువ్వు దేనికి సరిపోవని సూరజ్ అంటాడు. నీతో మాట్లాడాలని జ్యో అంటే.. చేసిందంతా చేసి కవరింగ్‌లు వద్దు. ఈ డ్యామేజ్ కంట్రోల్ పనులు పెట్టుకోకండని, నువ్వు చెప్పేది నేను ఏది వినను అని సూరజ్ అంటాడు.
తాత ఈ మనిషిని వెళ్లమని చెప్పండి. వెళ్లకపోతే పని మనిషితో గెంటించమని చెప్పండని సూరజ్ వెళ్లిపోతాడు. అక్కడిదాకా తెచ్చుకోదులే. శివ నారాయణ మనవరాలికి లౌక్యం ఎక్కువలే. మాములుగా అయితే నేనే మీ ఇంటికి వచ్చి శివ నారాయణ పెంపకాన్ని తిట్టేవాడిని అని దక్షిణామూర్తి అంటాడు. నువ్వు నాకు ఎప్పటికీ మేనకోడలి లాగే మిగిలిపోతావ్. కోడలివి కాలేవని మాలిని అంటుంది.
ఈసారి తాత సపోర్ట్ కూడా లేదు. అందరూ ఛీ కొట్టారు. బయలుదేరు. ఆఫీస్‌కు నా కొడుకు, నేను రాము. నువ్వె వెళ్లి ధుమ్ము దులుపు. దానికితప్పా దేనికి పనికిరాకుండా చేస్తాను అని మాలిని అంటుంది. చేసేది లేక జ్యోత్స్న మౌనంగా వెళ్లిపోతుంది. కట్ చేస్తే జ్యోత్స్నను బుర్ర సరిగ్గా పని చేస్తుందా అని తిడతారు కార్తీక్, దీప.
జ్యోత్స్నను తిట్టిన కార్తీక్, దీప
ఇంటికి వెళ్లి ఛీ అనిపించుకోవాల అని దీప అంటుంది. పారు చేసిన పనికి నింద నువ్వు మోస్తున్నావ్. ఇదంతా పారుతో మాలిని చేయించింది. దక్షిణామూర్తి, సూరజ్ నమ్మకుండా ఎలా ఉంటారు. ఇంకా నయం ఇంటికి ఫోన్ చేసి చెప్పలేదు. ఈ విషయం తెలిస్తే ఎలా అర్థం చేసుకుంటారో తెలియదని కార్తీక్ అంటాడు. ఇంత జరిగాక కూడా వాళ్లింటికి వెళ్లడం చాలా పెద్ద తప్పు అని అంటాడు.
ఇప్పుడు సూరజ్‌కు నీ మీద ప్రేమ ఉందో లేదో తెలియదు. ప్రేమ ఉన్న నమ్మడు. డబ్బుకోసమే తిరిగిందా అనుకుంటాడు. ఇలాగే అనుకోని. నిజం బయటపడ్డ రోజు అర్థం చేసుకుంటాడు. అప్పటివరకు తప్పు చేయనిదానిలా ఉండు. ఆఫీస్‌కి వచ్చి పని చేసుకో అని దీప అంటుంది. సరే కానీ సూరజ్‌ని నేను కొన్ని అడిగాకే ప్రశాంతంగా ఉంటాను అని జ్యో వెళ్లిపోతుంది.
వాళ్లిద్దరి మధ్యలో ఏదో ఉంది. జ్యోత్స్న రెండు కోట్లు తీసుకుందంటే సూరజ్ ఎంత బాధపడ్డాడో చూశావా. కానీ జ్యోత్స్నలో ఆ బాధ లేదు. జ్యోత్స్న తెలుసుకోవాలని అనుకుంటున్నదానికి సూరజ్ పడుతున్న బాధకు ఏదో సంబంధం ఉంది. అదేంటని కార్తీక్ అంటాడు. మరోవైపు సూరజ్‌కి జ్యో కాల్ చేస్తే కట్ చేస్తాడు. వాయిస్ మెసేజ్ పెడుతుంది.
నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటీ
అది వినకుండా డిలీట్ చేయాలనుకుంటాడు సూరజ్. ఏం చెబుతుందో విందా అని మళ్లీ అనుకుంటాడు సూరజ్. నా నిజాయతీని నీ ముందు నిరూపించుకోడానికో. నిన్ను బతిమిలాడుకోడానికో నేను కాల్ చేయట్లేదు. నేనొకటి తెలుసుకోవాలి. అది నువ్వే చెప్పాలి. కాబట్టి కాల్ లిఫ్ట్ చేయు. నువ్వు లిఫ్ట్ చేసేవరకు కాల్ చేస్తూనే ఉంటానని జ్యో అంటుంది. దాంతో సూరజ్ కాల్ చేస్తాడు. ఆఫీస్‌కు ఎందుకు రాలేదని అడుగుతుంది. నువ్వు పీఏ అనుకుంటే నేను ఈ సమాధానం చెప్పాలి అని సూరజ్ అంటాడు.
నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నావ్. ఏంటా నిర్ణయం. నీతో మొదలైన సమస్యకు పరిష్కారం, ముగింపు ఇస్తావనుకున్నావు. అదేంటది. ఆ పరిష్కారం ఏంటో, నిర్ణయం ఏంటీ, ముగింపు ఏంటో నాకు తెలియాలి అని జ్యోత్స్న అడుగుతుంది. దాంతో దిండు కింద ఉన్న తాళి చేతుల్లోకి తీసుకొంటాడు సూరజ్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


