Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- నీ కొడుకు నా కంట్రోల్‌లో ఉన్నాడత్తా- మాలినికి జ్యోత్స్న షాక్- దీప ఏడుపు

Karthika Deepam 2 Serial October 2nd Episode: కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 2వ ఎపిసోడ్‌‌‌లో జ్యోత్స్నను పీఏగా రెజెక్ట్ చేస్తాడు సూరజ్. కారణం మాత్రం చెప్పడు. కన్నకూతురు అయిన దీప తమ జీవితంలోకి రాకుంటే బాగుండేదని, తలకొరివిపెట్టకుండానే రుణం తీర్చుకున్నావని దీప కన్నీళ్లుపెట్టుకునేలా చేస్తాడు దశరథ్.

Published on: Oct 2, 2026, 07:20:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్‌కి పీఏగా జ్యోత్స్న వెళ్తుంది. సూరజ్ ఇంటర్వ్యూ చేస్తాడు. నీ గురించి పరిచయం చేసుకోమ్మని సూరజ్ చెబుతాడు. చదువు గురించి కాకుండా సూరజ్, మాలిని వల్ల తనకు జరిగిన అన్యాయం గురించి, పడిన బాధ గురించి చెబుతుంది జ్యోత్స్న.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 2 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 2 ఎపిసోడ్

నీకు చెప్పాల్సిన అవసరం లేదు

చదువు గురించి అయితే రెజ్యూమ్‌లో ఉందని, ఈ పోస్ట్‌కి న్యాయం చేయగలనని నాకు నమ్మకం ఉందని జ్యోత్స్న అంటుంది. ఇంత చెప్పాక నేను ఒకటి చెప్పాలి. నిన్ను రెజెక్ట్ చేస్తున్నాను అని సూరజ్ అంటాడు. కారణం ఏంటని జ్యో అడిగితే.. అదిచెప్పాల్సిన అవసరం లేదంటాడు సూరజ్. సుమిత్ర కూతురు అనే కారణం కాకుండా ఇంకేమై ఉంటుందని జ్యో అడిగితే.. బయలుదేరు అని సూరజ్ అంటాడు.

నీకు చెప్పడానికి ఈ జాబ్ చేసేందుకు అర్హత లేదు. నువ్వు ఈ పోస్టుకి పనికిరావు అని సూరజ్ అంటాడు. నేను పీఏగా వస్తే తట్టుకోలేవా. లేదా నీ చుట్టు ఉన్న జనం ఏమనుకుంటున్నారో అని భయపడుతున్నావా. వెళ్లకుంటే గెంటిస్తావా అని జ్యో అంటుంది. అక్కడిదాకా తెచ్చుకోకు. వేరే ఆఫీస్‌లో ఇంటర్వ్యూ పెట్టాం కాబట్టే తెలీక వచ్చావ్. లేకుంటే వచ్చేదానివి కాదని సూరజ్ అంటాడు.

నాకు తెలిసే వచ్చాను. రిజల్ట్స్ కూడా నేను ఊహించిందే వచ్చింది. నిన్ను టీవీ రిమోట్‌లా ఆడించేది వేరే. కనీసం ఆ మనిషిని అయినా చెప్పమను నన్ను రెజెక్ట్ చేయడానికి కారణం ఏంటో అని వెళ్లిపోతుంది జ్యోత్స్న. మరోవైపు శివ నారాయణ టిఫిన్ బండి పెట్టడం గురించి దశరథ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీప, కార్తీక్ వచ్చి మాట్లాడతారు.

నాన్న అనే పిలుపు వద్దు

దీప కాఫీ ఇస్తుంది. నాకు ఈ కాఫీ వద్దమ్మా. దాంతోపాటు నాన్న అనే పిలుపు కూడా వద్దు. నేను చేతగానీ కొడుకును, భర్తను, తండ్రిని. మీరు మీ స్వార్థం చూసుకున్నారు. నేను ప్రశ్నించను. నేనెందుకు బాధపడుతున్నానో తెలుసా. తండ్రిని చూసుకోవాల్సిన వయసులో తను కష్టపడతాను అంటే కాదనలేని పరిస్థితిలో ఉన్నాను. అదే తండ్రి. మా నాన్న అంటే హీరో. నేను మాత్రం చేతగానీ కొడుకును అని దశరథ్ అంటాడు.

చివరికీ జ్యోత్స్న కూడా నాకోసం నిలబడింది. నాకు మా నాన్న చెప్పింది చేయడం తప్పా ఏం తెలియదు. అందరి బాధ వేరు నా బాధ వేరు. నువ్వెందుకు జ్యోత్స్నను కాపాడాలి. నువ్వు నా కూతురువి అని కార్తీక్ నాకెందుకు చెప్పాలి. ఇవన్నీ జరగ్గపోయింటే బాగుండేది. నువ్వు నా కన్నకూతురివి. నీ వల్లే నాకు ఈ బాధంతా. తలకొరివి పెట్టకుండానే రుణం తీర్చేసుకున్నావ్ అని దశరథ్ అంటాడు.

నువ్వు నాకు తెలియని మనిషిలాగే ఉండు. నిన్ను కార్తీక్ భార్యలాగే చూస్తాను. నేను కూడా ఓ జాబ్ వెతుక్కుంటాను. కనీసం నా తండ్రి ముందు నిలబడే అర్హత సంపాదించుకుంటాను అని దశరథ అంటాడు. మీరు మమ్మల్ని ఎంత అన్నా మిమ్మల్మి మేము వదులుకోము. మీకు సపోర్టుగా ఉంటామని కార్తీక్ అంటాడు. నేను చేతగానీ కూతురుని అయిపోయాను. మరోసారి అనాథను అయిపోయాను బావ అని దీప ఏడుస్తుంది.

నీ కొడుకును ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు

దీప భుజంపై చేయి వేసి కార్తీక్ ఓదారుస్తాడు. మరోవైపు ఇంటర్వ్యూ నుంచి బయటకొచ్చిన జ్యోత్స్నను మాలిని పలకరిస్తుంది. నా కొడుకు రెజెక్ట్ చేశాడంటగా అంటుంది. నువ్వే చేయించావని తెలుసు అని జ్యోత్స్న అంటుంది. వాడు రెజెక్ట్ చేస్తాడు. వాడి దృష్టిలో నువ్వు తన తండ్రి చావుకు కారణమైన సుమిత్ర కూతురువి మాత్రమే. పగ అలాగే ఉంటుందని మాలిని అంటుంది.

మరెందుకు మేనకోడలా అని పిలుస్తావని జ్యో అడిగితే.. అది వరస. పగ పగే వరస వరసే అని మాలిని అంటుంది. ఇంకా ఏం చేస్తావో చేసుకో. నువ్వెంత చేస్తే నువ్వు మాకు అంత భయపడతావ్ అని జ్యో అంటుంది. మొన్న ఇలాగే భయపెట్టాలని చూశావ్. సూరజ్ పర్సులో నీ ఫొటో లేదు. నీ మీద ప్రేమ లేదు. అదే నిజమైతే ఇవాళ జాబ్ ఇచ్చేవాడు. మెడలో తాళి కట్టేవాడు. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావని వాడే మెసేజ్ చేశాడు అని మాలిని అంటుంది.

మరీ నీ కొడుకు మీద ఆశలు పెట్టుకోకు అత్తా.. నీ కొడుకును ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను పీఏ పోస్టుకు రెజెక్ట్ అయితే ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకున్నావా.. జరగదు.. నాతో మాట్లాడిన తర్వాత నీ కొడుకు మైండ్ చెదిరిపోయింది. వెళ్లి నీ కొడుకును అడుగు జరుగుతుందో లేదో. పెళ్లాం కొంగు పట్టుకు తిరిగే కొడుకు ఒకప్పుడు తల్లి మాట జవదాటని వాడే అత్త.టైమ్ నీది నడుస్తుందని రెచ్చిపోకు. నా టైమ్ స్టార్ట్ అయితే గీత దాటుకుని కాదు దుంకుంటూ వస్తాడని గట్టి కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

డిస్టర్బ్ అయిన సూరజ్

అందరిని వెళ్లిపోమ్మను, నాకు ఇంటర్వ్యూ చేయాలని లేదని సూరజ్ అంటాడు. ఏమైంది. ఎందుకంత డిస్టర్బ్ అవుతున్నావ్. కావాలంటే నేను చూసుకుంటాను అని మాలిని అంటుంది. సరేనమ్మా నువ్వే సెలెక్ట్ చేయు అని సూరజ్ వెళ్లిపోతాడు. సూరజ్‌ని జ్యోత్స్న బాగా డిస్టర్బ్ చేస్తుంది. ముందు పీఏని సెలెక్ట్ చేయాలని మాలిని అనుకుంటుంది.

మరోవైపు శివ నారాయణ టిఫిన్ బండి రెడీ అవుతుంది. పల్లి చట్నీతో పాటు టమాట కూడా చేయమని పారిజాతంకు చెబుతాడు శివ నారాయణ. సత్తిబాబు వచ్చి ఇప్పటివరకు ఎంత బిజినెస్ అయిందని అడుగుతాడు. ఇంకా బోణీ కాలేదని పారిజాతం అంటుంది. మీరు నాకు ఇవ్వాల్సిన 20 పర్సంట్ కూడా ఇచ్చేలా లేరు. మీరు అమృతం చేసిన రారు. నా బండి అనుకుంటే పాత కస్టమర్స్ వచ్చేవారు. లేనిపోని శుభ్రాలు చేసి అలంకరణలు చేసి ఉన్న కస్టమర్స్‌ని దూరం చేసుకున్నారని సత్తిబాబు అవమానిస్తాడు.

ఇక మీరు ఈగలు తోలుకోవాల్సిందే అని సత్తిబాబు వెళ్తాడు. ఇంతలో కస్టమర్స్ వచ్చి టిఫిన్ ఏం తింటారని పారిజాతం అడుగుతుంది. కానీ, వాళ్లు గంగాధర్ ఇంటికి దారి అడిగి వెళ్లిపోతారు. మనం ఈ టిఫిన్ బండి పెట్టి తప్పు చేశామేమో. మన టిఫిన్స్ మనమే తినాలేమోనండి అని పారిజాతం అంటుంది. మరోవైపు శివ నారాయణ వాళ్లు ఇంకా రాలేదని కార్తీక్, దీపతో చెబుతారు శ్రీధర్, కాంచన.

మొదటిరోజే శివ నారాయణకు నష్టాలు

ఇంతలో జ్యోత్స్న వచ్చి జాబ్ రాలేదంంటుంది. శివ నారాయణ, పారిజాతం వస్తారు. వ్యాపారం ఎలా జరిగిందని కార్తీక్ అడిగితే.. కనీసం ఆటో ఛార్జీలు కూడా రాలేదని. సగం టిఫిన్స్ బస్టాండ్‌లో అనాథలకు పంచాం. మిగతా సగం ఇంటికి తీసుకొచ్చామని పారిజాతం అంటుంది. శివ నారాయణ టిఫిన్ బండికి మొదటిరోజే నష్టాలు వస్తాయి. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More