హీరోలు, సంగీత దర్శకుడితో రిలేషన్‌షిప్ గాసిప్స్- భర్త ఒక్కటే అడిగేవాడు, పూర్తి స్వేచ్ఛనిస్తారంటూ కీర్తి సురేష్ కామెంట్స్

Keerthy Suresh About Relationship Rumours: పెళ్లికి ముందు తోటి హీరోలు, ఓ సంగీత దర్శకుడితో తనపై వచ్చిన ప్రేమ పుకార్లు ఎంతో బాధించాయని కీర్తి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల ప్రేమ బంధం తర్వాత వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్న ఆమె, తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

Published on: Nov 21, 2026, 21:40:14 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Keerthy Suresh About Relationship Rumours: 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల విడుదలైన 'సత్యవాన్ సావిత్రి' చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, భర్త ఆంటోనీ తట్టిల్ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

హీరోలు, సంగీత దర్శకుడితో రిలేషన్‌షిప్ గాసిప్స్- భర్త ఒక్కటే అడిగేవాడు, పూర్తి స్వేచ్ఛనిస్తారంటూ కీర్తి సురేష్ కామెంట్స్
హీరోలు, సంగీత దర్శకుడితో రిలేషన్‌షిప్ గాసిప్స్- భర్త ఒక్కటే అడిగేవాడు, పూర్తి స్వేచ్ఛనిస్తారంటూ కీర్తి సురేష్ కామెంట్స్

దాదాపు 15 ఏళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట 2024లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్లో తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పకపోవడంతో తనపై వచ్చిన పుకార్లు తనను మానసికంగా ఇబ్బంది పెట్టాయని కీర్తి సురేష్ గుర్తుచేసుకున్నారు.

ఆ రూమర్లు నన్ను బాధించాయి

పెళ్లికి ముందు కీర్తి సురేష్ పేరు పలువురు హీరోలతో పాటు ఓ ప్రముఖ సంగీత దర్శకుడితో కలిపి వినిపించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా 'ఎస్ఎస్ మ్యూజిక్' ఇంటర్వ్యూలో జీవితంలో మిమ్మల్ని బాగా బాధించిన సంఘటన ఏదైనా ఉందా అని ప్రశ్నించగా కీర్తి మనసు విప్పారు.

"నేను నా జీవితంలో ఒకే ఒక్కరితో ప్రేమలో ఉన్నాను. అయినా సరే ఇతర నటులతో నన్ను ముడిపెడుతూ వచ్చిన అనవసరపు గాసిప్స్ నన్ను ఎంతో బాధించేవి. అలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ఆంటోనీ నన్ను ఒక్కటే అడిగేవారు.. వీటిపై స్పందించాలనుకుంటున్నావా అని మాత్రమే అనేవారు తప్ప, నన్ను ఎప్పుడూ అనుమానించలేదు. మా ఇద్దరి మధ్య అవగాహన ఉన్నప్పుడు బయటి వాళ్లకు మేమేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే వాటిని పట్టించుకోవడం మానేశాను" అని కీర్తి సురేష్ స్పష్టం చేశారు.

నా బలం ఆంటోనీ.. ప్రీమియర్లకు రాకపోవడానికి కారణమదే

తన భర్త ఆంటోనీ తట్టిల్ వ్యక్తిత్వం గురించి కీర్తి సురేష్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. ఆంటోనీ నిజమైన జెంటిల్‌మన్ అని, తన కెరీర్‌కు ఎప్పుడూ అండగా నిలుస్తారని కొనియాడారు. తాను ఎప్పుడైనా నిరాశలో కూరుకుపోతే తనకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించేది ఆయనేనని తెలిపారు. ఈ ఏడాది వచ్చిన 'డోరతి' సినిమా చేసే విషయంలో చుట్టూ ఉన్నవారు సందేహాలు వ్యక్తం చేసినా, ఆంటోనీ మాత్రం తనను ఎంతో ప్రోత్సహించారని కీర్తి వెల్లడించారు.

భార్యాభర్తల మధ్య వ్యక్తిగత స్వేచ్ఛ (స్పేస్) ఉండాలని కీర్తి అభిప్రాయపడ్డారు. "ఆయన నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు, నేను కూడా ఆయన ఇష్టాలను గౌరవిస్తాను. ఆంటోనీకి మీడియా హడావుడి, లైమ్‌లైట్‌లో ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆయన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి ఎప్పుడూ లాగను. ఇప్పుడు నేను సినిమా ప్రీమియర్ షోకు వెళ్తున్నాను కానీ ఆయన రావడం లేదు. నా పక్కన నిలబడటం కంటే ఆయన సౌకర్యమే నాకు అతిపెద్ద ప్రాధాన్యత" అని కీర్తి సురేష్ వివరించారు.

ఆర్కుట్‌లో మొదలై.. గోవాలో పెళ్లి పీటల దాకా

ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ ప్రేమకథ ఏదైనా సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు. గతంలో గలాట్టా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విశేషాలను పంచుకున్నారు. వీరిద్దరి పరిచయం ఒకప్పటి సోషల్ మీడియా వేదిక 'ఆర్కుట్'లో మొదలైంది.

2010లో కీర్తి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఆంటోనీ తన ప్రేమను వ్యక్తపరిచారు. కీర్తి కంటే ఏడేళ్లు పెద్దవాడైన ఆంటోనీ అప్పట్లో ఖతార్‌లో ఉద్యోగం చేసేవారు. 2016 నుంచి వీరి బంధం మరింత బలపడింది. దాదాపు ఆరేళ్ల పాటు వేర్వేరు దేశాల్లో ఉంటూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కొనసాగించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు.

ప్రేమకు గుర్తుగా ఆంటోనీ ఇచ్చిన ప్రామిస్ రింగ్‌ను పెళ్లయ్యే వరకు తాను ఎప్పుడూ వేలి నుంచి తీయలేదని, తాను నటించిన అన్ని సినిమాల్లోనూ ఆ ఉంగరం కనిపిస్తుందని కీర్తి ఆసక్తికర విషయం చెప్పారు. ఆంటోనీ బహుమతిగా ఇచ్చిన కుక్కపిల్లకు తమ ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా 'నైకీ' (Nyke) అని పేరు పెట్టుకున్నారు. చివరకు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2024లో గోవా వేదికగా దక్షిణ భారత, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరు ఘనంగా వివాహం చేసుకున్నారు.

చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ

పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'డోరతి', 'సత్యవాన్ సావిత్రి' చిత్రాలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ 'అక్క'తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం తెలుగులో 'రౌడీ జనార్దన', 'జనవరి 12 విడుదల' చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు తమిళంలో 'కన్నివెడి', మలయాళంలో 'తొట్టం', హిందీలో 'రఫ్తార్' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు కీర్తి సురేష్.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.