OTT Telugu: ఓటీటీలో తెలుగులో 6 సినిమాలు- ఒక్కోదాంట్లో రెండేసి స్ట్రీమింగ్- 4 చాలా ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
OTT Releases Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో 6 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా 4 సినిమాలు ఉన్నాయి. ఇక ఈ ఆరు సినిమాలు ఒక్కో ప్లాట్‌ఫామ్‌లో రెండేసి చొప్పున ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ తెలుగు ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఏప్రిల్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈటీవీ విన్ వరకు వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో డిఫరెంట్ కంటెంట్ ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్‌కు అవుతున్నాయి. తెలుగులో 6 సినిమాలు రిలీజ్ కాగా అవి ఒక్కో ఓటీటీలో రెండేసి సినిమాల చొప్పున ప్రీమియర్ అవుతున్నాయి. ఈ ఆరులో 4 చాలా ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మృత్యుంజయ్: వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమానే మృత్యుంజయ్. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హత్యల చుట్టు సాగే మృత్యుంజయ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 3న మృత్యుంజయ్ ఓటీటీ రిలీజ్ అయింది.
మామ్లా లీగల్ హై - సీజన్ 2: హిందీలో సూపర్ హిట్ అయిన కోర్ట్ రూమ్ లీగల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై. దీనికి రెండో సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. అది తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో అలరించేందుకు సిద్ధమైంది ఈ సిరీస్ రెండో సీజన్. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 3 నుంచి తెలుగులో మామ్లా లీగల్ హై 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కోర్టు లోపల జరిగే సరదా సంఘటనలు, డ్రామా ఈ సిరీస్ ప్రత్యేకత.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
క్రైమ్ 101: ఇంగ్లీష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం క్రైమ్ 101. భారీ దొంగతనాలు, వాటి చుట్టూ తిరిగే ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 1న క్రైమ్ 101 ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం తెలుగులో కూడా క్రైమ్ 101 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఎస్ సరస్వతి: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో, ప్రియమణి కీ రూల్ చేసిన తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రమే ఎస్ సరస్వతి. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఆకట్టుకుంటుంది. ఆమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 3న ఎస్ సరస్వతి ఓటీటీలోకి వచ్చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీ
యుఫోరియా: ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో ధురంధర్ భామ సారా అర్జున్, భూమిక నటించిన సినిమా యుఫోరియా. ఇది ఒక తెలుగు సోషల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా. సమాజంలోని కొన్ని సున్నితమైన అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీలో చూపించారు. ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 2న యుఫోరియా రిలీజ్ అయింది.
లవ్ పాలసీ: వారాంతంలో (ఆదివారం) సరదాగా నవ్వుకోవడానికి వచ్చిన తెలుగు రొమాంటిక్ లవ్ కామెడీ క్రైమ్ డ్రామా లవ్ పాలసీ. ప్రేమ, రొమాన్స్, కొద్దిపాటి క్రైమ్ అంశాలతో కథతో తెరకెక్కిన లవ్ పాలసీ ఏప్రిల్ 5 నుంచి ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
మరింత ఇంట్రెస్టింగ్‌గా 4
ఇలా గత వారం (మార్చి 30 నుంచి ఏప్రిల్ 5) వరకు ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా వాటిలో ఆరు తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవి ఒక్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రెండేసి చొప్పున ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఈ ఆరింటిలో 4 తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన మృత్యుంజయ్, ఎస్ సరస్వతి, యుఫోరియా, లవ్ పాలసీ చూసేందుకు మరింత ఇంట్రెస్టింగ్‌గా, స్పెషల్‌గా ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












