...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- నువ్వు మోసగాడివి కాదు- సూరజ్ కన్నీళ్లకు కరిగిన కార్తీక్ దీప-మాలిని డౌట్

Karthika Deepam 2 Serial September 5th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 5వ ఎపిసోడ్‌‌‌లో సూరజ్, కార్తీక్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కార్తీక్ కూడా పగ తీర్చుకోవాలిగా అంటాడు. తన బాధ ముందు నీది లెక్కలోకి రాదని కన్నీళ్లతో సూరజ్ చెప్పుకుంటాడు. అదంతా విన్న మాలిని సూరజ్‌పై డౌట్ పడుతుంది.

Published on: Sep 5, 2026, 07:24:42 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్‌తో కార్తీక్, జ్యోత్స్న మాట్లాడుతారు. వారిద్దరిని జ్యోత్స్న పంపించిందని నాకు తెలుసు అని సూరజ్ అంటే.. నీకు చెప్పిందా అని కార్తీక్ అంటాడు. పార్క్‌లో కలిసింది చెబుతాడు సూరజ్.

కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 5 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 5 ఎపిసోడ్

నాకు మీ మీద గౌరవం ఇప్పటికీ ఉందని సూరజ్ అంటే.. జోక్ బాగుందని కార్తీక్ అంటాడు. నమ్మించాల్సిన అవసరం లేదని సూరజ్ అంటే.. నమ్మించేగా ఇంత మోసం చేసిందని కార్తీక్ అంటాడు. జరిగింది చెప్పి వెళ్తూ మాకు క్రెడిట్ ఇచ్చావ్. ఒక అమ్మాయిని మోసం చేయడంలో మాకు క్రెడిట్ ఇచ్చావ్. దాంతో మా తాత మమ్మల్ని దూరం పెట్టాడని కార్తీక్ అంటాడు.

నేను గట్టిగా మాట్లాడగలను

ఇప్పుడు మీ బాధలు చెప్పుకోడానికి వచ్చారా అని సూరజ్ అంటే.. జ్యోత్స్న బాధను అర్థం చేసుకోమ్మని చెప్పడానికి వచ్చానని, జ్యోత్స్న నిన్ను మర్చిపోవట్లేదు. ఫ్యామిలీ అంత కుమిలిపోతుంది. జ్యోత్స్న జీవితానికి న్యాయం చేయాలి అని కార్తీక్ అంటాడు. నేను న్యాయమే చేశానని సూరజ్ అంటే.. కార్తీక్ గట్టిగా అరుస్తాడు.

ఏంటీ బ్రదర్ నేను కూడా గట్టిగా మాట్లాడగలను. ఎందుకీ పెళ్లి ఆగిపోయిందో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడివి కావు నువ్వు. నేను ఏం చేసిన నా తల్లి కోసమే చేశాను అని సూరజ్ అంటాడు. మూర్ఖుడిలా మాట్లాడకు. ప్రతికారంతో ఒక ఆడపిల్లను నమ్మించి జీవితాన్ని నాశనం చేయడం పెద్ద మగతనం అనుకుంటున్నావా. లేదా గోల్డ్ మెడల్ సాధించాననుకుంటున్నావా. ఆలోచిస్తే నీకే తెలుస్తుంది నువ్వు చేసింది ఎంత సిగ్గుమాలిన పనో అని కార్తీక్ అంటాడు.

మా అమ్మ పరిస్థితే నీకు రావాలనుకోవాలా. అప్పుడు నీ లెక్క ప్రకారం చూస్తే అదేగా న్యాయం అని కార్తీక్ అంటాడు. మీ మావయ్య చేసిన తప్పుకు మా నాన్న ప్రాణాలే పోయాయిగా దానికేమంటావ్. మీ మావయ్య మా అత్త జీవితంలోకి రాకుంటే ఇదంతా జరిగేది కాదుగా. మా అత్తను శత్రువును చేశారు. ఆరోజు మా కుటుంబం పడిన బాధ నీకు తెలియట్లేదా. కాళ్లుపోయినందుకు మీ అమ్మ నీ కళ్లముందే ఉన్నందుకు సంతోషించు అని సూరజ్ అంతే కోపంగా అంటాడు.

