...
...
Next Story

Karthika Deepam 2 Jyotsna: కార్తీక దీపం 2 జ్యోత్స్న అసలు కథ ఇదిగో.. యాంకరింగ్ నుంచి క్రేజీ నటిగా.. షాకింగ్ రెమ్యునరేషన్?

Karthika Deepam 2 Jyotsna: తెలుగు బుల్లితెరపై ఆల్-టైమ్ రికార్డులు నెలకొల్పిన సీరియల్ 'కార్తీక దీపం'. దానికి కొనసాగింపుగా వస్తున్న ‘కార్తీక దీపం 2’ కూడా టీఆర్‌పీ రేటింగ్స్‌లో దూసుకెళ్తోంది. ఇందులో విలన్ జ్యోత్స్నగా నటనతో అదరగొడుతోంది గాయత్రి సింహాద్రి. ఆమె కెరీర్ పై ఓ లుక్కేయండి.

Published on: Jul 24, 2026, 20:31:45 IST
Advertisement

Karthika Deepam 2 Jyotsna: తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరిస్తూ, టాప్ రేటింగ్స్ లో దూసుకుపోతున్న సీరియల్ ‘కార్తీక దీపం 2’. ఇందులో పవర్ ఫుల్ విలన్ గా, సైకోయిజం చూపించే మరదలు జ్యోత్స్న గెటప్ లో గాయత్రి సింహాద్రి అదరగొడుతోంది. తన యాక్టింగ్ తో సీరియల్ ను ఇంట్రెస్టింగ్ గా మారుస్తుంది. మరి ఈ భామ కెరీర్ చూస్తే షాక్ కలుగుతుంది.

చిన్నప్పటి నుంచే

కార్తీక దీపం 2 జ్యోత్స్న అసలు కథ ఇదిగో.. యాంకరింగ్ నుంచి క్రేజీ నటిగా.. షాకింగ్ రెమ్యునరేషన్? (instagram-Gayathri Munni)
కార్తీక దీపం 2 జ్యోత్స్న అసలు కథ ఇదిగో.. యాంకరింగ్ నుంచి క్రేజీ నటిగా.. షాకింగ్ రెమ్యునరేషన్? (instagram-Gayathri Munni)

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న గా విలనిజం పండిస్తున్న గాయత్రి సింహాద్రి ప్రయాణం కేవలం నటనకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ లో పెరిగిన గాయత్రి చిన్నతనం నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, స్టేజ్ పర్ఫార్మన్సులపై ఇంట్రెస్ట్ చూపించేది.

యాంకర్ గా మొదలెట్టి

మొదట వైజాగ్‌లోని స్థానిక టీవీ ఛానెళ్లలో, రీజనల్ ఈవెంట్లలో యాంకర్ గా గాయత్రి తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, ఎనర్జీతో గుర్తింపు తెచ్చుకుని హైదరాబాద్ టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా వంటి ప్రముఖ ఛానెళ్లలో సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, ప్రత్యేక పండుగ ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరించింది. టీవీల్లో జోష్, సూపర్ ఫ్యామిలీ వంటి షోలకు యాంకర్ గా చేసింది.

సీరియల్స్ లోకి

గాయత్రి సింహాద్రి క్రమంగా యాంకర్ నుంచి నటిగా మారింది. తొలినాళ్లలోనే 'ముద్ద మందారం', 'కళ్యాణ వైభోగం' వంటి టాప్ రేటింగ్ సీరియళ్లలో నెగటివ్, పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మెప్పించింది. క్యారెక్టర్ ఏదైనా దానికి పూర్తి న్యాయం చేయగల నటిగా ఇండస్ట్రీ మేకర్స్ దృష్టిలో పడింది. త్రినయని సీరియల్ తో పాపులారిటీ పెంచుకుంది.

బిగ్ బ్రేక్

కార్తీక దీపం 2 సీరియల్ టాప్ లో కొనసాగుతోంది. పైగా ఇందులో గాయత్రి సింహాద్రి కీలకమైన విలన్ రోల్ ప్లే చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీరియల్ కోసం గాయత్రికి ఎక్కువ మొత్తమే చెల్లిస్తున్నారని టాక్. ఒక్కో ఎపిసోడ్ కు రూ.20,000 నుంచి రూ.40,000 వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం.

మరోవైపు సోషల్ మీడియాలోనూ గాయత్రి సింహాద్రి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ ఫొటోలతో, హాట్ పోజులతో అదరగొడుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe