Karthika Deepam 2 Today Episode: దీపకు ఇదే చివరి రాత్రి! జ్యోత్స్న పక్కా స్కెచ్.. అందరి ముందూ జ్యో చెంప పగలగొట్టిన పారు
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 1 ఎపిసోడ్ లో ఓ వైపు దీపను చంపాలని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసిందని కార్తీక్ కు అనుమానం వస్తుంది. గెట్ టుగెదర్ పార్టీ కోసం కార్తీక్ ఫ్యామిలీతో కలిసి జ్యోత్స్న ఇంటికి వస్తాడు. దీపపై పారిజాతం ప్రేమ కురిపిస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 1 ఎపిసోడ్ లో.. వీలునామా గురించి మళ్లీ పంచాయతీ పెట్టినట్లుంది. అందుకే పార్టీ అని పిలుస్తుందని జ్యోత్స్న గురించి కాంచనతో అనసూయ అంటుంది. అన్నయ్య పెట్టిన నిబంధనకు జ్యోత్స్న ఒప్పుకోకపోతే ఆస్తి నీకు చెందుతుంది కదా కార్తీక్, దాని బాధంతా అదేనని కాంచన అంటుంది.

జ్యోత్స్న ప్లాన్
పార్టీకి పిలిచారు కదా వెళ్లడం మన బాధ్యత అని కాంచన అంటుంది. జ్యోత్స్న ఏదో ప్లాన్ లో ఉందని కార్తీక్ అనుకుంటాడు. మరోవైపు కాశీ తన బాధ గురించి అత్త కావేరికి చెప్పుకుంటాడు. ఆడవాళ్ల మనసు తనకు అర్థం కాని భాషలా మారిందంటాడు. స్వప్నతో మాట్లాడి కన్విన్స్ చేయాలని ఉంది కానీ ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. తనమీద నాకున్న ప్రేమను నేనే మోస్తున్నా. తను ఆ ప్రేమను తెలుసుకోవాలని కాశీ చెప్తాడు.
షాకిచ్చిన స్వప్న
అప్పుడే స్వప్న వచ్చి కాశీ మార్నింగ్ త్వరగా వస్తావా గుడికి వెళ్లాలంటుంది. ఆ వెంటనే వచ్చేటప్పుడు పికప్ చేసుకుని రా అని చెప్తుంది. ఎవరిని అని కావేరి అడిగితే మీకు కాబోయే అల్లుడిని అని స్వప్న షాక్ ఇస్తుంది. పెళ్లికి ముందు ఒకరినొకరం అర్థం చేసుకోవాలని వసంత్ ను గుడికి రమ్మన్నానని స్వప్న అంటుంది. మీ ఇష్టం మేడం, డ్రైవర్ ను కదా ఎప్పుడు రమ్మన్నా వస్తానని కాశీ చెప్తాడు.
దీపకు కాల్
మరోవైపు దీపకు జ్యోత్స్న కాల్ చేస్తుంది. రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది. నిన్ను స్పెషల్ గా నేనే ఆహ్వానించాలని కాల్ చేశా. నీ కోసం ఏమైనా చేస్తా దీప. నువ్వు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేస్తే తప్పకుండా అన్ని మర్యాదలు చేస్తా. మా బావ భార్యగానే పిలుస్తున్నా తప్పకుండా రావాలని జ్యోత్స్న కాల్ కట్ చేస్తుంది.
చివరి రాత్రి
నీ ఇంటికి నువ్వు రాకుండా ఎలా అని జ్యోత్స్న అన్నదంటే ఆమెకు ఏదో తెలిసిందని దీపతో కార్తీక్ అంటాడు. మరోవైపు రేపు పార్టీలో దీపనే స్పెషల్. దీపను పిలిచి బతికిపోయావ్ అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. రేపటితో శత్రుశేషం మిగలకుండా చేస్తా. దీప ఇదే నీకు చివరి రాత్రి అని జ్యోత్స్న అనుకుంటుంది.
ఓవర్ యాక్షన్
మార్నింగ్ పారిజాతం హడావుడి చేస్తుంది. ఎందుకు కార్తీక్ ఫ్యామిలీ కోసం అంతలా హడావుడి చేస్తున్నావని శివ నారాయణ అడిగితే, అలాంటిదేమీ లేదని పారు కవర్ చేస్తుంది. నువ్వు నిజంగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ అమ్మ. నిజం బయటపడుతుందని పారుతో దాసు అంటాడు. నా యాక్టింగ్ తో అవార్డులు వస్తాయిరా అని పారు తెగ బిల్డప్ కొడుతుంది. మనవరాలికి మర్యాదలు మామూలుగా ఉండకూడదని పారు అంటుంది.
సుమిత్ర సారీ
కార్తీక్ ఫ్యామిలీ రాగానే దీప అంటూ పారిజాతం ఎదురు వెళ్తుంది. శౌర్యను ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. దీప ఈ మెడ ఎందుకు బోడిగా ఉంది? ఈ నెక్లెస్ నీ మెడలో వేసుకో అని పారు అడుగుతుంది. పారిజాతం గారు వద్దు అని దీప అంటుంది. పరాయిదానిలా పారిజాతం గారు అంటావేంటీ? నానమ్మ అని పిలవమని పారు అడుగుతుంది. జ్యోత్స్న తరపున అందరికీ సుమిత్ర సారీ చెప్తుంది.
జ్యోత్స్నకు డౌట్
ఎన్ని గొడవలున్నా మనమందరం ఒకటే మామయ్య. ఎప్పటికీ కలిసే ఉండాలి. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మార్చండి. మనందరి జీవితాల్లోకి ఈ రోజు సరికొత్త వెలుగు తీసుకురావాలని జ్యోత్స్న అంటుంది. సరికొత్త వెలుగు వచ్చిందని దీప చేయి పట్టుకుని పారు తీసుకెళ్తుంది. అది చూసి జ్యోత్స్న కు డౌట్ వస్తుంది.
ఇంట్లోకి వెళ్లిన తర్వాత దీప, శౌర్యపై పారు తెగ ప్రేమ ఒలకబోస్తుంది. ఐస్ క్రీమ్ కోసం శౌర్య పరుగెడుతూ జ్యోత్స్నను ఢీ కొట్టి పడిపోతుంది. వెంటనే శౌర్యను పారు పైకి లేపి జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది.
నువ్వు శౌర్యను పడేశావ్. నీ కళ్లు కాకులు ఎత్తుకెళ్లాయి. నువ్వు అడ్డుగా రాకపోయి ఉంటే శౌర్య వంట గదిలోకి వెళ్లుండేది. చూసి డాష్ ఇచ్చినా, చూడకుండా డాష్ ఇచ్చినా శిక్ష ఒక్కటే. సారీ చెప్పు అని జ్యోత్స్న చెంపపై పారు కొడుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


