...
...
Next Story

తెలుగులో నంబర్ వన్ సీరియల్.. 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న కార్తీక దీపం.. స్టార్ మా స్పెషల్ పోస్టర్

కార్తీక దీపం సీరియల్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. తెలుగులో నంబర్ వన్ సీరియల్ గా కొన్ని నెలలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఈ సీరియల్ మైల్ స్టోన్ పై స్టార్ మా ప్రత్యేకంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

Published on: Oct 29, 2025, 13:50:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

స్టార్ మా సీరియల్ కార్తీక దీపం తొలి సీజన్ లోనే కాదు రెండో సీజన్ లోనూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా రెండో సీజన్ కూడా అరుదైన 500 ఎపిసోడ్ల మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని స్టార్ మా ఛానెల్ బుధవారం (అక్టోబర్ 29) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

కార్తీక దీపం @ 500 ఎపిసోడ్లు

తెలుగులో నంబర్ వన్ సీరియల్.. 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న కార్తీక దీపం.. స్టార్ మా స్పెషల్ పోస్టర్
తెలుగులో నంబర్ వన్ సీరియల్.. 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న కార్తీక దీపం.. స్టార్ మా స్పెషల్ పోస్టర్

కార్తీక దీపం రెండో సీజన్ గతేడాది మార్చి 25న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ సీరియల్ 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. రెండో సీజన్ మొదలైనప్పటి నుంచే ఇది టాప్ సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ ఏడాది మొదటి నుంచీ తెలుగులో నంబర్ వన్ సీరియల్ హోదాను కొనసాగిస్తోంది. తాజాగా ఈ సీరియల్ 500 ఎపిసోడ్ల మైలురాయి గురించి స్టార్ మా ట్వీట్ చేసింది.

“500 ఎపిసోడ్ల వెలుగు, ప్రేమ, మ్యాజిక్. మీ ప్రేమ, మద్దతుతోనే కార్తీక దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. ఈ అందమైన మైలురాయిని అందుకున్న టీమ్ కు శుభాకాంక్షలు. కార్తీకదీపం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు స్టార్ మాలో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

కార్తీకదీపం సీరియల్

కార్తీకదీపం సీరియల్ రెండు సీజన్లుగా వచ్చింది. తొలి సీజన్ 2017లో మొదలై 2023లో ముగిసింది. ఆ సీజన్ సుమారు ఐదున్నర ఏళ్లపాటు ఏకంగా 1569 ఎపిసోడ్ల పాటు సాగింది. ఏడాది గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్లీ గతేడాది మార్చి నుంచి రెండో సీజన్ ను తీసుకొచ్చారు. తొలి సీజన్ ను ఏ స్థాయిలో అయితే ప్రేక్షకులు ఆదరించారో.. ఈ రెండో సీజన్ ను కూడా అలాగే ఆదరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ సీరియల్ ఇదే. ప్రతి వారం టీఆర్పీ రేటింగ్స్ లో మిగిలిన అన్ని సీరియల్స్ ను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలుస్తోంది.

ఈ మధ్యే మరో స్టార్ మా సీరియల్ కూడా 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న ఆ సీరియల్ పేరు ఇల్లు ఇల్లాలు పిల్లలు. ప్రతివారం కార్తీక దీపం 2 సీరియల్ కు గట్టి పోటీ ఇచ్చే సీరియల్ అది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe