...
...
Next Story

Archana Jois: హీరోయిన్‌గా కేజీఎఫ్‌లోని యశ్ తల్లి- దర్శకుడిగా మారిన రచయిత- ఆది సాయికుమార్, వీవీ వినాయక్‌తో సినిమా లాంచ్

Archana Jois Telugu Debut Aadi Saikumar VV Vinayak: సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ సిరీస్‌లో యశ్‌కి తల్లిగా నటించిన అర్చన జోయిస్ హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. రచయితగా పనిచేసిన దివాకర్ యడ్ల ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. తాజాగా ఆది సాయికుమార్, వీవీ వినాయక్‌తో ఈ మూవీ లాంచ్ అయింది.

Published on: Nov 5, 2026, 12:54:04 IST
Advertisement

Archana Jois Telugu Debut Aadi Saikumar VV Vinayak: కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 ఘనంగా ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 4) ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

వీవీ వినాయక్, ఆది సాయికుమార్‌తో

హీరోయిన్‌గా కేజీఎఫ్‌లోని యశ్ తల్లి- దర్శకుడిగా మారిన రచయిత- ఆది సాయికుమార్, వీవీ వినాయక్‌తో సినిమా లాంచ్
హీరోయిన్‌గా కేజీఎఫ్‌లోని యశ్ తల్లి- దర్శకుడిగా మారిన రచయిత- ఆది సాయికుమార్, వీవీ వినాయక్‌తో సినిమా లాంచ్

సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్, ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేయడంతో ప్రారంభోత్సవ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీవీ వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా.. ముహూర్తపు షాట్‌కు నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్, సిద్ధు రెడ్డి, చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సన్నిహితులు పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

దర్శకుడిగా రైటర్ దివాకర్ యాడ్ల

దర్శకులు రవికుమార్ చౌదరి, ఘటికాచలం వద్ద రచయితగా అసోసియేట్‌గా పనిచేసిన దివాకర్ యడ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఓ అందమైన ప్రేమకథతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు దివాకర్ యడ్ల మాట్లాడుతూ.. "ప్రేమ అంటే రెండు మనసుల మధ్య పుట్టే ఒక అందమైన అనుభూతి. ఆ అనుభూతిని నిజాయతీగా, హృదయానికి హత్తుకునేలా తెరపై చూపించాలన్నదే మా ప్రయత్నం. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తన జీవితంలోని మధుర క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఆద్యంతం ఆహ్లాదంగా సాగే చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నాం" అని అన్నారు.

"హైదరాబాద్, కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాం. ఈ సినిమాకు కథే అసలైన హీరో. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ గారికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీర్వదించిన సినీ ప్రముఖులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేక్షకుల ఆదరణే మాకు అసలైన బలం" అని దర్శకుడిగా మారిన రచయిత దివాకర్ యాడ్ల తెలిపారు.

మంచి కథ, నాణ్యమైన నిర్మాణ విలువలతో

నిర్మాత ఎన్ఎన్. కిషోర్ మాట్లాడుతూ.. "సినిమా అంటే మాకు ప్రాణం. ఆ ప్రేమతోనే కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌ను ప్రారంభించాం. మా తొలి చిత్రం ఇంతమంది సినీ పెద్దల ఆశీస్సుల మధ్య ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. అదే సమయంలో మాపై మరింత బాధ్యతను పెంచింది. మంచి కథ, నాణ్యమైన నిర్మాణ విలువలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకునే చిత్రాన్ని అందించడమే మా లక్ష్యం" అని అన్నారు.

"దర్శకుడు దివాకర్ చెప్పిన కథపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వీవీ వినాయక్ గారు, ఆది సాయికుమార్ గారు, మల్కాపురం శివకుమార్ గారు, చీకోటి ప్రవీణ్ గారితో పాటు మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని ప్రొడ్యూసర్ చెప్పారు.

మరిన్ని సినిమాలు నిర్మించేందుకు

"కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా బ్యానర్‌పై మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ ఆశీస్సులు, ప్రేక్షకుల ఆదరణ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత ఎన్ఎన్ కిషోర్ ఆకాంక్షించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks