బుల్లితెరపై సంచలనం సృష్టించిన 'కార్తీకదీపం' సీరియల్, తన రెండో సీజన్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం' ద్వారా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సీరియల్ ఈ శనివారం (ఫిబ్రవరి 21, 2026)తో విజయవంతంగా 600 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్టార్ మా తన ఎక్స్ అకౌంట్ ద్వారా రివీల్ చేసింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. జియోహాట్‌స్టార్ లోనూ చూడొచ్చు.
కార్తీకదీపం@600 ఎపిసోడ్లు

కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం రెండో సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా 600 ఎపిసోడ్ల మైలురాయిని అందుకుంది. స్టార్ మా ఛానెల్ ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ.. “మన మనసుల్లో చెరగని ముద్ర వేసిన కార్తీకదీపం 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు” అనే క్యాప్షన్ తో ఓ స్పెషల్ పోస్టర్ ను పోస్ట్ చేసింది.
ఇక మరో ప్రోమోను రిలీజ్ చేస్తూ.. “600 ఎపిసోడ్స్, చిరస్మరణీయమైన ప్రేమ.. మన మనసుల్లో నిలిచిన కార్తీక దీపం టీమ్‌కి శుభాకాంక్షలు.. ఈ అందమైన ప్రయాణానికి తోడైన అభిమానులందరికీ ధన్యవాదాలు” అనే క్యాప్షన్ ఉంచింది. ఆ ప్రోమోలో మనసులను ముడిపెట్టిన కథ.. ప్రతి మలుపు ప్రేక్షకుల అనుబంధంతో ప్రత్యేకం.. 600 ఎపిసోడ్ల అద్భుత ప్రయాణాన్ని పూర్తి చేసిన కార్తీకదీపం టీమ్ కు అభినందనలు అని చెప్పింది.
కార్తీకదీపం ఇది నవ వసంతం విశేషాలు
కార్తీకదీపం మొదటి సీజన్ 1500కు పైగా ఎపిసోడ్లతో చరిత్ర సృష్టించగా.. రెండో సీజన్ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది. వంటలక్క (దీప), డాక్టర్ బాబు (కార్తీక్) జోడీని మళ్ళీ తెరపై చూడాలనుకున్న ప్రేక్షకులకు ఈ 'నవ వసంతం' సరికొత్త అనుభూతిని ఇస్తోంది.
ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మాలో టాప్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. అంతేకాదు ప్రస్తుతం కథ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ముఖ్యంగా 600వ ఎపిసోడ్ ఒక కీలక మలుపుగా నిలిచింది. సుమిత్ర అసలు కూతురు జ్యోత్స్న కాదు, దీప అని దశరథకు తెలిసిపోయింది. పారిజాతం చేసిన పసిబిడ్డల మార్పిడి గుట్టు రట్టయింది.
{{/usCountry}}ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మాలో టాప్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. అంతేకాదు ప్రస్తుతం కథ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ముఖ్యంగా 600వ ఎపిసోడ్ ఒక కీలక మలుపుగా నిలిచింది. సుమిత్ర అసలు కూతురు జ్యోత్స్న కాదు, దీప అని దశరథకు తెలిసిపోయింది. పారిజాతం చేసిన పసిబిడ్డల మార్పిడి గుట్టు రట్టయింది.
{{/usCountry}}తన తల్లి సుమిత్ర ప్రాణాలు కాపాడటం కోసం దీప తన గర్భంలోని బిడ్డను పణంగా పెట్టే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. జ్యోత్స్న చేస్తున్న కుట్రలను అడ్డుకుంటూ, దీపకు అండగా నిలబడేందుకు కార్తీక్ ప్రయత్నిస్తున్నాడు.
కార్తీకదీపం నటీనటుల వివరాలు
కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబు పాత్రలో నిరుపం పరిటాల, దీప (వంటలక్క)గా ప్రేమి విశ్వనాథ్, జ్యోత్స్నగా ప్రియాంక, దీప తండ్రి దశరథగా సుభాష్, పారిజాతం పాత్రలో సుమిత్ర నటిస్తున్నారు.
ఈ సీరియల్లో మొదటి నుంచీ వంటలక్క క్రేజ్ మామూలుగా లేదు. ప్రేమి విశ్వనాథ్ మళ్ళీ దీప పాత్రలోకి రావడం ఈ సీజన్ సక్సెస్‌కు ప్రధాన కారణం. ఆమె నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి సీజన్లో మోనిత పాత్ర ఎలాగో, ఇందులో జ్యోత్స్న పాత్ర అంతటి విలనీని పండిస్తోంది. దర్శకుడు కాపుగంటి రాజేంద్ర మొదటి సీజన్ స్థాయి ఎమోషన్స్‌ని ఇందులో కూడా కొనసాగిస్తున్నాడు.