Karthika Deepam Sumithra: కార్తీక దీపం సీరియల్లో దీప తల్లి సుమిత్ర పాత్ర పోషిస్తున్న నటి సీతా అయస్ తెలుసు కదా. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో కొన్నాళ్లుగా అభిమానులు తన విషయంలో లేవనెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది.
మొదటి పెళ్లి పెటాకులు

కార్తీక దీపం సీరియల్లో సుమిత్రగా ప్రేక్షకులకు సుపరిచమైన సీతా లక్ష్మి.. తాను యాస్మిన్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో ఆ వీడియోలో వివరించింది.
“నాకు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు సీతా లక్ష్మి. అన్ని రికార్డుల్లోనూ ఇప్పటికీ నా పేరు అలాగే ఉంటుంది. కానీ 2012లో నా జీవితంలో ఊహించని ఘటన జరిగింది. నాకు విడాకులు అయ్యాయి. అది నాకు పెద్ద షాక్ లా అనిపించింది. ఎందుకంటే నేను అది అస్సలు ఊహించలేదు. దాని నుంచి కోలుకోలేకపోయాను. అందుకే ఆ తర్వాత నాలుగేళ్లు నేను నటనకు దూరంగా ఉన్నాను” అని ఆమె చెప్పింది.
స్కూల్ ఫ్రెండ్‌తో రెండో పెళ్లి..
“విడాకుల తర్వాత ఎంతో బాధలో ఉన్న నాకు నా స్కూల్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. మొదట సంకోచించినా తర్వాత నేను కూడా ఓకే చెప్పాను. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. అతడు నా స్కూల్ ఫ్రెండ్. నా విడాకుల సమయంలో హిందువుల్లోనే మరొకరిని చూసుకొని పెళ్లి చేసుకునే అవకాశం నాకు లేదు. దీంతో నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను” అని సీత తెలిపింది.
యాస్మిన్‌గా మారిన సీత
నిజానికి తాను మతం మార్చుకోలేదని, ఇప్పటికే ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంట్లలో తన పేరు సీతా లక్ష్మి అనే ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. అయితే అతన్ని పెళ్లి చేసుకోవాలంటే తన అత్తగారింటి వాళ్లు ఒప్పుకోవాలని, దీనికోసం తాను కొన్ని పనులు చేయాల్సి వచ్చిందని సీత చెప్పింది. తనకు వాళ్ల సపోర్ట్ అవసరం కావడంతో తాను అలా చేశానని, ఆ తర్వాత తన అత్తగారు తనకు యాస్మిన్ అనే పేరు పెట్టారు అని సీతా లక్ష్మి తెలిపింది.
నేను ఓ ఇండియన్..
{{/usCountry}}నిజానికి తాను మతం మార్చుకోలేదని, ఇప్పటికే ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంట్లలో తన పేరు సీతా లక్ష్మి అనే ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. అయితే అతన్ని పెళ్లి చేసుకోవాలంటే తన అత్తగారింటి వాళ్లు ఒప్పుకోవాలని, దీనికోసం తాను కొన్ని పనులు చేయాల్సి వచ్చిందని సీత చెప్పింది. తనకు వాళ్ల సపోర్ట్ అవసరం కావడంతో తాను అలా చేశానని, ఆ తర్వాత తన అత్తగారు తనకు యాస్మిన్ అనే పేరు పెట్టారు అని సీతా లక్ష్మి తెలిపింది.
నేను ఓ ఇండియన్..
{{/usCountry}}ఇక తనకు కులం, మతం పట్టింపులు లేవని, తాను మొదట ఇండియన్ అని, అందరూ అలాగే అనుకోవాలని కూడా చెప్పింది. తన ఇన్‌స్టా ఫాలోవర్లలో చాలా మంది తాను ఎందుకు బొట్టు పెట్టుకోరని అడుగుతున్నారని, అందుకే ఈ వీడియో ద్వారా వాళ్లందరికీ స్పష్టత ఇవ్వాలనే ఇదంతా చెప్పినట్లు సీతా వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో తాను బొట్టు పెట్టుకుంటానని, మరికొన్నిసార్లు తీసేస్తానని చెప్పింది.
బయట నటించే సమయంలో తాను ఎలా ఉన్నా తన భర్త ఇంట్లో వాళ్లు పట్టించుకోరని కూడా సీతా చెప్పింది. ఆమె చేసిన ఈ వీడియోను ప్రశంసిస్తూ చాలా మంది కామెంట్స్ చేయగా.. కొందరు మాత్రం వాళ్లకు పట్టింపు లేనప్పుడు ఎందుకు పేరు మార్చుకున్నారని ప్రశ్నించారు.