...
...
Next Story

Katrina Kaif Son: దీపావళికి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్- తొలిసారి కొడుకు విహాన్ ఫేస్ రివీల్!

Katrina Kaif Son: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ అభిమానులకు అదిరిపోయే దీపావళి కానుకను అందించారు. ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన తమ కొడుకు 'విహాన్ కౌశల్' ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Published on: Nov 8, 2026, 17:14:39 IST
Advertisement

Katrina Kaif Son: బాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ నెటిజన్లకు స్పెషల్ దీపావళి సర్ప్రైజ్ ఇచ్చారు. కొడుకు పుట్టినప్పటి నుంచి అతని ముఖాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా చాలా ప్రైవేట్‌గా ఉంచుతూ వచ్చిన ఈ జంట.. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా తొలిసారిగా తమ కొడుకు 'విహాన్ కౌశల్' ఫేస్‌ను పబ్లిక్ చేశారు.

కత్రినా కైఫ్ కొడుకు ఫొటో

దీపావళికి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్- తొలిసారి కొడుకు విహాన్ ఫేస్ రివీల్! (instagram-Katrina Kaif)
దీపావళికి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్- తొలిసారి కొడుకు విహాన్ ఫేస్ రివీల్! (instagram-Katrina Kaif)

సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యామిలీ ఫోటోను పంచుకుంటూ అభిమానులకు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. "మా జీవితంలో అత్యంత ప్రకాశవంతమైన దీపావళి ఇది.. అందరికీ ప్రేమ, వెలుగులు, సంతోషం కలగాలని కోరుకుంటున్నాం. - విక్కీ, కత్రినా, విహాన్" అని ఆ ఫోటోకు అద్భుతమైన క్యాప్షన్ జోడించారు. ఈ ఫోటో బయటకు వచ్చిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్న ఫ్యామిలీ

కత్రినా కైఫ్ షేర్ చేసిన ఫోటోలో ఈ ముగ్గురి డ్రెస్సింగ్ స్టైల్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపావళి వేడుకల కోసం ఈ జంట కలర్ కోఆర్డినేటెడ్ ట్రెడిషనల్ దుస్తులను ఎంచుకున్నారు. కత్రినా కైఫ్ బ్రైట్ ఎల్లో (పసుపు రంగు) జరీ సూట్‌లో ట్రెడిషనల్ టచ్‌తో మెరిసిపోగా.. విక్కీ కౌశల్ ఆఫ్-వైట్ కలర్ కుర్తా, మ్యాచింగ్ పైజామాలో ఎంతో సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపించారు.

ఇక బుడతడు విహాన్ కూడా తన తండ్రికి మ్యాచ్ అయ్యేలా ఆఫ్-వైట్ కుర్తా-పైజామా ధరించి, దానికి ఎల్లో వాస్కోట్ (నడుము కోటు) తో క్యూట్‌గా దర్శనమిచ్చాడు. విహాన్ వేసుకున్న ఎల్లో కోటు.. తన తల్లి కత్రినా డ్రెస్‌తో మ్యాచ్ అవ్వడం విశేషం.

విహాన్ కౌశల్ ఎంట్రీ ఎప్పుడంటే?

'విహాన్' అనే పేరుకు సంస్కృతంలో 'తెల్లవారుజాము' లేదా 'కొత్త రోజు ప్రారంభం' అని అర్థం వస్తుంది. పైగా 2019లో విక్కీ కౌశల్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్'లో అతని పాత్ర పేరు కూడా 'మేజర్ విహాన్ సింగ్ షేర్గిల్' కావడం గమనార్హం.

బర్త్‌డే రోజే దీపావళి సంబరాలు

నవంబర్ 7న విహాన్ తన మొదటి పుట్టినరోజు జరుపుకోగా.. మరుసటి రోజే అంటే నవంబర్ 8న దీపావళి వేడుకలు రావడంతో ఈ ఫ్యామిలీలో పండుగ వాతావరణం రెట్టింపయింది. 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కత్రినా, విక్కీ వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు దూరంగా ఉంచుతూ వస్తున్న ఈ జంట.. కొడుకు మొదటి పుట్టినరోజు సందర్భంగా ఫేస్ రివీల్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks