Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. నా జాబ్ ఎలా పోతుంది? మీరు భయపెట్టకపోతే ఎలా పోతుంది? నువ్వు మీ అమ్మ చెప్పిన డ్యూటీ చేస్తున్నావ్. నేను కెఫేలో పని చేస్తున్నానని మా తాతను మీ తాత తిట్టాడంటా. రాత్రంతా గొడవ అని సూరజ్ పై జ్యోత్స్న ఫైర్ అవుతుంది.
ఎందుకు ఏడిపిస్తున్నారు?

నేను జాబ్ చేసి కనీస అవసరాలు అయినా తీర్చగలిగితే, ఇది మా కూతురే సంపాదించి కదా అని మా అమ్మనాన్న కడుపు నిండా భోజనం చేస్తారన్న ఆశ. కానీ ఆ ఆశను కూడా చంపేశారు. ఇంతగా ఏడిపించేవాళ్లను నేనెక్కడా చూడలేదని జ్యోత్స్న అంటుంది. నీ జాబ్ పోవడానికి కారణం నేను కాదు అని సూరజ్ అంటాడు.
ఒట్టు వేయ్ సూరజ్
ఇదే మాట నా మీద ఒట్టు వేసి చెప్పమని సూరజ్ చేయిని తన తలపై పెట్టుకుంటుంది. కానీ సూరజ్ ఒట్టు వేయడు. ఒట్టు వేస్తే నీతో బంధం ఉందని ఒప్పుకున్నట్లే. కానీ నీ జాబ్ పోవడానికి కారణం నేను కాదని సూరజ్ అరుస్తాడు. నువ్వు ఒట్టు వేసి చెప్పినా నేను నమ్మేదాన్ని కాదని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కార్తీక్ ఐడియా
మరోవైపు ఆఫీసులో దీప ఫైల్స్ తో కుస్తీ పడుతుంది. నీ బలహీనత ఏంటో పిన్నికి తెలిసింది. అందుకే ఈ పని అప్పజెప్పింది. ఇది నువ్వు చేయకపోతే బయటకు పంపిద్దామనుకుంటుంది. కానీ నువ్వు అసమర్థురాలివి కాదు. ఆ విషయం పిన్నికి తెలిసేలా చేయు. ముందు పని స్టార్ట్ చేయు అని దీపను ఎంకరేజ్ చేస్తాడు కార్తీక్.
ఫోన్ లో యాప్ యూజ్ చేసి ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసుకోమని దీపకు కార్తీక్ గుర్తు చేస్తాడు. మాలిని వచ్చి ఇదంతా చూస్తుంది. వర్క్ ఎంతవరకు వచ్చిందో కనుక్కోమని పీఏకు చెప్పి మాలిని లోపలికి వెళ్తుంది. పీఏ వచ్చి అదే విషయం అడిగితే దీప తెలివిగా కౌంటర్ వేస్తుంది.
అసలు మాలిని ఎవరు?
{{/usCountry}}ఫోన్ లో యాప్ యూజ్ చేసి ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసుకోమని దీపకు కార్తీక్ గుర్తు చేస్తాడు. మాలిని వచ్చి ఇదంతా చూస్తుంది. వర్క్ ఎంతవరకు వచ్చిందో కనుక్కోమని పీఏకు చెప్పి మాలిని లోపలికి వెళ్తుంది. పీఏ వచ్చి అదే విషయం అడిగితే దీప తెలివిగా కౌంటర్ వేస్తుంది.
అసలు మాలిని ఎవరు?
{{/usCountry}}ఒక సీఈఓ ఏం చేస్తుందోనని అడగడానికి మాలిని ఎవరు? అని దీప అడుగుతుంది. అదే విషయాన్ని మాలినిని అడగమని చెప్తుంది. పీఏ వెళ్లి మాలినిని మీ పోస్టు ఏంటీ అని అడుగుతుంది. నేను ఛైర్మన్ సూరజ్ తల్లిని. దీప బాస్ ను అని చెప్పమని మాలిని అంటుంది. కానీ దీప మళ్లీ కౌంటర్ వేస్తుంది. ఈ ఆఫీస్ లో మాలిని పోస్టు ఏంటీ అని దీప అడుగుతుంది.
నేను సీఈఓను
పీఏపై కోపంతో పనిలో నుంచి తీసేశానని మాలిని అంటుంది. గీత కాదు నేనే అడుగుతానని మాలినిని దీప అడుగుతుంది. ఈ ఆఫీసులో ప్రతి ఒక్కరికి ఏదో పోస్టు ఉంది. మరి మాలిని పేరు ముందు, వెనుకా ఏం ఉంది? అని దీప అడుగుతుంది. వెళ్లి మీ తాతను, అత్తను అడుగు అని మాలిని అంటుంది. నేను అత్త, తాత పేరు చెప్పుకొని ఇక్కడ లేను. నా పేరు దీప, నేను సీఈఓ. మరి నువ్వు ఎవరు? అని దీప మళ్లీ అడుగుతుంది.
సీఈఓను ప్రశ్నించే వాళ్లు అంతకంటే పెద్ద పొజిషనల్ లో ఉండాలి. మరి నువ్వు ఎవరు అత్త? అని దీప అడిగితే మాలినికి మండిపోతుంది. నీ సంగతి తర్వాత చూస్తానని మాలిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో కార్తీక్, దీప నవ్వుకుంటారు.
సూరజ్ కూడా అదే ప్రశ్న
అప్పుడే సూరజ్ క్యాబిన్ లోకి మాలిని వెళ్తుంది. కాలింగ్ బెల్ మోగితే వచ్చానని మాలిని చెప్తుంది. నువ్వు ఎవరు? అని సూరజ్ అడుగుతాడు. నేను కాలింగ్ బెల్ కొట్టింది పీఏ కోసం. మరి నువ్వు ఎందుకు వచ్చావని అడిగాను అంతే అని సూరజ్ అంటాడు. అసలు నువ్వు ఆఫీస్ కు ఎందుకు వచ్చావని మాలిని అడుగుతుంది.
మాలిని అబద్ధం
అందుకో కారణం ఉంది. మనకు ఇంకా శత్రువులు ఉన్నారు. జ్యోత్స్న రెస్టారెంట్స్ తీసుకున్నట్లు ఇంకో రెస్టారెంట్ తీసుకున్నామా? అని సూరజ్ అడుగుతాడు. లేదు సూరజ్ వాళ్లు నష్టాల్లో ఉంటే మనం తీసుకున్నామంతే అని మాలిని అబద్ధం చెప్తుంది. జ్యోత్స్న జాబ్ పోయిన సంగతి వీడికి తెలిసిందా అని లోపల అనుకుంటుంది.
నువ్వు ఎవరినన్న కలిశావా? అని మాలిని అడిగితే లేదని సూరజ్ అబద్ధం చెప్తాడు. ఇలా తల్లీకొడుకు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటారు. అప్పుడే పీఏ లేకపోతే ఇబ్బంది అవుతుందని సూరజ్ అంటాడు. రెండు రోజుల్లో కొత్త పీఏ కావాలని మేనేజర్ కు మాలిని ఆర్డర్ వేస్తుంది.
జాబ్ వెతుక్కోవాలి బావ
రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చున్న జ్యోత్స్నను కార్తీక్, దీప చూస్తారు. జాబ్ పోయిందని, అందుకు కారణం సూరజ్ అని జ్యోత్స్న చెప్తుంది. మనల్ని నాశనం చేయడమే వాడి లక్ష్యం. అందుకే డే1 నుంచి ఫాలో అవుతున్నాడు. నేను పనిచేస్తున్న కెఫే దగ్గరకు వచ్చాడు. నన్ను జాబ్ లో నుంచి తీసేయించాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా వీళ్ల బాధితుడేనని జ్యోత్స్న చెప్తుంది.
ఇంటికి వెళ్దామని కార్తీక్ అడిగితే.. లేదు, జాబ్ వెతుక్కోవాలని జ్యోత్స్న అంటుంది. మీ ఇంట్లో తింటున్న ప్రతి మెతుకు గొంతులు గుచ్చుకున్నట్లే ఉంది. నేను సంపాదిస్తే కడుపు నిండా తినొచ్చు. నేను కంపెనీలకు వెళ్లి రెజ్యూమ్ ఇచ్చి వస్తానని జ్యోత్స్న వెళ్లిపోతుంది.
కార్తీక్, దీప ఇంటికి వెళ్లేసరికి పారిజాతం కంగారు పడుతుంది. శివ నారాయణ కనిపించడం లేదని పారు టెన్షన్ పడుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.