Khushboo: ఎన్నికల్లో గెలిస్తే మాంసం దుకాణాలను నిషేధిస్తా- డైరెక్టర్ సుందర్ సి అన్నట్లుగా పోస్టులు- విరుచుకుపడిన ఖుష్బూ!

Khushboo On Sundar C Meat Shop Ban Posts: తమిళనాడు ఎన్నికల బరిలో దిగుతున్న దర్శకుడు, నటుడు సుందర్ సి.. మదురైలో మాంసం దుకాణాలను నిషేధిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన భార్య, బీజేపీ నేత, హీరోయిన్ ఖుష్బూ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ ప్రత్యర్థుల కుట్రలని ఆమె మండిపడ్డారు.

Published on: Apr 7, 2026, 17:48:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళనాడు రాజకీయాలకు ఇప్పుడు సినీ గ్లామర్‌ తోడై హీటెక్కుతున్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు సుందర్ సి ఈ ఎన్నికల ద్వారా తన రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి 'పుదియ నీది కట్చి' (PNK) అభ్యర్థిగా, AIADMK కూటమి మద్దతుతో సుందర్ సి బరిలోకి దిగుతున్నారు. అయితే, ఆయన ప్రచార పర్వం మొదలవ్వకముందే సోషల్ మీడియాలో ఒక వివాదాస్పద వార్త చక్కర్లు కొడుతోంది.

ఎన్నికల్లో గెలిస్తే మాంసం దుకాణాలను నిషేధిస్తా- డైరెక్టర్ సుందర్ సి అన్నట్లుగా పోస్టులు- విరుచుకుపడిన ఖుష్బూ!
ఎన్నికల్లో గెలిస్తే మాంసం దుకాణాలను నిషేధిస్తా- డైరెక్టర్ సుందర్ సి అన్నట్లుగా పోస్టులు- విరుచుకుపడిన ఖుష్బూ!

అసలేం జరిగింది?

మదురై సెంట్రల్ నియోజకవర్గంలో తాను గెలిస్తే, అక్కడ ఉన్న మాంసం దుకాణాలను పూర్తిగా నిషేధిస్తానని సుందర్ సి అన్నట్లుగా మంగళవారం (ఏప్రిల్ 7) కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ప్రసిద్ధ మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడటానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పోస్టుల సారాంశం. ఈ వార్త స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

సుందర్ సి క్లారిటీ: "అవన్నీ పచ్చి అబద్ధాలు"

ఈ ప్రచారంపై సుందర్ సి వెంటనే స్పందించారు. "నేను గెలిస్తే మాంసం దుకాణాలను మూసివేయిస్తానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రజల మనోభావాలను, వారి హక్కులను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నాతో నేరుగా తలపడే ధైర్యం లేని వారు, ఇలాంటి అడ్డదారులు తొక్కుతూ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు. మా ఐక్యతతో, విజయంతో వీరికి తగిన బుద్ధి చెబుతాం" అని సుందర్ సి తమిళంలో ఘాటుగా పోస్ట్ చేశారు.

విరుచుకుపడ్డ ఖుష్బూ.. టార్గెట్ డీఎంకే!

సుందర్ సి భార్య, బీజేపీ సీనియర్ నాయకురాలు, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ తన భర్తకు అండగా నిలిచారు. ఈ ఫేక్ వార్తలకు అధికార డీఎంకే (DMK) పార్టీయే కారణమని ఖుష్బూ సుందర్ ఆరోపించారు.

"నిజాయితీ గల వ్యక్తిని నేరుగా ఎదుర్కోలేక, ఇలాంటి అబద్ధపు కథనాలను సృష్టిస్తున్నారు. డీఎంకేకు ఓటమి భయం పట్టుకుందని అర్థమవుతోంది. ప్రజల మద్దతు కోసం ఇలాంటి పనులు చేయడం వారికే చేటు చేస్తుంది. మదురై ప్రజలకు అంతా తెలుసు, వారంతా సుందర్ సి వెంటే ఉన్నారు" అని ఖుష్బూ సుందర్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.

రాజకీయ ప్రస్థానం

తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఖుష్బూ 2010లో డీఎంకే ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఆ తర్వాత కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఇక సుందర్ సి ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల ద్వారా తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఖుష్బూ సినిమాలు

సినిమాల విషయానికొస్తే.. ఖుష్బూ ఇటీవల 'నేసిప్పాయా', 'సుబేదార్' చిత్రాల్లో నటించారు. సుబేదార్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. సుందర్ సి 'మూకుత్తి అమ్మన్ 2', 'పురుషన్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More