భర్తను ముద్దు పెట్టుకోవడానికి తెగ తొందర పడిపోయిన కీర్తి సురష్.. తొలి పెళ్లి రోజు సందర్భంగా షేర్ చేసిన వీడియో వైరల్
కీర్తి సురేష్ శుక్రవారం (డిసెంబర్ 12) తన తొలి పెళ్లి రోజు జరుపుకుంటోంది. గతేడాది సరిగ్గా ఇదే రోజు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్న ఆమె.. ఇప్పుడు ఏడాది పూర్తయిన సందర్భంగా తమ పెళ్లి వీడియోను షేర్ చేసింది.
మహానటి కీర్తి సురేష్, ఆమె చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ వివాహ బంధానికి నేటితో (డిసెంబర్ 12) ఏడాది పూర్తయింది. వారిద్దరూ గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ పెళ్లి వేడుకల్లోని అల్లరి, ఆనందం, కన్నీళ్లు కలగలిసిన ఒక బ్యూటిఫుల్ వీడియోను కీర్తి సోషల్ మీడియాలో పంచుకుంది.

కీర్తి సురేష్ పెళ్లి రోజు
నటి కీర్తి సురేష్, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా గతేడాది గోవాలో జరిగిన తమ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పెళ్లి వేడుకల వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. "ఒక ముఖ్యమైన రోజు.. ఒక ముఖ్యమైన జ్ఞాపకం.. మా పెళ్లికి ఏడాది" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఏముందంటే?
ఈ వీడియోలో కీర్తి, ఆంటోనీ దంపతులు ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. డ్యాన్సులు, ఆటలు, కుటుంబ సభ్యులతో కలిసి టగ్-ఆఫ్-వార్ ఆడటం వంటి సరదా సీన్స్ ఇందులో ఉన్నాయి. ఆంటోనీ మోకాళ్లపై కూర్చుని కీర్తికి ప్రపోజ్ చేయడం హైలైట్‌గా నిలిచింది.
ఇక వీడియోలో క్రిస్టియన్ వెడ్డింగ్ తర్వాత కీర్తి చేసిన ఒక జోక్ నవ్వులు పూయించింది. "ఫాదర్.. 'ఇప్పుడు మీరు వధువును ముద్దు పెట్టుకోవచ్చు' అని చెప్పే మూమెంట్ కోసం నేను నిజంగా ఎదురుచూశాను. బహుశా ఆ పని నేనే చేస్తానేమో" అంటూ కీర్తి సరదాగా ఆటపట్టించి, ఆంటోనీని ముద్దు పెట్టుకుంది. వెనుక బాణసంచా పేలుతుండగా ఈ జంట మెరిసిపోయింది.
ఇక హిందూ సంప్రదాయంలో తాళి కడుతున్నప్పుడు కీర్తి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం, తర్వాత ఆంటోనీ కన్నీళ్లను కూడా ఆమె తుడవటం వంటి ఎమోషనల్ మూమెంట్స్ అభిమానుల మనసు గెలుచుకున్నాయి. ఈ వీడియో చూసిన నటి అనుపమ పరమేశ్వరన్ 'పప్పీ ఐస్' ఎమోజీలతో క్యూట్ రియాక్షన్ ఇచ్చింది.
కీర్తి, ఆంటోనీ 15 ఏళ్ల ప్రేమ బంధం
కీర్తి సినిమాల్లోకి రాకముందే ఆంటోనీతో ప్రేమలో ఉంది. వీరిది 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమాయణం. ఆంటోనీ కుటుంబం కేరళలోని కొచ్చికి చెందినదే అయినా, ఆయన దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్నారు. 2024 డిసెంబర్ 12న గోవాలో వీరి వివాహం జరిగింది.
ఇక కీర్తి సురేష్ ఇటీవలే 'ఉప్పు కప్పురంబు', 'రివాల్వర్ రీటా' చిత్రాల్లో కనిపించింది. త్వరలో తమిళంలో 'కన్నివేడి', మలయాళంలో 'తోట్టం' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


