...
...
Next Story

Katy Perry Trudeau: పబ్లిక్ పార్కులో మాజీ ప్రధానితో పాప్ సింగర్ రొమాన్స్.. ముద్దుల వీడియోలు వైరల్.. అసలు కథ ఇదే!

Katy Perry Trudeau: పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. పబ్లిక్ పార్కులో ముద్దులు పెట్టుకుంటూ ఈ జంట కనిపించింది. వీళ్ల ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ రొమాంటిక్ పిక్నిక్ వెనుక మరో కథ ఉందని తెలుస్తోంది. అదేంటో చూసేయండి.

Published on: Jun 16, 2026, 10:47:30 IST
Advertisement

Katy Perry Trudeau: గ్లోబల్ పాప్ సెన్సేషన్ కేటీ పెర్రీ (41), కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (54) కాలిఫోర్నియా పార్కులో ముద్దుల్లో మునిగితేలుతూ తమ డేటింగ్ రిలేషన్‌షిప్‌ను అధికారికం చేశారు. గత ఏడాది జూలై నుండి సాగుతున్న ఈ రహస్య ప్రేమాయణం.. ఇప్పుడు ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ నుంచి లాస్ ఏంజెల్స్ ఫిఫా (FIFA) వరల్డ్ కప్ వేదికల వరకు పాకింది.

వైరల్ వీడియో

పబ్లిక్ పార్కులో మాజీ ప్రధానితో పాప్ సింగర్ రొమాన్స్ (x/katydailybrasil)
పబ్లిక్ పార్కులో మాజీ ప్రధానితో పాప్ సింగర్ రొమాన్స్ (x/katydailybrasil)

​కేటీ పెర్రీ, ట్రూడో క్రేజీ జంట పార్కులో ఒకరినొకరు కౌగిలించుకుంటూ, ముద్దుల్లో మునిగి తేలుతూ తమ రిలేషన్‌షిప్‌ను ప్రపంచానికి చాటి చెప్పారు. పసిఫిక్ మహాసముద్రం కనిపించేలా ఉన్న ఒక ఎత్తైన ప్రదేశంలోని పార్కులో వీళ్ల రొమాన్స్ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఏడాది క్రితం

ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన ప్రఖ్యాత ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేటీ పెర్రీ కన్సర్ట్ డాక్యుమెంటరీ "కేటీ పెర్రీ: ది లైఫ్‌టైమ్స్ టూర్ - లైవ్ ఫ్రమ్ ప్యారిస్" ప్రీమియర్‌కు ఇద్దరూ చేతులు పట్టుకుని రెడ్ కార్పెట్‌పై నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆ తర్వాత లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఫిఫా (FIFA) వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకల్లో కేటీ పెర్రీ పాటలు పాడుతుండగా, జస్టిన్ ట్రూడో కింద కూర్చుని తన లేడీ లవ్‌ను ఎంతగానో ప్రోత్సహించారు.

అసలు కథ ఇదేనా?

ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ హ్యాండ్‌సమ్ ప్రైమ్ మినిస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జస్టిన్ ట్రూడో, గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ కేటీ పెర్రీతో ప్రేమలో పడటం కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు. ఇది అంతర్జాతీయ మీడియా అటెన్షన్‌ను పూర్తిగా ఆక్యుపై చేసిన ఒక బిగ్గెస్ట్ పీఆర్ ఫినామినా.

ఇంటర్నేషనల్ బజ్ కోసం

జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత తన ఇమేజ్‌ను గ్లోబల్ లెవెల్‌లో రీబ్రాండ్ చేసుకోవడానికి చూస్తున్నారు. మరోవైపు, కేటీ పెర్రీ తన సరికొత్త ఆల్బమ్, ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో లాంచ్ చేసిన కన్సెర్ట్ డాక్యుమెంటరీ "Katy Perry: The Lifetimes Tour" కోసం భారీ ఇంటర్నేషనల్ బజ్ ఆశిస్తోంది.

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకల్లో కేటీ పెర్రీ పాడుతుండగా ట్రూడో కింద కూర్చుని సపోర్ట్ చేయడం.. నార్త్ అమెరికన్ మార్కెట్‌లో ఈ ఇద్దరి బ్రాండ్ వాల్యూను 200% పెంచేలా ప్లాన్ చేసిన పక్కా పీఆర్ గేమ్ అని అంతర్జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks