Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో మార్చురీ వార్డ్ దగ్గర సూరజ్‌కి జ్యోత్స్న కనిపిస్తుంది. దాంతో సూరజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఇద్దరు అడ్డంగా వస్తారు. మళ్లీ జ్యోత్స్న కనిపించదు. మరింత షాకైన సూరజ్ జ్యో కోసం వెతుకుతుంటాడు. జ్యోత్స్న అంటూ గట్టిగా పిలుస్తాడు.
జ్యోత్స్న ఎక్కడుంది

జ్యోత్స్ననే చూశానా. ఇంకెవరిని చూసిన తనలాగే అనిపిస్తుందా. ఏమైంది నాకు. ఆ డెడ్ బాడీ జ్యోత్స్నది కాదు. మరి జ్యోత్స్న ఎక్కడుంది. అర్జంట్‌గా ఈ విషయం కార్తీక్‌కు చెప్పాలని మెసేజ్ చేస్తాడు సూరజ్. అప్పటికే దీప ఏడుస్తుంటుంది. సూరజ్ మెసేజ్ చెప్పి జ్యోత్స్న డెడ్ బాడీ కాదు అని కార్తీక్ అంటాడు. నాకు తెలుసు బావ. జ్యోత్స్న కాదు. జ్యోత్స్న క్షేమంగా ఉంటుందంటూ ఏడుస్తుంది దీప.
ఆ మాటలు సుమిత్ర వింటుంది. నా కూతురుకి ఏమైందని నిలదీస్తుంది. మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా. జ్యోత్స్నకి ఏం కాలేదు. ఓ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని తెలిస్తే సూరజ్ వెళ్లాడు. తను కాదని చెప్పాడు అని కార్తీక్ అంటాడు. అది జ్యోత్స్నది కాకపోవచ్చు. కానీ, ఎక్కడో చోట జ్యోత్స్న ప్రమాదంలో ఉండొచ్చు కదా. మాలినియే నా మీద కోపంతో నా కూతురుని ఏదో చేసిందని కుమిలిపోతుంటుంది సుమిత్ర.
జ్యోత్స్న ఎక్కడుందో తెలిస్తే కానీ అత్త కన్నీళ్లను ఆపలేం. మాలిని పిన్నీ సూరజ్‌తో నమ్మించి మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేయట్లేదుగా అని కార్తీక్ డౌట్ పడతాడు. మరుసటి రోజు ఉదయం కారులో ఉన్న సూరజ్‌కు కాల్ వస్తుంది. దానికి సూరజ్ షాక్ అవుతాడు. సరే వస్తున్నా అంటూ వెళ్లిపోతాడు. అదంతా కార్తీక్, దీప చూస్తారు. సూరజ్ ఆఫీస్‌కి వెళ్తాడు. అక్కడ జ్యోత్స్న పని చేసుకుంటూ ఉంటుంది.
4 రోజులు ఏమైపోయావు
సర్ ఈ ఫైల్లో అని జ్యోత్స్న చెబుతుంటే గట్టిగా కోపంగా అరుస్తాడు సూరజ్. లోపలికి వెళ్తాడు. జ్యో వెళ్తుంది. నీ మొబైల్ ఏది, ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు. ఛార్జింగ్ లేదు. ఇప్పుడే పెట్టాను, ఇందాకే కాఫీ తాగడానికి వెళ్లానని జ్యోత్స్న అంటుంది. సూరజ్ ఇరిటేట్ అవుతాడు. నువ్వు కనిపించకుండా పోయి నాలుగు రోజులు అవుతుంది. ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు సూరజ్.
{{/usCountry}}సర్ ఈ ఫైల్లో అని జ్యోత్స్న చెబుతుంటే గట్టిగా కోపంగా అరుస్తాడు సూరజ్. లోపలికి వెళ్తాడు. జ్యో వెళ్తుంది. నీ మొబైల్ ఏది, ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు. ఛార్జింగ్ లేదు. ఇప్పుడే పెట్టాను, ఇందాకే కాఫీ తాగడానికి వెళ్లానని జ్యోత్స్న అంటుంది. సూరజ్ ఇరిటేట్ అవుతాడు. నువ్వు కనిపించకుండా పోయి నాలుగు రోజులు అవుతుంది. ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు సూరజ్.
{{/usCountry}}ఇప్పుడు వచ్చానుగా సర్ అని జ్యో అంటుంది. ఆటలుగా ఉందా నీకు. ఇదే ప్రశ్న మీ ఫ్యామిలీ అడుగుతుంది. మమ్మల్ని టార్చర్ పెట్టారు. అని జరిగింది అంతా చెబుతాడు. మా అమ్మను కూడా కొంచెం అనుమానించాల్సి వచ్చింది. నువ్వు ఇన్నిరోజులు కనిపించకుండా ఏమైపోయావు. నిన్ను ఎవరు కిడ్నాప్ చేయకపోతే ఏమైపోయావ్ అని సూరజ్ నిలదీస్తాడు.
మీ దగ్గర పనిచేసే పీఏ కనిపించకుండా పోతే ఇంత గింజుకుంటున్నావ్ అని జ్యో అంటుంది. నువ్వు కనిపించకుండా పోడానికి కారణం మేమే అని నీ కుటుమంతా నిలదీస్తుంది. మా తాత మీ ఇంటి వాకిట్లో కూర్చున్నాడు. రాత్రి నుంచి ఫోన్ పట్టుకుని నీ కోసం చూస్తున్నా. ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్లావో చెప్పు. సమాధానం చెప్పుకోవాలి. దానిపైనే మా నిజాయితీ, నాకు నావాళ్లపై ఉన్న నమ్మకం నిలబడి ఉందని అడుగుతాడు సూరజ్.
జ్యోత్స్న కొట్టబోయిన సూరజ్
నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని జ్యో అంటే.. చెబుతావా లేదా అని జ్యోత్స్నని కొట్టబోతాడు సూరజ్. మాలిని ఆపుతుంది. పనివాళ్లను యజమానులు కొట్టకూడదు. కొందరు తల్లికొడుకుల మధ్య కూడా చిచ్చు పెడతారు. అనుమానం అనే అగ్గిని రాజేస్తారు. తల్లికే కొడుకును శత్రువుగా మారుస్తారు అని మాలిని అంటుంది.
జ్యోత్స్న వచ్చిందని ఆ ఇంటికి తెలియాలని సూరజ్ అంటాడు. కార్తీక్‌కు జ్యోత్స్న ఫోన్ నుంచి వీడియో కాల్ చేయిస్తాడు సూరజ్. సుమిత్ర వస్తుంది. జ్యోత్స్న వీడియో కాల్ చేసిందని అందరిని పిలుస్తుంది సుమిత్ర. అది విన్న దక్షిణామూర్తి ఇంట్లోకి వెళ్లబోయి గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. నేను ఆఫీస్‌లో ఉన్నాను. డ్యూటీకి వచ్చాను. నేను క్షేమంగా ఉన్నాను. దక్షిణామూర్తి తాతకు ఇవ్వండని జ్యో అంటుంది.
కార్తీక్ ఇస్తాడు. ఎవరైనా నా వరకు రావాల్సిందే అని దక్షిణామూర్తి అంటాడు. చేసిన నిరహార దీక్ష చాలు. ఇంటికి వెళ్లు. కడుపునిండా తిని కంటినిండా నిద్రపో. నేను కనిపించడమే సమాధానమే అని జ్యోత్స్న అంటుంది. ఇది చాలా సర్ అని సూరజ్‌తో జ్యోత్స్న అంటుంది. నీకు వెటకారంగా ఉందిగా అని కోపంగా వెళ్తాడు సూరజ్. దక్షిణామూర్తి చూస్తుంటే వెళ్లమని శివ నారాయణ కోప్పడతాడు.
కిడ్నాప్ చేయించింది మాలినియే
దీప దక్షిణామూర్తి తాతకు స్ట్రాంగ్‌గా కాఫీ తీసుకురా అని కార్తీక్ అంటాడు. వాడికి మర్యాదలు అవసరం లేదని శివ నారాయణ అంటాడు. దీప కాఫీకి వెళ్తుంది. మనుషులను ఆడిపోసుకోవడం నీ అంత గొప్పగా ఎవరికి రాదని శివ నారాయణను అంటాడు దక్షిణామూర్తి. నాన్న నీకు దండం పెడతాను. చేసింది చాలు. నువ్వు అడుగుపెట్టినప్పుడే మా ఇంట్లో తుఫాను మొదలైందని సుమిత్ర అంటుంది.
ఇక మేము భరించలేము. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ చూపు కూడా ఈ ఇంటి మీద పడనీయకండి. ఈ మాట నీ కోడలికి, మనవడికి చెప్పు అని సుమిత్ర అంటుంది. దక్షిణామూర్తికి దీప కాఫీ ఇస్తుంది. వాచ్మెన్ డ్యూటీ చేసింది చాలు అని శివ నారాయణ అంటాడు. దీప కాఫీని మెచ్చుకుంటాడు. జ్యోత్స్న ఇంటికి వచ్చాకే వెళ్తాను. నేను ఇచ్చిన మాట అదే అని సూరజ్‌కి కాల్ చేస్తాడు దక్షిణమార్తి.
ఒక్క గీత పెట్టకుండా
మాలిని దగ్గరికి వెళ్లి ఒంటి మీద ఒక్క గీత పెట్టకుండా ఇంత సేఫ్‌గా ఎలా వదిలేసావ్ అత్త అని అడుగుతుంది జ్యోత్స్న. దాంతో మాలిని తెగ షాక్ అవుతుంది. అంటే, జ్యోత్స్నను కిడ్నాప్ చేయించింది మాలినియే అని తెలిసిపోయింది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.