Karuppu Twitter Review: చివరి నిమిషంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక రోజు ఆలస్యంగా.. అంటే శుక్రవారం (మే 15) థియేటర్లలోకి వచ్చిన 'కరుప్పు' (Karuppu) బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. సూర్య, త్రిష కాంబినేషన్‌లో దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు "సూర్య ఈజ్ బ్యాక్" అంటూ రచ్చ చేస్తున్నారు.
టాక్ ఎలా ఉంది?

ఎక్స్ (గతంలో ట్విటర్) రివ్యూల ప్రకారం 'కరుప్పు' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమా నిండిపోయిందని ఆడియన్స్ చెబుతున్నారు. తెలుగులో ఈ మూవీ వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజైన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ హైలైట్ అని, థియేటర్లలో ఈ సీన్లకు ఈలలు, గోలలతో హోరెత్తిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. టీజర్, ట్రైలర్‌లో చూపించని కొన్ని ఫాంటసీ అంశాలు సినిమాలో సర్ ప్రైజ్ ప్యాకేజీలా ఉన్నాయట. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఒక సీన్ దాదాపు 2 నిమిషాల పాటు థియేటర్లను దడదడలాడించిందని ఒక నెటిజన్ పేర్కొన్నారు.
లాయర్‌గా, అలాగే మాస్ లుక్‌లో సూర్య నటన 'పీక్' స్టేజ్‌లో ఉందని రివ్యూలు వస్తున్నాయి. ఆర్జే బాలాజీ తన మేకింగ్‌తో సూర్యను ఎలివేట్ చేసిన తీరు అట్లీ-విజయ్ కాంబినేషన్‌ను గుర్తుచేస్తోందని కొందరు పోస్ట్ చేస్తున్నారు. ఇక సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) 'రుద్రతాండవం'లా ఉందని, ప్రతి మాస్ సీన్‌ను ఇది మరో లెవల్‌కు తీసుకెళ్లిందని ప్రశంసలు కురుస్తున్నాయి.
"కరుపు (4.25/5). ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ గా సాగితే, సెకండాఫ్ మాత్రం ప్యూర్ మాస్ డిస్ట్రక్షన్. సూర్య గర్జిస్తున్నాడు. ఆర్జే బాలాజీ రైటింగ్ అదిరిపోయింది. ఇదొక ప్రాపర్ పైసా వసూల్ మూవీ!" అనే ఓ అభిమాని రాశాడు.
కరుప్పు సినిమా విశేషాలు
{{/usCountry}}"కరుపు (4.25/5). ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ గా సాగితే, సెకండాఫ్ మాత్రం ప్యూర్ మాస్ డిస్ట్రక్షన్. సూర్య గర్జిస్తున్నాడు. ఆర్జే బాలాజీ రైటింగ్ అదిరిపోయింది. ఇదొక ప్రాపర్ పైసా వసూల్ మూవీ!" అనే ఓ అభిమాని రాశాడు.
కరుప్పు సినిమా విశేషాలు
{{/usCountry}}ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన కరుప్పు సినిమాలో సూర్య, త్రిష కృష్ణన్, యోగి బాబు, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్, మమితా బైజులాంటి వాళ్లు నటించారు.
సినిమా విడుదలకు ముందు ఎదురైన అడ్డంకులపై సూర్య స్పందిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. "మా వెంటే ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) ఈ రోజు నుంచి మీ ముందుకు వచ్చింది" అని పోస్టర్లను షేర్ చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'కరుప్పు' సినిమాలో సూర్య పాత్ర ఏంటి?
సూర్య ఇందులో ఒక లాయర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన కోర్టులో వాదించడమే కాదు, స్ట్రీట్ ఫైటింగ్ లోనూ కింగ్ అని సినిమా చూపిస్తోంది. అలాగే ఆయన ద్విపాత్రాభినయం (Dual Role) చేసినట్లు రివ్యూల ద్వారా తెలుస్తోంది.
2. త్రిష పాత్ర ఎలా ఉంది?
త్రిష సినిమాలో ఒక ఎమోషనల్ రోల్ పోషించారు. సూర్యతో ఆమె కెమిస్ట్రీ బాగుందని, కథకు ఆమె పాత్ర ఒక డెప్త్ ను ఇచ్చిందని ఆడియన్స్ అంటున్నారు.
3. కరుప్పు సినిమా తెలుగులో అందుబాటులో ఉందా?
అవును.. ఈ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పేరుతో మే 15న విడుదలైంది.