...
...
Next Story

లేచిపోయి పెళ్లి చేసుకుంటానని అనుకున్నాను.. అతడు ఏడవడం తొలిసారి చూశాను: కీర్తి సురేష్ కామెంట్స్

నటి కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి ఏషియన్ పెయింట్స్ సహకారంతో తమ ఇంటిని అభిమానులకు పరిచయం చేసింది. ఈ సందర్భంగా తన పెళ్లి నాటి అనుభూతులను పంచుకుంటూ.. 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత తాళి కట్టే సమయం ఎంత ఉద్వేగభరితంగా ఉందో వివరించింది.

Published on: Jan 28, 2026 08:42 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రముఖ నటి కీర్తి సురేష్ 2024లో గోవాలో తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఏషియన్ పెయింట్స్ సహకారంతో తమ ఇంటిని అభిమానులకు చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తమ ఇంటిని వారు సరదాగా ‘హౌస్ ఆఫ్ ఫన్’ అని పిలుచుకుంటారు. ఈ వీడియోలో కీర్తి తన పెళ్లి రోజున జరిగిన ఒక ఎమోషనల్ సంఘటనను గుర్తుచేసుకుంది.

లేచిపోదాం అనుకున్నా..

లేచిపోయి పెళ్లి చేసుకుంటానని అనుకున్నాను.. అతడు ఏడవడం తొలిసారి చూశాను: కీర్తి సురేష్ కామెంట్స్
లేచిపోయి పెళ్లి చేసుకుంటానని అనుకున్నాను.. అతడు ఏడవడం తొలిసారి చూశాను: కీర్తి సురేష్ కామెంట్స్

15 ఏళ్ల ప్రేమ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ఒక్కటైన ఆ క్షణాన్ని కీర్తి సురేష్ గుర్తుచేసుకుంటూ.. "మేము ఇలాంటి పెళ్లి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలంటే మేము లేచిపోవాలని అనుకున్నాం. ఇంత ఘనంగా పెళ్లి జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కానీ నిజంగా పెళ్లి జరుగుతున్నప్పుడు, ఒక దశలో మాకు మాటలు రాలేదు" అని చెప్పింది.

ఆంటోనీ కన్నీళ్లు..

పెళ్లిలో అత్యంత భావోద్వేగమైన క్షణం గురించి ఆమె వివరిస్తూ.. "15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ బంధం, ఆ 30 సెకన్ల ముహూర్తంలో ఒక్కటవుతున్నప్పుడు.. నాకు ఇంకేమీ కనిపించలేదు. నా మెదడు మొద్దుబారిపోయింది. తాళి తప్ప అక్కడ ఇంకేమీ లేదనిపించింది. అది చాలా ఉద్వేగభరితమైన క్షణం. ఆ సమయంలోనే నేను ఆంటోనీ కళ్లలో నీళ్లు చూడటం అదే మొదటిసారి. మా ప్రయాణం చాలా అందమైనది" అని కీర్తి ఎమోషనల్ అయింది.

కీర్తి, ఆంటోనీ లవ్ స్టోరీ

కీర్తి సురేష్ సినిమాల్లోకి రాకముందే ఆంటోనీతో ప్రేమలో ఉంది. ఆంటోనీ దుబాయ్‌లో వ్యాపారవేత్త కాగా.. అతని కుటుంబం కేరళలోని కొచ్చికి చెందినది. 15 ఏళ్ల పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట.. 2024 డిసెంబర్ 12న గోవాలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

కీర్తి సురేష్ సినిమా విశేషాలు

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe