Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- కార్తీక్, దీప మాటలు-జ్యోతో పెళ్లి-సూరజ్ చేతిలో తాళి-మాలిని మైండ్ బ్లాక్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 13 ఎపిసోడ్ లో కథ కీలక మలుపు తీసుకున్నట్లే కనిపిస్తుంది. జ్యోత్స్నను పెళ్లి చేసుకోమ్మని సూరజ్ కు కార్తీక్, దీపతో పాటు తాత దక్షిణామూర్తి చెప్తారు. జ్యోత్స్న దాచిన తాళి సూరజ్ చేతుల్లోకి వస్తుంది. దీంతో మాలినికి మైండ్ బ్లాక్ అవుతుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. జ్యోత్స్న అంటే తనకు స్పెషల్ అని సూరజ్ చెప్తాడు. ఆ మాటలతో జ్యోత్స్న పొంగిపోతుంది. మళ్లీ మళ్లీ అడిగి అదే మాట చెప్పించుకుంటుంది. నువ్వు అందరికంటే స్పెషలే జ్యోత్స్న అని సూరజ్ మళ్లీ చెప్తాడు.

అంత సహనం ఎక్కడిది?
ఆ మహి మాటలతో, చేతలతో బాధపెడుతుంటే డీల్ పోతుందని భరించావ్. అంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది? అని జ్యోత్స్నను సూరజ్ అడుగుతాడు. కొందరి మీద ఉన్న ఇష్టమే భరించేలా చేస్తుంది. ఈ సంఘటన వల్ల గుణపాఠం నేర్చుకున్నా. ఇది నేను ఇష్టపడే మనిషిని మరింత గొప్పగా చూపించింది. ఆ మనిషి నువ్వే అని సూరజ్ గురించి గొప్పగా చెప్తుంది జ్యోత్స్న.
తోడుగా ఉంటా జ్యోత్స్న
నీకు మంచి గుణాన్ని ఇచ్చిన దేవుడు మంచి బుద్ధి ఇస్తే బాగుండని జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. ఎప్పుడూ ఇలాగే ఉంటా. నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి ఎవరున్నా లేకపోయినా నేనుంటా. ఈ మాట మర్చిపోకు అని సూరజ్ చెప్పడంతో జ్యో మళ్లీ పొంగిపోతుంది. నువ్వు కన్ ఫ్యూజన్ లో ఉన్నావ్. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏం చేయాలో నీ మనసు చెప్తుందని చెప్పి జ్యో వెళ్లిపోతుంది.
మరోవైపు సుమిత్ర తన ఓనర్ ఇంట్లో వంట చేస్తుంటుంది. ఆ ఓనర్ కు వస్తువులు ఎక్కడ పడితే అక్కడే పెట్టి మర్చిపోయే అలవాటు ఉంటుంది. అలా చెవి కమ్మలను టేబుల్ మీద పెడుతుంది.
నువ్వు వదిలేసిన తాళి సూరజ్
ఇక జ్యోత్స్న చేయిని మహి పట్టుకున్నాడనే విషయాన్ని సూరజ్ గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంటాడు. అప్పుడే కార్తీక్, దీప వచ్చి సూరజ్ తో పర్సనల్ గా మాట్లాడతారు. నువ్వు వదిలేసిన దగ్గరే ఈ కథ ఆగిపోయిందని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప తాళి చూపించి, ఇది నువ్వు వదిలేసిన తాళే. దీన్ని జ్యోత్స్న జాగ్రత్తగా దాచింది. ఇదే కాదు నువ్విచ్చిన గులాబీ, తిరిగిచ్చిన ఉంగరం ఇలా నువ్వు ఇచ్చినవన్నీ భద్రంగా దాచుకుందని దీప చెప్తుంది.
మీ పెళ్లితోనే ముగింపు
నువ్వంటే జ్యోత్స్నకు చాలా ఇష్టమని సూరజ్ కు దీప చెప్తుంది. నీకు కూడా జ్యోత్స్న అంటే ఇష్టం ఉంది. ప్రేమ లేకపోతే డీల్ క్యాన్సిల్ చేసేవాడివే కాదు. జ్యోత్స్న నా మనిషి అని అందరి ముందు చెప్పేవాడివే కాదు. నువ్వు కంట్రోల్ తప్పి ఆవేశంలో నిజం చెప్పావ్. నీ మనసులో ఏముందో మాకు అర్థమైంది. నిన్ను నమ్మిన ఓ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్లావ్. కానీ అది సరిదిద్దుకోలేని తప్పు కాదు. ఈ కథకు అందమైన ముగింపు మీ పెళ్లి అని తాళిని టేబుల్ మీద పెడతాడు కార్తీక్.
జ్యో నిన్ను ప్రేమించింది
ఈ తాళి జ్యోత్స్నకు ఇచ్చేయండని సూరజ్ అంటాడు. మేం కాదు నువ్వే ఇవ్వాలి. ఈ సారి తాళి చేతికి ఇవ్వడం కాదు మెడలో కట్టాలని కార్తీక్ చెప్తాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న చెప్పిందా అని సూరజ్ అడుగుతాడు. కొన్ని అర్థమవుతాయి సూరజ్. జ్యో ప్రేమ నీకు అర్థం కావడం లేదా? నిన్ను ప్రేమించింది, నీ కోసమే బతుకుతోంది కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోవడం లేదని దీప వివరిస్తుంది.
మాలినికి మైండ్ బ్లాక్
నువ్వు వేసే మూడు ముళ్లు మూడు కుటుంబాలను కలుపుతాయి. నిన్ను శత్రువు అని ఎలా అనుకుంటాం? ఇప్పటికీ నువ్వు నా తమ్ముడివే. విడిగా ఉండి బాధపడదామా? కలిసిపోయి ఆనందాలు పంచుకుందామా? అని సూరజ్ ను కార్తీక్ సూటిగా అడుగుతాడు. నువ్వు వచ్చి క్షమించమని అడిగితే పెద్దవాళ్ల కోపాలు పోతాయని దీప చెప్తుంది. తాళిని అక్కడే వదిలేసి కార్తీక్, దీప వెళ్లిపోతారు. సూరజ్ ఆ తాళిని తీసుకుంటాడు. ఇదంతా దొంగచాటుగా చూసిన మాలినికి మైండ్ బ్లాక్ అవుతుంది.
ప్రేమను దాస్తున్నావా?
రాత్రి ఇంట్లో కూర్చుని ఆ తాళినే పట్టుకొని జ్యోత్స్న మాటలను, జరిగిన విషయాలను సూరజ్ గుర్తు చేసుకుంటాడు. తాతను చూసి తాళి జేబులో పెట్టుకుంటాడు. నా మనవడు వాడి ప్రేమను దాస్తున్నాడు. నీకు మీ అమ్మంటే ఎంత ఇష్టమో, జ్యోత్స్నంటే కూడా అంతే ఇష్టం. జ్యోత్స్నను నువ్వు నిజంగానే ప్రేమించావని దక్షిణామూర్తి అంటాడు. అలాంటిదేమీ లేదని సూరజ్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
జ్యోత్స్నను పెళ్లి చేసుకో
నువ్వు ప్రేమించిన అమ్మాయిని కోల్పోయావు. జ్యోత్స్న నీ కోసం బతుకుతోంది. దూరం చేసుకోకు. జ్యోత్స్నను పెళ్లి చేసుకో. మూడు ముళ్లతో నీ ప్రేమను ముందుకు తీసుకెళ్లు. నా కూతురి పెళ్లి చూడలేకపోయా. నా మనవరాలి పెళ్లిని చూడాలనుకుంటున్నా. మరోసారి ఇలా మాట్లాడటానికి ఈ తాత నీ ముందు ఉండకపోవచ్చేమోనని దక్షిణామూర్తి ఎమోషనల్ గా మాట్లాడతాడు.
పెళ్లి జరిగితే గొడవలు ఆగిపోతాయి. నీ ప్రేమ గురించి ఓ నిర్ణయం తీసుకో. దానికి ఇంతకంటే మంచి టైమ్ రాదని చెప్పి దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. ఈ మాటలను కూడా మాలిని రహస్యంగా వింటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


