...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: గుడిలో ఒక్కటైన దశరథ సుమిత్ర- జ్యోకి బుద్ధి చెప్పిన కార్తీక్- పోలీస్ స్టేషన్‌కు తాత, పారు

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో గుడిలో కార్తీక్‌తో మాట్లాడుతుండగా దశరథ్ చూస్తాడు. దశరథ్, సుమిత్ర ఇద్దరు కలిసిపోతారు. దీప పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు కార్తీక్‌కు తెలుస్తుంది. జ్యోకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్ బుద్ధి చెబుతాడు. పోలీస్ స్టేషన్‌కు శివ నారాయణ, పారిజాతం ఎంట్రీ ఇస్తారు.

Published on: Oct 30, 2025, 08:28:15 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్, దశరథ్ గుడిలో సుమిత్ర గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటలు సుమిత్ర వింటుంది. ఇంతలో సుమిత్రను కార్తీక్ చూస్తాడు. చెప్పకు అని కార్తీక్‌ను వేడుకుంటుంది సుమిత్ర. దశరథ్ బాధపడుతుంటాడు. సుమిత్ర వెళ్లిపోతుంది. వాటర్ బాటిల్ తీసుకొస్తానని వెళ్తాడు.

ఒక కాల్ కోసం చూస్తున్నా

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 30వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 30వ తేది ఎపిసోడ్

మరోవైపు ఇవాళ అయిన కొడుకు, కోడలు ఒక్కటవ్వాలని శివ నారాయణ అనుకుంటాడు. ఇంతలో పారిజాతం వచ్చి కాఫీ ఇస్తుంది. నేను ఒక కాల్ కోసం చూస్తున్నా. అది జరగకపోతే ఈ విషాన్ని తాగుతాను అని శివ నారాయణ అంటాడు. తర్వాత పారిజాతంపై సెటైర్లు వేస్తాడు శివ నారాయణ. జ్యోత్స్న గురించి శివ నారాయణ అడిగితే.. ఆఫీస్‌కు వెళ్లిందని చెబుతుంది పారు.

ఎక్కడ ఏ అఘాయిత్యాలు చేస్తుందో అని శివ నారాయణ అనుకుంటాడు. మరోవైపు సుమిత్రతో కార్తీక్ మాట్లాడతాడు. మీ అత్త మొహం చూసే అర్హత కూడా నాకు లేదు అన్నారు. ఆయనకు ఎదురుపడే ధైర్యం లేక వెళ్లిపోతున్నాను. మీ మావయ్య ఏడవడం నేను చూడలేను. నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. నేను చేసిన తప్పు ఏంటో తెలుస్తుంది అని ఏడుస్తుంది సుమిత్ర.

మావయ్య ఎదురుపడితే ఏం చేస్తావ్ అత్త అని కార్తీక్ అడుగుతాడు. క్షమించమని అడుగుతానో. చూస్తు ఉండిపోతానో నాకే తెలియదురా. ఆయన చూసేలోపే నేను వెళ్లిపోవాలి అని సుమిత్ర వెళ్లిపోతుంటే.. సుమిత్ర అంటూ దశరథ్ పిలుస్తాడు. సుమిత్రను చూసి తెగ సంతోషిస్తాడు దశరథ్. సుమిత్ర నువ్వు నా కాళ్ల మీద పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్కటి చేస్తే చాలు. నన్ను క్షమించు చాలు అని దశరథ్ అంటాడు.

దీప ఫోన్ ఎత్తిన జ్యో

పోలీస్ స్టేషన్‌లో కాంచన, దీప ఉంటారు. ఇది మా ఫ్యామిలీ విషయం. ఇంట్లో చూసుకుంటాం అని కాంచన అంటుంది. జ్యోత్స్న వినదు. ఎస్సై గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సెల్‌లో వేసి సౌండ్ బయటకు వచ్చే వరకు కొట్టించండి. అప్పుడు నిజాలు బయటకొస్తాయి అని జ్యో అంటుంది. ఫోన్ చూసుకున్న కార్తీక్ దీపకు కాల్ చేస్తాడు. దీప ఫోన్ తీసుకుని జ్యోత్స్న మాట్లాడుతుంది.

పోలీస్ స్టేషన్‌లో నేరస్థులు మాట్లాడకూడదు అని జ్యోత్స్న అంటుంది. దీప మా మమ్మీని కిడ్నాప్ చేసింది, దీపను అరెస్ట్ చేసింది అని జ్యోత్స్న చేసింది, అనుకుంది చెబుతుంది జ్యోత్స్న. నీకు పది నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. పది నిమిషాల తర్వాత ఫోన్ నా భార్య చేతిలో ఉండాలి. నా భార్య ఇంట్లో ఉండాలి అని కార్తీక్ అంటాడు. 20 నిమిషాల తర్వాత కూడా పోలీస్ స్టేషన్‌లోనే ఉంటుంది అని జ్యోత్స్న అంటుంది.

జ్యోత్స్నకు కార్తీక్ వార్నింగ్

దీప మీద కేసు పెట్టావా అని కార్తీక్ అడుగుతాడు. అవును అని జ్యో అంటే థ్యాంక్స్ అంటాడు. దానికి జ్యోత్స్న షాక్ అవుతుంది. మొదటి సారి దీపను నా భార్య అంటూ మాట్లాడుతున్నావ్. ఆఖరి సారి అడుగుతున్నా. వాళ్లను ఇంటికి పంపించు అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న వినదు. నువ్వు నిజంగా శివ నారాయణ మనవరాలివే అయితే, సుమిత్ర దశరథ్‌ల కూతురివే అయితే, అసలు మనిషివే అయితే ఇంకో పావుగంట అక్కడే ఉండేందుకు ట్రై చేయి. నీకు భయం నీ కళ్లముందు ఉంటుంది అని కార్తీక్ కాల్ కట్ చేస్తాడు.

మరోవైపు కార్తీక్, సుమిత్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. రౌడీల నుంచి దీప ఇంటికి వెళ్లడం వరకు చెబుతుంది సుమిత్ర. జరగింది మర్చిపోదాం. నువ్వు ఈ గుడికి వస్తావని తెలిసింది. నిన్ను కలవచ్చే అని ఆశపడుతూ వచ్చానని దశరథ్ అంటాడు. మీ మాటలు విన్నాక ముందుకు రాడానికి ధైర్యం సరిపోలేదు అని సుమిత్ర అంటుంది. మనిద్దరి కలిసి చాలా దూరం ప్రయాణించాలి. మన కూతురు పెళ్లి చేయాలి అని దశరథ్ అంటాడు.

ఇంతలో కార్తీక్ వస్తాడు. దేవుడికి దశరథ్, సుమిత్ర పూజ చేయిస్తారు. పెళ్లిరోజునే ఇద్దరు కలిశారు. జ్యోత్స్న నువ్వు చేసిన పనికి జీవితంలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెబుతాను అని కార్తీక్ అనుకుంటాడు. బావ వార్నింగ్ ఇచ్చి అరగంట అవుతుంది. ఇంకా ఏం చేయలేదేంటీ అని జ్యోత్స్న అంటుంది. దేనికైనా ఒక్క నిమిషం చాలు అని దీప అంటుంది.

పోలీస్ స్టేషన్‌కు శివ నారాయణ, పారు

ఇంతలో పారిజాతం వస్తుంది. వెనుకాల శివ నారాయణ వస్తాడు. నా కూతురు మీద, నా కూతురి కోడలి మీద ఎందుకు కేసు పెట్టావు అని జ్యోత్స్నను అడుగుతాడు శివ నారాయణ. ఎస్సైగారు చెప్పండి అని జ్యో అంటే.. అనుమానం వచ్చి కేసు పెట్టారు. అందుకే తీసుకొచ్చాం అని ఎస్సై అంటాడు.

మీరు ఎవరి మీద కేసు పెట్టారో తెలుసా. ఎవరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారో తెలుసా. ఈ శివ నారాయణ కూతురుని తీసుకొస్తారా అని శివ నారాయణ అంటాడు. అత్తే వస్తానంది అని జ్యో అంటుంది. నా కొడుకు లేని టైమ్‌లో కోడలిని తీసుకెళ్తే ఎలా ఊరుకుంటాను అని కాంచన అంటుంది. శభాష్ నా కూతురువి అనిపించావ్ అని శివ నారాయణ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe