Keerthy Suresh Nani: నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' సినిమా షూటింగ్ సమయంలోని ఒక సరదా బిహైండ్ ద సీన్ (BTS) ఫొటోను హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నాని జడను పట్టుకుని ఆమె పెట్టిన తెలంగాణ మాండలికపు క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సందడి చేస్తున్న కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

మాస్, నేచురల్ యాక్టర్ నాని, మహానటి మూవీ ఫేమ్ కీర్తి సురేష్ కాంబినేషన్ కు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తాజాగా కీర్తి సురేష్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక ఆసక్తికరమైన స్టోరీ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. నాని రాబోయే ది ప్యారడైజ్ సినిమాలో కీర్తి ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలుసు కదా.
ఈ సాంగ్ షూటింగ్ స్పాట్ లో నాని జడల్ పట్టుకొని లాగుతున్న ఫొటోలను షేర్ చేసింది. దానికి.. "వాడి జడల్ ని ముట్టుకుంటే.. వాడికి సర్రుమంటది" అనే క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో ఇన్‌స్టాంట్ వైరల్ అయింది. మరో ఫొటోలో నాని, కీర్తి షూటింగ్ స్పాట్ లో సరదాగా ముచ్చట్లు ఆడుతూ కనిపించడం చూడొచ్చు.
గతంలో ఇదే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన దసరా మూవీలో నాని, కీర్తి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీలో ధరణి, వెన్నెల కాంబినేషన్ సూపర్ హిట్ అయి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది.
హైదరాబాద్‌లో భారీ సెట్.. 1000 మందితో హంగామా
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో నాని, కీర్తి సురేష్ పై ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ పాటలో ఈ ఇద్దరితోపాటు సుమారు 1000 మంది ఆర్టిస్టులు, డ్యాన్సర్లు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.
{{/usCountry}}హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో నాని, కీర్తి సురేష్ పై ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ పాటలో ఈ ఇద్దరితోపాటు సుమారు 1000 మంది ఆర్టిస్టులు, డ్యాన్సర్లు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.
{{/usCountry}}ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఎనర్జిటిక్ ట్యూన్‌ను సమకూర్చారు. 'దసరా'లో 'చంకీల అంగీలేసి' పాటతో అలరించిన ఈ కాంబో.. ఇప్పుడు మరోసారి థియేటర్లలో ఈనాటి మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ నాని, కీర్తి సురేష్ మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన కీర్తి వివాహ వేడుకకు హాజరైన అతికొద్ది మంది సన్నిహితులలో నాని ఒకరు. వీరిద్దరి మధ్య ఉన్న ఆత్మీయ బంధం, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విజన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించేందుకు కీర్తిని ఒప్పించాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ ది ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.
టాలీవుడ్‌లో కీర్తి సురేష్ జోరు
ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సరసన 'రౌడీ జనార్దన' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న జనవరి 12 విడుదల మూవీలోనూ కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.