కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 15వ తేదీ ఎపిసోడ్ లో బొమ్మను దీపకు ఇస్తుంది అనసూయ. ముత్యాలమ్మకు దండం పెట్టి కోరిక కోరా. నా మనవరాలు అని చెప్పుకునేందుకు మా చెల్లెమ్మకు మనవరాలు కావాలి. సొంత కూతురు అని చెప్పుకోవడానికి ఓ కూతురు కావాలి. బాబు అయినా పర్వాలేదు. కార్తీక్ బాబుకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం కదా అందుకే అలా అన్నా. నా కోరిక తీరుతుందని ఆశపడొచ్చు అనుకుంటే ఈ బొమ్మ తీసుకో అని అనసూయ అంటుంది.
అనసూయ కోరిక

కార్తీక్ శౌర్యకు మాత్రమే తండ్రి హా? నీకు భర్త కాదా? నువ్వు శౌర్యకు తల్లిగా మాత్రమే ఉంటున్నావా? కార్తీక్ కు భార్య కాదా? మీది ఆదర్శ దాంపత్యం అని మా ఆశలు నిజమవుతాయి కదా. శౌర్యకు చెల్లి లేదా తమ్ముడు పుడతాడు కదా అని అనసూయ అడుగుతుంది. మీ ఆశలు నిజమవుతాయి అత్తయ్య అని బొమ్మను తీసుకుంటుంది దీప. బావ, నేను శౌర్యకు అమ్మానాన్నలం మాత్రమే కాదు భార్యాభర్తలం కూడా. మీరు అనుకున్నది నిజమవుతుందని దీప అనగానే కాంచన సంతోషపడుతుంది.
తాతను టార్గెట్
ఇదంతా కార్తీక్ చూస్తాడు. దీపను అదే విషయం అడిగితే సిగ్గు పడుతుంది. ఈ మధ్య శౌర్యను మన దగ్గరికి రానివ్వకుండా వాళ్ల దగ్గర పడుకోబెట్టుకుంటున్నప్పుడే వాళ్ల ఆలోచన అర్థమైందని కార్తీక్ అంటాడు. మరోవైపు అమ్మానాన్నను కలిపేందుకు సలహా చెప్పమని అడుగుతుంది దీప. వాళ్లను అసలు కలిపే ప్రయత్నం చేశావా? అని ప్రశ్నిస్తుంది. వాళ్ల మధ్య దూరాన్ని జ్యోత్స్న మరింత పెంచింది. నిన్న గొడవ జరిగింది. అత్త, మామయ్య ముఖం చూడాలంటే గిల్టీగా ఉంది. ఈ సారి తాతను టార్గెట్ చేద్దాం. మనం ముగ్గురం కలిసి అమ్మానాన్నను కలుపుదామని కార్తీక్ చెప్తాడు.
కాశీకి జాబ్
ఉదయాన్నే అల్లుడు ఎక్కడికి వెళ్లాడని శ్రీధర్ అడుగుతాడు. అప్పుడే కాశీ వస్తాడు. నాకు జాబ్ వచ్చింది మామయ్య అని ఆఫర్ లెటర్ తో షాకిస్తాడు. ఏడాదికి రూ.50 లక్షల జీతం అని చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా అల్లుడు జెమ్ అని తెలుసు కావేరీ అని అంటాడు శ్రీధర్. మీరు అన్న కెపాసిటీ నాలో ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది కాబట్టి మీకు గుర్తొచ్చాయి. ఇప్పుడు మీ ముగ్గురిలో కనిపించిన ప్రేమ ఇంతకుముందు కనిపించలేదని చెప్తున్నా. నేను టిఫిన్ బయటే చేసి వచ్చానని కాశీ అంటాడు.
పోలీస్ కంప్లయింట్
{{/usCountry}}ఉదయాన్నే అల్లుడు ఎక్కడికి వెళ్లాడని శ్రీధర్ అడుగుతాడు. అప్పుడే కాశీ వస్తాడు. నాకు జాబ్ వచ్చింది మామయ్య అని ఆఫర్ లెటర్ తో షాకిస్తాడు. ఏడాదికి రూ.50 లక్షల జీతం అని చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా అల్లుడు జెమ్ అని తెలుసు కావేరీ అని అంటాడు శ్రీధర్. మీరు అన్న కెపాసిటీ నాలో ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది కాబట్టి మీకు గుర్తొచ్చాయి. ఇప్పుడు మీ ముగ్గురిలో కనిపించిన ప్రేమ ఇంతకుముందు కనిపించలేదని చెప్తున్నా. నేను టిఫిన్ బయటే చేసి వచ్చానని కాశీ అంటాడు.
