కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 9 ఎపిసోడ్ లో అమ్మానాన్న ఎప్పుడు వస్తారని నానమ్మ కాంచనను శౌర్య అడుగుతుంది. నువ్వు మారిపోయావ్ నానమ్మ. చెల్లి పుడితే నన్ను హాస్టల్లో వేస్తారా? నన్ను ఇంట్లో నుంచి పంపిస్తావా? చెల్లి వస్తే నా మీద ప్రేమ పోతుందా? అని కాంచనను శౌర్య అడుగుతుంది. ఎంతమంది ఉన్నా నువ్వే నా ఫస్ట్ అని శౌర్యను కాంచన దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతుంది.
కార్తీక్ అబద్దం

అప్పుడే కార్తీక్ వస్తాడు. అమ్మ ఎక్కడ అని శౌర్య అడుగుతుంది. ఏం చెప్పాలో అని కార్తీక్ ఆలోచిస్తాడు. అప్పుడు శౌర్యనే ఓ తాత ఇంటి దగ్గర ఉండిపోయిందా? అని అంటుంది. హా అవును.. తాత ఇంటి దగ్గరే ఉండిపోయింది. అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదు కదా అందుకే అక్కడే ఉండిపోయిందని కార్తీక్ అబద్దం చెప్తాడు. ఈ రోజు నుంచి నేను చెప్పేంతవరకు నువ్వు నానమ్మతోనే ఉండాలని బిడ్డకు కార్తీక్ చెప్తాడు.
దీపను హాస్పిట్లలో అడ్మిట్ చేశానని తల్లి కాంచనకు కార్తీక్ చెప్తాడు. డాక్టర్ తో అన్నయ్య మాట్లాడాడా? బిడ్డ గురించి ఏమైనా చెప్పాడా? అని కార్తీక్ ను కాంచన ప్రశ్నిస్తుంది.
దీప గురించే
మరోవైపు సుమిత్ర ముందు దశరథ దీనంగా కూర్చుంటాడు. డాక్టర్ ఏమన్నారండీ అని సుమిత్ర అడుగుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన దీప గురించి ఆలోచిస్తున్నారా? అని దశరథను అడుగుతుంది. తన గురించి ఆలోచించడానికి కార్తీక్ ఉన్నాడు కదా అని దశరథ అంటాడు. ఈ టైమ్ లో కన్నతల్లి పక్కనే ఉండాలి. కూతురికి ఏం కావాలో అడగకుంటానే తల్లి అర్థం చేసుకుంటుందని సుమిత్ర చెప్తుంది.
కొంతమంది కూతుళ్లు కూడా కన్నతల్లికి ఏం కావాలో తెలుసుకుంటారు. ఏదైనా ఇవ్వడానికి వెనుకాడరు అని దశరథ అంటాడు. జ్యోత్స్నను చూస్తే నాకూ అలాగే అనిపించిందని సుమిత్ర అంటుంది. మన కూతురు జ్యోత్స్న కాదు దీప అని దశరథ అనుకుంటాడు.
దీప నా కన్నకూతురా?
{{/usCountry}}కొంతమంది కూతుళ్లు కూడా కన్నతల్లికి ఏం కావాలో తెలుసుకుంటారు. ఏదైనా ఇవ్వడానికి వెనుకాడరు అని దశరథ అంటాడు. జ్యోత్స్నను చూస్తే నాకూ అలాగే అనిపించిందని సుమిత్ర అంటుంది. మన కూతురు జ్యోత్స్న కాదు దీప అని దశరథ అనుకుంటాడు.
దీప నా కన్నకూతురా?
{{/usCountry}}ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషంగా మారకూడదు సుమిత్ర. దీప నీ కన్నకూతురు అయితే జ్యోత్స్న ఇలాగే మాట్లాడుతుందా? అని భార్యను దశరథ అడుగుతాడు. దీప నా కన్నకూతురు ఏంటండీ అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. ఒకవేళ దీప మన కూతురు అయి ఉంటే తన గురించి జ్యోత్స్న ఇలా మాట్లాడదని దశరథ అంటాడు. దీపను, జ్యోత్స్నను కలిపి మాట్లాడకండీ. దీపను నా కన్నకూతురిలా ప్రేమించలేను. ఏ తల్లికి అయినా కన్నబిడ్డే ఎక్కువ అండీ అని సుమిత్ర చెప్తుంది. నీ కూతురు నీకు ఏం కానివ్వదని దశరథ ఎమోషనల్ అవుతాడు.
కార్తీక్ ఎమోషనల్
డాక్టర్ ఏమన్నాడని కార్తీక్ ను తల్లి కాంచన మళ్లీ అడుగుతుంది. నేను మొండిదాన్ని. ఎంత బాధపడినా గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తూనే ఉంటా. నీకు కూతురు పుట్టినా శౌర్య నా పెద్ద మనవరాలే. నా ప్రేమ ఇలాగే ఉంటుందని కాంచన ఏడుస్తుంది. గ్రహణం పట్టినప్పుడు చంద్రుడిని ఎలా చూపిస్తానమ్మా? గ్రహణం వీడే దాకా ఏం చెప్పలేనని దీప కడుపులో బిడ్డను ఉద్దేశించి కార్తీక్ అంటాడు. నేను చచ్చిపోయేలోపు నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను నేను చూడాల్రా. నువ్వు చూస్తావ్ అమ్మా అని చెప్పగలవా? అని కాంచన అడగ్గానే కన్నీళ్లతో మోకాళ్లపై కూలిపోతాడు కార్తీక్. అత్త కోసం నీకు అన్యాయం చేస్తున్నానమ్మా అని అనుకుంటూ కార్తీక్ ఏడ్చేస్తాడు.
అప్పుడే శ్రీధర్ వస్తాడు. మన సంకల్పం బలంగా ఉంటే అనుకున్నది నిజమవుతుంది. కార్తీక్ నువ్వు హాస్పిటల్ కు బయల్దేరు అని శ్రీధర్ చెప్తాడు. మీరు ఎందుకు వచ్చారో చెప్పండని కాంచన అడుగుతుంది. నా బాధ్యత నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చిందని శ్రీధర్ అంటాడు.
జ్యోత్స్నకు నిజం
ఇక నాకు వేరే దారి లేదు నాన్న. నన్ను చాలా తెలివిగా లాక్ చేశారు. నేను ఓడిపోయా. నాకు తెలియకుండా నా వెనుక ఏం చేస్తున్నావో నువ్వు ఒప్పుకో నాన్న. దీపను మా నాన్న హాస్పిటల్లో జాయిన్ చేశాడు. మమ్మీని జాయిన్ చేయాల్సిన హాస్పిటల్లోనే దీపను అడ్మిట్ చేయాల్సిన అవసరం ఏంటీ? నన్ను ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నారు. ఈ టైమ్ లోనే బోన్ మ్యారో సర్జరీకి కావాల్సిన దీప స్టెమ్ సెల్స్ తీసే అవకాశం ఉంది కదా అని దాసుతో జ్యోత్స్న అంటుంది. అయితే తాతగారి దగ్గరకు పదా. నీ అనుమానాలు అన్ని పోగొడతా. నేరుగా ఇంటికి వచ్చి మీ మనవరాలికి తను ఈ ఇంటి బిడ్డ కాదనే అనుమానం ఉందంటా, డీఎన్ఏ టెస్టు చేయించమని శివనారాయణను అడుగుతా. అసలు నిజాలు ఎప్పుడో బయటపడ్డాయని దాసు బాంబ్ పేలుస్తాడు.
నేను అంత ఈజీగా వదిలిపెట్టను. మీరు దీపను యువరాణిని చేయాలని అనుకుంటున్నారు. కానీ అది జరగదు. శివనారాయణ ఆస్తికి ఏకైక వారసురాలిని ఎప్పటికైనా నేనే. నేను కోరుకున్నది నాకు దక్కితీరాలని జ్యోత్స్న చిటికెలు వేస్తుంది. నీకు రాసి పెట్టి ఉన్నది మాత్రమే నీకు దక్కుతుందని దాసు వెళ్లిపోతాడు.
కాంచన ఇంట్లో శ్రీధర్
ఈ రోజు నుంచి నేను ఈ ఇంట్లోనే నీతో పాటు ఉంటాను. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నా. ఇది నా ఇల్లేనని కాంచనతో శ్రీధర్ అంటాడు. ఈ ఇంట్లో ఉన్నవాళ్ల లిస్ట్ లో మీరు లేరు. నాకు నా కొడుకు ఉన్నాడని కాంచన అంటుంది. దీపకు పూర్తిగా నయమై ఇంటికి వచ్చేంతవరకు కార్తీక్ హాస్పిటల్లోనే ఉంటాడు. అక్కడ దీపకు ఎలా ఒక తోడు అవసరమైందో, ఇక్కడ కూడా ఒక తోడు అవసరం కావాలి. కార్తీక్ వచ్చేంతవరకు నేను ఈ ఇంటికి ప్రతి రాత్రి వస్తాను. తోడుగా ఉంటానని శ్రీధర్ చెప్తాడు.
గతంలో ఎవరో ఒకరు ఇంట్లో దూరి దీపను చంపబోయాడు కదా. మరో దొంగ వస్తే ఏంటీ పరిస్థితి? బయట కార్లో పడుకుంటానని శ్రీధర్ అంటాడు. మరి కావేరి గురించి ఆలోచించరా? అక్కడ కూడా ఇద్దరు ఆడవాళ్లే ఉన్నారు కదా అని కాంచన అడుగుతుంది. అక్కడ అల్లుడు కాశీని ఉంచానని శ్రీధర్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.