...
...
Next Story

Karthika Deepam 2: కార్తీక దీపం 2..అసలు విలన్ మాలిని-కాంచన కాళ్లు పోవడానికి, భర్త చావుకు కారణం-సీరియల్ లో నెక్స్ట్ ఏంటీ?

Karthika Deepam 2: తెలుగు నాట అద్భుతమైన క్రేజ్ తో అదరగొడుతున్న సీరియల్ ‘కార్తీక దీపం 2’. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ మెగా సీరియల్ టీఆర్ఫీ రేటింగ్ లో దూసుకెళ్తోంది. తాజాగా సీరియల్ కథలో ఊహించని ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. మరి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

Published on: Aug 30, 2026, 15:51:38 IST
Advertisement

Karthika Deepam 2: టీవీ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీక దీపం 2 సీరియల్ లో అదిరే ట్విస్ట్ లతో కథ ఊహించని మలుపు తిరిగింది. సీరియల్ లో అసలు విలన్ మాలిని అని తేలిపోయింది. కొడుకు సూరజ్ తో కలిసి మాలిని పెద్ద కుట్ర పన్నింది. అన్యాయంగా జ్యోత్స్న జీవితంతో సూరజ్ ఆడుకున్నాడు.

సూరజ్ మిస్టరీ

కార్తీక దీపం 2..అసలు విలన్ మాలిని-కాంచన కాళ్లు పోవడానికి, భర్త చావుకు కారణం-సీరియల్ లో నెక్స్ట్ ఏంటీ? (jiohotstar)
కార్తీక దీపం 2..అసలు విలన్ మాలిని-కాంచన కాళ్లు పోవడానికి, భర్త చావుకు కారణం-సీరియల్ లో నెక్స్ట్ ఏంటీ? (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ లోకి సూరజ్ అడుగుపెట్టినప్పటి నుంచే అతని క్యారెక్టర్ వెనుకాల ఉన్న మిస్టరీపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. మంచివాడిలా నటించి శివ నారాయణ కుటుంబానికి దగ్గరయ్యాడు సూరజ్. జ్యోత్స్న తనను ప్రేమించేలా చేసుకున్నాడు. చివరకు ఊహించినట్లుగానే మాలిని కొడుకే సూరజ్ అని వెల్లడైంది.

విలన్ మాలిని

అయితే కార్తీక దీపం 2 సీరియల్ లో అసలు విలన్ మాలిని అనేది ఆడియన్స్ కు షాకిచ్చింది. ఇన్ని రోజులూ వీల్ చెయిర్ లో ఉన్న కాంచన వైకల్యం వెనుకాల ఉన్న రహస్యం తాజాగా బయటపడింది. కాంచన కాళ్లు పోవడానికే కాదు తన సొంత భర్త మరణానికి కూడా మాలిని కారణమన్నది సీరియల్ వీక్షకులకు డబుల్ షాక్ లా తగిలింది.

నిలువెల్లా విషం

మాలిని క్యారెక్టర్ గురించి నిజాలు తెలియడంతో వీక్షకులు అవాక్కయ్యారు. నిలువెల్లా విషం ఉన్న మనిషి మాలిని అని, శివ నారాయణ కుటుంబం అంతం చూసేంతవరకూ ఊరుకోదనే కామెంట్లు వస్తున్నాయి. తన పగ కోసం అన్యాయంగా జ్యోత్స్న జీవితంతో ఆడుకుందని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.

నెక్స్ట్ ఏంటీ?

మోసం చేసేందుకు తనకు అవకాశం ఇచ్చింది కార్తీక్, దీపనే అని మెయిన్ క్యారెక్టర్లను దోషులుగా నిలబెట్టాడు సూరజ్. ఈ నేపథ్యంలో కార్తీక్, దీప తర్వాత ఏం చేస్తారు? సూరజ్, జ్యోత్స్న పెళ్లి జరిగేలా సంచలన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా? అనేది ఉత్కంఠగా మారింది.

ఆ నిజం ఎప్పుడు?

సూరజ్ తో పెళ్లి కాగానే దీపనే సుమిత్ర సొంత కూతురు అనే విషయాన్ని బయటపెడతానని జ్యోత్స్న చెప్పింది. కానీ ఇప్పుడు పెళ్లి ఆగిపోయింది. జ్యోత్స్న షాక్ లో మునిగిపోయింది. మరి ఇప్పుడు జ్యోత్స్న ఏం చేస్తుంది? దీనంతటికి కార్తీక్, దీప కారణమని భావించి, మళ్లీ వాళ్లపై పగ పెంచుకుంటుందా? అన్నది రాబోయే ఎపిసోడ్లలో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks