Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-జ్యోత్స్నను పెళ్లి చేసుకున్న సూరజ్-మాలిని మైండ్ బ్లాక్-తాత ఖుష్-ట్విస్ట్
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 14 ఎపిసోడ్ లో ట్విస్ట్ అదిరిపోతుంది. జ్యోత్స్న పెళ్లి కోసం సుమిత్ర, దశరథ నెల రోజుల డెడ్ లైన్ పెడతారు. ఇక జ్యోత్స్నను పెళ్లి చేసుకొని సూరజ్ తన ఇంటికి తీసుకెళ్తాడు. అది చూసి మాలిని మైండ్ బ్లాక్ అవుతుంది. నానా రచ్చ చేస్తుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కాంచన ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. జ్యోత్స్నకు నెల రోజుల్లో పెళ్లి చేస్తామని సుమిత్ర, దశరథ స్ఫష్టంగా చెప్తారు. జ్యోకు నెల రోజుల టైమ్ ఉంది. నెల తర్వాత మేం చూసిన సంబంధం చూసుకోవాల్సిందేనని దశరథ అంటాడు.

షాకిచ్చిన జ్యోత్స్న
జరిగే వాటికి రియాక్టవాలి. జరగని వాటికి ఎందుకు రియాక్టవాలని జ్యోత్స్న భోజనం చేస్తూనే ఉంటుంది. ఆమె మాటలతో అందరూ షాక్ అవుతారు. జ్యోత్స్న ప్రయాణం నడి సముద్రంలో మునిగే నావలాంటిదేనని శివ నారాయణ సీరియస్ అవుతాడు. కొన్ని బరువులు జీవితాంతం మోసినా వాటితో రుణం తీరదు అత్త. డెడ్ లైన్ ఇచ్చారు కదా ఆలోచించుకుంటుందని కార్తీక్ ఫిలాసఫీ చెప్తాడు.
కోరుకున్న జీవితం
జ్యోత్స్న నా మేనత్త కూతురు అనే సంగతి పక్కనపెడితే, మేం చిన్నప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్. మనమంతా జ్యోత్స్న జీవితం బాగుండాని కోరుకుంటున్నాం. కానీ నేను మాత్రం జ్యోత్స్న కోరుకున్న జీవితం గడపాలని అనుకుంటున్నా. జ్యోత్స్న కోరుకున్న జీవితం నువ్వు ఇవ్వలేవత్తా అని సుమిత్రకు కార్తీక్ షాక్ ఇస్తాడు. జ్యోత్స్నను ఆలోచించుకోమని చెప్తాడు.
జ్యోకు సూరజ్ కాల్
జ్యోత్స్నకు సూరజ్ కాల్ చేస్తాడు. పర్సనల్ గా మాట్లాడాలని అడుగుతాడు. నీ పిల్లో కింద నా ఫొటో ఉంది. అందులో నేనెప్పుడూ నీకు నచ్చిన మనిషిగానే కనిపిస్తా. కానీ ఆ నచ్చిన మనిషి ప్రేమ కోసం నువ్వు ఎంతలా ఆరాటపడ్డావో ఒకసారి ఆలోచించు. ప్రేమ అనే వారధిని కూడా నీలాంటి కూల్చేయగలరు. మనసు లేని నీలాంటి వాళ్లకు మనిషి విలువ తెలియదని గతాన్ని జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది.
సూరజ్ మాత్రం చేతిలో తాళి పట్టుకొని సైలెంట్ గా వింటుంటాడు. పెళ్లి చేసుకోమ్మని మా అమ్మానాన్న డెడ్ లైన్ ఇచ్చారు. మన కుటుంబాల మధ్య రావణకాష్టం ఉంది. అది ఆరిపోదని జ్యోత్స్న అంటుంది. అది ఆరిపోతే అని సూరజ్ అడుగుతాడు. అప్పడే అటుగా వెళ్తున్న మాలిని సూరజ్ మాటలను వెనుకాల నుంచి వింటుంది.
పరిష్కారం సూరజ్ చేతిలో
నేను వదిలేసిన దాని గురించి ఆలోచించానని తాళిని చూస్తూ జ్యోత్స్నతో సూరజ్ అంటాడు. తనకు పరిష్కారం తెలుసంటాడు. ఆ పరిష్కారం చేతిలో ఉందంటాడు. నేనూ ఒక నిర్ణయానికి వచ్చా. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం నా చేతిలో ఉంది. నాతోనే మొదలైంది, నేనే ముగిస్తా. రేపు ఉదయం చెప్తా. అన్నింటికీ సిద్ధంగా ఉండమని చెప్పి సూరజ్ కాల్ కట్ చేస్తాడు.
మాలిని భయం
సూరజ్ మాటలను బట్టి చూస్తే జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు కనిపించాడు. కాల్ కట్ చేసిన సూరజ్ వెనుకాలే ఉన్న తల్లిని చూసి షాక్ అవుతాడు. ఇంపార్టెంట్ కాల్ అమ్మ అని మాలినికి అబద్ధం చెప్తాడు. నీ కొడుకు ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాడనే నమ్మకం నీకుందా అమ్మా అని మాలినిని అడుగుతాడు. ఉందని మాలిని చెప్పడంతో సూరజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తాను భయపడేది ఏదో జరిగేలా ఉందని మాలిని అనుకుంటుంది.
జ్యోత్స్నను పెళ్లి చేసుకున్న సూరజ్
పని మనిషి వచ్చి మాలినిని నిద్ర లేపి కాఫీ ఇస్తుంది. కానీ గుమ్మంలో జ్యోత్స్నను పెళ్లి చేసుకొని వచ్చిన సూరజ్ ను చూసి మాలిని ఫ్యూజుల్ అవుట్ అవుతాయి. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అమ్మా అని సూరజ్ చెప్తాడు. నన్ను అడగాలి కదా అని మాలిని అరుస్తుంది. ఇది మీ నాన్న చావుకు కారణమైన హంతకురాలి కూతురు. దీన్ని ఇంట్లో ఎలా అడుగుపెట్టనిస్తానని మాలిని అంటుంది.
మాలిని రచ్చ
నీ కొడుకు నా మెడలో తాళి కట్టాడు కాబట్టి కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెడతానని జ్యోత్స్న గుమ్మం లోపలికి కాళ్లు పెడుతుంది. సూరజ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది. మా పెళ్ల అయిపోయింది. నువ్వు జీవించి ఆక్షింతలు వేస్తే కొత్త కాపురం పెడతామని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు ఏ ధైర్యంతో నా కొడుకు చేత తాళి కట్టించుకున్నావని మాలిని అడుగుతుంది.
అసలైన ట్విస్ట్
దక్షిణామూర్తి వచ్చి ఇది కదా అసలైన పండగంటే. థ్యాంక్స్ రా మనవడా. ఈ తాతకు అసలైన ట్విస్ట్ ఇచ్చావ్. ఇదే కదా నేను కోరుకుంది. నా మనవడు, మనవరాలు ఒకటైపోయారు. ఇక నా కూతురు కూడా వస్తుంది. నా కలను నువ్వు నెరవేర్చావని దక్షిణామూర్తి అంటాడు. ఈ పెళ్లిని నేను ఒప్పుకోను అని మాలిని అరుస్తూనే ఉంటుంది. ఏం ఒప్పుకోవమ్మా అని దక్షిణామూర్తి వచ్చి మాలినిని నిద్రలో నుంచి లేపుతాడు. అంటే జ్యోత్స్నను పెళ్లి చేసుకోని సూరజ్ ఇంటికి వచ్చినట్లు మాలిని కల కంటుంది.
అదే జరుగుతుందన్న మామ
సూరజ్ కు, జ్యోత్స్నకు పెళ్లి అయినట్లు పీడకల వచ్చింది మామయ్య అని మాలిని కంగారు పడుతూ చెప్తుంది. నాకు కూడా అదే కల వచ్చింది. అది మంచి కల కదా, పీడకల అని ఎందుకు అన్నావని దక్షిణామూర్తి అడుగుతాడు. జ్యోత్స్నతో పెళ్లి అంటే శివ నారాయణతో గొడవకు కాలు దూయడమే కదా అని మాలిని కవర్ చేస్తుంది. జ్యోత్స్నకు, సూరజ్ కు పెళ్లి జరుగుతుందని చెప్పి దక్షిణామూర్తి లోపలికి వెళ్లిపోతాడు.
ఇటు టిఫిన్ బండి దగ్గర పని చేసిన జ్యోత్స్న తాత శివ నారాయణ దగ్గర రూ.200 అడిగి తీసుకుంటుంది. సూరజ్ కాల్ చేస్తే పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. మాట్లాడాలని సూరజ్ త్వరగా రమ్మంటాడు. ఇక్కడితో కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