పోలీస్ కంప్లయింట్
{{/usCountry}}శివన్నారాయణ ఇంటికి కార్తీక్, దీప వెళ్తారు. అప్పటికే దశరథతో పారిజాతం మాట్లాడుతుంది. ఏమైందని కార్తీక్ అడిగితే, సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పారు చెప్తుంది. రాత్రి గదిలో పడుకుంది. కానీ పొద్దున అనుమానం వచ్చి చూస్తే గదిలో సుమిత్ర లేదు. ఆవిడ మొబైల్ ఇక్కడే ఉంది. ఏమైపోయిందో తెలియదని పారు అంటుంది. మమ్మీ కనిపించడం లేదని పోలీస్ కంప్లయింట్ ఇద్దామని జ్యోత్స్న అంటుంది. వెంటనే శివన్నారాయణ, దశరథ ఫైర్ అవుతారు.
శివన్నారాయణ కోడలు కనిపించడం లేదని జనం చెప్పుకొంటే ఎలా ఉంటుంది? మన పరువు మిగులుతుందా? అని శివన్నారాయణ కోప్పడతాడు. పెద్ద మేడం ఏం ఆలోచించదని కార్తీక్ అంటాడు. నాకు భయంగా ఉంది. బాధతో బయటకు వెళ్లిన సుమిత్ర ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటుందని పారు అంటుంది. అప్పుడు దీప, శివన్నారాయణ సీరియస్ అవుతారు. కార్తీక్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నా కోడలు నా ఇంట్లో ఉండాలని శివన్నారాయణ అంటాడు.
మమ్మీ అనుకోలేదు
రాత్రి మీ అమ్మ వెళ్లకుండా ఆపి ఉంటే ఈ గొడవంతా జరిగేదా అని జ్యోత్స్నతో పారు అంటుంది. అంటే అత్త వెళ్లడం నీకు తెలుసా? అని కార్తీక్, శివన్నారాయణ అడుగుతాడు. దశరథ కూడా అడుగుతాడు. రాత్రి ఎవరో బయటకు వెళ్లినట్లు ఉందని జ్యోత్స్న అన్నది. కానీ నేను చూడలేదని పారు అనడంతో శివన్నారాయణ చేయి ఎత్తుతాడు. మీ అమ్మ వెళ్లిపోవడం చూశావా? అని దశరథ అడుగుతాడు. మమ్మీ అనుకోలేదని జ్యో అంటుంది.
మీకు ఆ మాత్రం కనిపించడం లేదా అమ్మాయి గారు? కన్న తల్లి నీడ కనపడ్డా బిడ్డ పోల్చుకోగలదు. మీరు ఆ మాత్రం పోల్చుకోలేకపోయారా? ఎవరో ఈ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తారు. మీకు ఆ మాత్రం తెలియదా? అని దీప అడుగుతుంది. నోర్ముయ్ అని జ్యోత్స్నతో అంటాడు దశరథ. 24 గంటల్లో సుమిత్ర మన ఇంట్లో ఉండాలని శివన్నారాయణ అంటాడు. నేను తీసుకొస్తానని జ్యో అంటే నువ్వు చేసింది చాలని ఫైర్ అవుతాడు శివన్నారాయణ.
హాస్పిటల్ కి
సుమిత్ర కోసం కార్తీక్, దశరథ వెళ్తారు. దీప కూడా వెతుకుతానని వెళ్లిపోతుంది. మరోవైపు ఫ్రూట్స్ తీసుకొని కాంచన ఇంటికి వెళ్తాడు శ్రీధర్. నువ్వు నాతో హాస్పిటల్ కు టెస్ట్ ల కోసం రావాలని శ్రీధర్ అడుగుతాడు. అప్పుడే కార్తీక్ ఫోన్ చేసి సుమిత్ర అత్త కనిపిస్తే చెప్పమంటాడు. సుమిత్ర కనిపించడం లేదంటా అని కాంచనకు శ్రీధర్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.