Kiara Advani Hot: చాక్లెట్ తెచ్చిన మ‌మ్మీ.. హాట్‌షోతో రెచ్చిపోయిన కియారా అద్వానీ.. అలియా భ‌ట్ కామెంట్ చూశారా?

Kiara Advani Hot: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హాట్ షోతో రెచ్చిపోయింది. ఇన్ స్టాలో బోల్డ్ పోజులతో అందాల విందు వడ్డించేసింది.  వైరల్ గా మారిన ఈ ఫొటోలకు అలియా భట్ కామెంట్ కూడా తెగ చక్కర్లు కొడుతోంది.

Published on: Mar 26, 2026, 13:41:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అటు అందంతో, ఇటు యాక్టింగ్ తో ఈ ముద్దుగుమ్మ అదరగొడుతోంది. ప్రెగ్నెన్సీ కారణంగా మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ ఇప్పుడు మళ్లీ స్పీడ్ అందుకుంది. తాజాగా హాట్ షోతో రెచ్చిపోయింది. ఇవాళ సోషల్ మీడియాలో కియారా పోస్టు చేసిన బోల్డ్ పోజులు కుర్రకారు మతిపోగొట్టేలాా ఉన్నాయి.

కియారా అద్వానీ (instagram-KIARA)
కియారా అద్వానీ (instagram-KIARA)

కియారా బోల్డ్ పోజులు

కియారా అద్వానీ బోల్డ్ పోజులతో చెలరేగిపోయింది. అందాల విందు వడ్డించేసింది. కుర్రాళ్ల కలల రాణిలా పరువాలు ప్రదర్శించేసింది. గురువారం (మార్చి 26) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో కియారా పోస్టు చేసిన హాట్ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

చాక్లెట్

‘‘మమ్మీ ఇంటికి వచ్చింది. చాక్లెట్ తెచ్చింది’’ అంటూ కొంటె కొటేషన్ తో ఈ హాట్ ఫొటోలను కియారా అద్వానీ ఇన్ స్టాలో పోస్టు చేసింది. బ్రౌన్ చాక్లెట్ కలర్ డీప్ నెక్ గౌన్ లో కియారా అదిరిపోయింది. ఈ ఫొటోలు ఇన్ స్టంట్ సెన్సేషన్ గా మారాయి.

అలియా భట్ రియాక్షన్

కియారా అద్వానీ స్టన్నింగ్ ఫొటోలకు కామనర్లే కాకుండా సెలబ్రిటీలు కూడా రియాక్టవుతున్నారు. మరో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అయితే గార్జియస్ అనే అర్థం వచ్చేలా ‘గార్జి’ అని కామెంట్ పెట్టింది. నేహా ధూపియా ఫైర్ ఎమోజీ పోస్టు చేసింది.

తల్లిగా కియారా

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత వీళ్లు 2023లో వెడ్డింగ్ చేసుకున్నారు. 2025 జులై 15న కూతురికి కియారా జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ కారణంగా కొన్ని నెలల పాటు షూటింగ్ లకు కియారా దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ హాట్ షోతో ఫామ్ లోకి వచ్చింది.

కియారా సినిమాలు

2014లో వచ్చిన ఫగ్లీ మూవీతో కియారా అద్వానీ డెబ్యూ చేసింది. ఆ తర్వాత ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీలో నటించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమాతో తెలుగులో కియారా అడుగుపెట్టింది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ మూవీస్ చేసింది.

టాక్సిక్

చివరగా వార్ 2 సినిమాలో కియారా మెరిసింది. ఇది మల్టీ స్టారర్. హృతిక్ రోష‌న్‌, జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోలు. వార్ 2లో బికినీతో కియారా హీట్ పెంచేసింది. ఇక యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీలోనూ కియారా ఓ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More