తెలుగు టీవీ సీరియల్స్ 45వ వారం టీఆర్పీ రేటింగ్స్ గురువారం (నవంబర్ 20) రిలీజ్ అయ్యాయి. వీటిలో కార్తీకదీపంతోపాటు స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది. టాప్ 10 సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ అన్నీ చాలా మెరుగయ్యాయి. ముఖ్యంగా కార్తీకదీపం దుమ్ము రేపింది. 16కుపైగా రేటింగ్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఇలా..

ఈవారం స్టార్ మా సీరియల్స్ మరింత దూకుడు పెంచాయి. 45వ వారానికి రిలీజైన రేటింగ్స్ లో టాప్ 6లో అన్నీ ఈ ఛానెల్ సీరియల్స్ ఉండగా.. వాటి రేటింగ్స్ కూడా గణనీయంగా పెరగడం విశేషం. తొలి స్థానంలో ఉన్న కార్తీకదీపం 2 సీరియల్ అయితే ఏకంగా 16.16 రేటింగ్ తో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా తన బెస్ట్ టీఆర్పీ సొంతం చేసుకుంది. 15.15 రేటింగ్ తో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మూడో స్థానంలోకి మరోసారి ఇంటింటి రామాయణం వచ్చింది. ఈ సీరియల్ కు 13.84 రేటింగ్ నమోదు కావడం విశేషం. ఇది కూడా రికార్డే. నాలుగో స్థానంలో ఉన్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు 13.16 రేటింగ్ వచ్చింది. ఇక ఐదో స్థానంలో చిన్ని సీరియల్ 11.71 రేటింగ్ తో ఉంది. నిండు మనసులు సీరియల్ 9.71 రేటింగ్ తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఒకటి నుంచి ఆరు వరకు ప్రతి సీరియల్ 45వ వారం మెరుగైన రేటింగ్ నమోదు చేసింది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక టాప్ 10లో మిగిలిన నాలుగు స్థానాలను జీ తెలుగు సీరియల్స్ సొంతం చేసుకున్నాయి. వీటిలో మేఘసందేశం సీరియల్ 8.14 రేటింగ్ తో ఓవరాల్ గా ఏదో స్థానంలో ఉంది. తర్వాత మూడు స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. 8వ స్థానంలో ఉన్న చామంతికి 7.96 రేటింగ్ రాగా.. 9వ స్థానంలో జగద్ధాత్రి 7.88తో ఉంది. ఇక పదో స్థానంలో లక్ష్మీనివాసం 7.83 రేటింగ్ తో ఉంది. మరో జీ తెలుగు సీరియల్ జయం కూడా 7.16 రేటింగ్ సాధించింది.
{{/usCountry}}ఇక టాప్ 10లో మిగిలిన నాలుగు స్థానాలను జీ తెలుగు సీరియల్స్ సొంతం చేసుకున్నాయి. వీటిలో మేఘసందేశం సీరియల్ 8.14 రేటింగ్ తో ఓవరాల్ గా ఏదో స్థానంలో ఉంది. తర్వాత మూడు స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. 8వ స్థానంలో ఉన్న చామంతికి 7.96 రేటింగ్ రాగా.. 9వ స్థానంలో జగద్ధాత్రి 7.88తో ఉంది. ఇక పదో స్థానంలో లక్ష్మీనివాసం 7.83 రేటింగ్ తో ఉంది. మరో జీ తెలుగు సీరియల్ జయం కూడా 7.16 రేటింగ్ సాధించింది.
{{/usCountry}}