ఓటీటీలోకి కీర్తి సురేష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. రివాల్వర్ రీటా మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
మహానటి కీర్తి సురేష్ కొత్త సినిమా ఓటీటీలోకి రాబోతుంది. రివాల్వర్ రీటా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ ప్రకటించారు. మరి ఈ చిత్రం ఏ ఓటీటీలోకి, ఎప్పుడు వస్తుందో చూసేయండి.
మరో కొత్త వారం రాబోతుంది. ఓటీటీలో కొత్త సందడి షురూ కానుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన రివాల్వర్ రీటా వచ్చే వారం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇవాళ (డిసెంబర్ 21) ఆ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. తెలుగుతో సహా నాలుగు భాషల్లో ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

రివాల్వర్ రీటా ఓటీటీ
కీర్తి సురేష్ ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. ఇలా ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ రివాల్వర్ రీటా. ఇదో క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ బాట పట్టనుంది. డిసెంబర్ 26 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆదివారం ప్రకటించారు.
తెలుగులోనూ
రివాల్వర్ రీటా మూవీ ఒరిజినల్ తమిళంలో తెరకెక్కింది. తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు రివాల్వర్ రీటా తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి జేకే చంద్రు డైరెక్టర్. ఈ సినిమాలో కీర్తి సురేష్, రాధిక, సునీల్, సెండ్రయాన్ తదితరులు నటించారు.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రిలీజైన రివాల్వర్ రీటా థియేటర్లలో పెద్దగా ఆడలేకపోయింది. స్టోరీ లైన్ బాగానే ఉన్నా దాన్ని తెరపైకి తేవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వినిపించాయి. పగ, ప్రతీకారాలతో ముడిపడ్డ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రివాల్వర్ రీటా. కర్మ ఎవరినీ విడిచిపెట్టదు అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. ఎప్పుడో జరిగిన అన్యాయానికి ఇప్పుడు హీరోయిన్ ఫ్యామిలీ బదులు తీర్చుకుంటుంది.
రివాల్వర్ రీటా కథ
రీటా (కీర్తి సురేష్), ఆమె తల్లి (రాధికా శరత్ కుమార్) ఓ ఇంట్లో ఉంటారు. మరోవైపు పాండిచ్చేరిలో క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్). డ్రాకులా చేతిలో నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) బ్రదర్ హత్యకు గురవుతాడు. దీంతో డ్రాకులాను చంపాలని ఓ గ్యాంగ్ కు రూ.5 కోట్లతో డీల్ సెట్ చేస్తాడు నర్సింహారెడ్డి.
కానీ ఓ రోజు డ్రాకులా పాండ్యన్ డ్రగ్స్ మత్తులో పొరపాటున వేరే ఇంటికి వెళ్లబోయి రీటా ఇంటికి వెళ్తాడు. అక్కడ గొడవ జరుగుతుంది. రీటా తల్లి కొట్టడంతో పాండ్యన్ చనిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? డ్రాకులా కొడుకు బాబీ పాండ్యన్ (సునీల్) తన తండ్రిని చంపిన వాళ్లను కనిపెట్టాడా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