ఎంత ప్రయత్నించినా నా తండ్రిని తీసుకురాలేవు అని సూరజ్ అంటే.. మీ తండ్రి పోడానికి మా అత్త కారణం కాదని కార్తీక్, మీ అమ్మ కాళ్లు పోడానికి నా తండ్రి కారణం కాదని సూరజ్ అంటారు. మీ తల్లికి కాళ్లు పోడానికి మా తండ్రి కారణం అనేది ఒక నింద. అది చేయించింది నా తండ్రి అని ఎవరు చెప్పలేదు. మీ అత్త కారణంగా మాత్రం నా తండ్రి చనిపోయాడు. ఇదే నిజం అని ఆవేశంగా అరుస్తాడు సూరజ్.

అదంతా పైనుంచి మాలిని వింటుంది. తల్లి పడిన ఆవేదన కళ్లారా చూశానంటాడు సూరజ్. ఇక్కడ రెండు వైపుల నష్టం జరిగింది. నీకు తల్లి కాళ్లు లేకుండా మిగిలింది. నాకు తండ్రి అస్థికలు మిగిలాయి. తండ్రి లేకుండా పెరగడం అంటే వాడి బాల్యం ఎంత నరకంగా ఉంటుందో నువ్వే ఆలోచించుకో అని సూరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

నేను పడ్డ బాధ ముందు మీది కౌంట్‌లోకి రాదు

నన్ను పగ తీర్చుకోమ్మని నా తల్లి చెప్పింది. అలాగే పెరిగాను. నాకు కోట్ల ఆస్తి ఆనందం ఇవ్వదు. నేను పడ్డ బాధ ముందు మీరు పడే బాధ కౌంట్‌లోకి రాదు. నీకు తండ్రి లేకుంటే ఆ బాధ నీకు తెలిసేది. నేను జీవితకాలం ఎదురుచూసిన నా తండ్రి రాడు. మా నాన్న లేడు చంపేశారు. నేను కడుపులో ఉండగానే చంపేశారు. నా కంట్లో నీళ్లు చూస్తానని ఏనాడు అనుకోలేదు. ఇవి మా నాన్న కోసం ఓదార్చడానికి వస్తున్నాయ్. వద్దు వెళ్లండి. ఇక రాకండి అని సూరజ్ ఏడిపించేస్తాడు.

సూరజ్ కన్నీళ్లను కార్తీక్, దీప అర్థం చేసుకుంటారు. మేము వచ్చింది మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడానికి కాదు. దాదాపు మనిద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయి. మమ్మల్ని మోసం చేశావంటే నువ్వు మోసగాడివి అనుకున్నాం. కానీ, కాదు. నువ్వు ఒక మంచి కొడుకువి. నిజాలు ఏంటనేది ఎవరు పూర్తిగా నిర్ధారణకు రాలేరు. ఇక్కడ అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని కార్తీక్ అంటాడు.

జ్యోత్స్న నీ దగ్గరికి వచ్చిందంటే తనది ఎంత గొప్ప ప్రేమో అర్థమైంది. నువ్వు కూడా జ్యోత్స్నను ప్రేమించావ్. అందుకే జ్యోత్స్న మెడలో తాళి కట్టలేదు. నువ్వు నిజంగా మోసగాడివి అయితే తాళి కట్టేవాడివి. ఇంటికి తీసుకొచ్చి నరకం చూపించేవాడివి. ఇవన్ని నువ్వు చేయాలనుకోలేదు. మీరిద్దరు వదులుకోలేరు. కేవలం మీ అమ్మ కోసమే పెళ్లి వరకు తీసుకొచ్చావ్ అని కార్తీక్ అంటాడు.

మీ ప్రేమ పగను జయిస్తుంది

కొన్ని ప్రేమలగు పగలను జయిస్తాయి. ఇది అలాంటి ప్రేమకథే. మీ ప్రేమ మిమ్మల్ని కలుపుతుంది. ఇది నువ్వు కాదనలేని నిజం అని కార్తీక్, దీప వెళ్లిపోతారు. మాలిని ఆ మాటలు విన్నది సూరజ్ చూస్తాడు. మరోవైపు సూరజ్ నిజంగానే జ్యోత్స్నను ప్రేమించాడు అని దీపతో అంటాడు కార్తీక్. దీపను జరిగింది అంతా ఆలోచించమంటాడు కార్తీక్.

కృష్ణమూర్తి భయంతో చనిపోయాడు. కథ అక్కడే మలుపు తిరిగింది. భయంతో ఆయన చనిపోవాల్సిన అవసరం ఏంటీ. ధైర్యంగా తాను లారీ పంపలేదని సుమిత్రతో చెప్పొచ్చుగా. ఈసారి మనం అందరిని అనుమానించాల్సిందే. సూరజ్ తండ్రి చావుకు శివ నారాయణ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నమ్మించగలిగితే, సూరజ్ జ్యోత్స్నను యాక్సెప్ట్ చేస్తాడు అని కార్తీక్ అంటాడు.

మన ఎజెండా ఏంటంటే సూరజ్, జ్యోత్స్నని కలపాలి, నిన్ను శివ నారాయణ మనవరాలిగా ఇంట్లో నిలబెట్టాలి అని కార్తీక్ అంటాడు. మనం డేంజర్ జోన్‌లో ఉన్నాం. మాలిని పిన్ని ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసింది. ముందు ముందు ఏం చేయబోతుందో తెలియదు. మాలినితో జాగ్రత్తగా ఉండాలని కార్తీక్, దీప అనుకుంటారు.

నీడను చూసి భూతం అనుకుంటున్నావ్

జ్యోత్స్న కార్తీక్ అడిగిన గురించి సూరజ్‌ను మాలిని అడుగుతుంది. కార్తీక్ తను అనుకుంది చెప్పేసి వెళ్లిపోయాడు అంతే. కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవానుకుంటున్నావ్. నా మనసు నీకు తెలియదా. అనుమానం ఉందంటావ్. అందుకే నన్ను అడుగుతున్నావ్. ఎవరో బయట వ్యక్తి వచ్చి అడిగితే తప్పా నీ కొడుకు మనసు నీకు తెలియదా అని సూరజ్ అంటాడు.

నేను నా తండ్రి చావుకు పగ తీర్చుకున్నాం. ఇక మన కోసం బతుకుదాం. కార్తీక్ మనింట్లో ఒక నీడను వదిలేసి వెళ్లాడు. ఆ నీడ నీకు భూతంలా కనిపిస్తోంది. అందుకే భయంతో అడుగుతున్నావ్. భయం ఉండటం వద్దమ్మా అని సూరజ్ తెలివిగా తప్పించుకుంటాడు. కార్తీక్ అడిగిన దానికి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. వీడి మనసులో జ్యోత్స్న ఉన్నట్టా లేదా అని మాలిని డౌట్ పడుతుంది. నాకోసం వాడు ఏదైనా చేసేలా చేయిస్తానని మాలిని అనుకుంటుంది.

బిడ్డలను మార్చడమే జ్యోత్స్నకు శాపం అయింది

మరోవైపు ఆరోజు నువ్వు మార్చిన జ్యోత్స్న జీవితం శాపం అయింది. దీప కార్తీక్‌తో సంతోషంగా ఉంది. నువ్వు జ్యోని శివ నారాయణ మనవరాలిగా మార్చకుంటే ఇలా జరిగేది కాదు. నువ్వు బిడ్డను మార్చకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు చేసిన పాపానికి జ్యోత్స్న బాధ అనుభివిస్తుంది. నువ్వు జ్యోత్స్న పక్కనే ఉండి దాని కన్నీళ్లు తుడువు అని పారుతో చెప్పి ఏడుస్తాడు దాసు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe