...
...
Next Story

Kiara Advani: అదంతా నాన్సెన్స్: యశ్‌తో బోల్డ్ సీన్స్ తొలగించాలని అడిగినట్లు వచ్చిన వార్తలపై కియారా సీరియస్

Kiara Advani: రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమాలో కియారా అద్వానీ రొమాంటిక్ సీన్లపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఆ వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని, అందులో ఏమాత్రం నిజం లేదని కియారా తేల్చిచెప్పారు.

Published on: May 4, 2026, 20:45:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Kiara Advani: గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఏదో ఒక వార్తతో నిరంతరం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు విడుదల తేదీ వాయిదా పడినప్పటికీ, ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Kiara Advani: అదంతా నాన్సెన్స్: యశ్‌తో బోల్డ్ సీన్స్ తొలగించాలని అడిగినట్లు వచ్చిన వార్తలపై కియారా సీరియస్
Kiara Advani: అదంతా నాన్సెన్స్: యశ్‌తో బోల్డ్ సీన్స్ తొలగించాలని అడిగినట్లు వచ్చిన వార్తలపై కియారా సీరియస్

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేసింది. యశ్ తో తాను నటించిన కొన్ని రొమాంటిక్ సీన్లను తొలగించమని కియారా కోరినట్లు ప్రచారం జరిగింది. దీనిపై కియారా అద్వానీ స్వయంగా స్పందిస్తూ పుకార్లకు చెక్ పెట్టారు.

ఆ వార్తల్లో నిజం లేదు.. కియారా ఫైర్

టాక్సిక్ సినిమాలో యశ్, కియారా మధ్య కొన్ని ఘాటు రొమాంటిక్ సీన్లు ఉంటాయని, షూటింగ్ సమయంలో తనకు కంఫర్ట్‌గా ఉండేలా చూస్తామని చిత్ర బృందం హామీ ఇచ్చిందని కొన్ని వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ సీన్ల అవుట్‌పుట్ చూసి కియారా అసంతృప్తి వ్యక్తం చేసిందని, వాటిని ట్రిమ్ చేయమని లేదా వాటి డోస్ తగ్గించమని దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌ను కోరినట్లు సదరు కథనాల సారాంశం.

ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో కియారా దృష్టికి వెళ్ళింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను రీషేర్ చేస్తూ "ఇది పూర్తిగా నాన్సెన్స్" అంటూ ఘాటుగా బదులిచ్చారు. దీంతో ఆ రొమాంటిక్ సీన్ల వివాదానికి తెరపడినట్లయింది.

టాక్సిక్ విశేషాలు..

కియారా అద్వానీ 'నాదియా' అనే పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు. 2023 డిసెంబర్‌లో అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ.. షూటింగ్ 2024 ఆగస్టు నుండి 2025 అక్టోబర్ వరకు నిర్విరామంగా జరిగింది.

వాయిదాల పర్వం.. విడుదల ఎప్పుడంటే?

నిజానికి ఈ సినిమా గతేడాది ఏప్రిల్ 10నే విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల 2026కు వాయిదా పడింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, 'ధురంధర్ 2' వంటి భారీ చిత్రంతో పోటీని నివారించేందుకు మేకర్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం జూన్ 4న కూడా ఈ సినిమా రావడం లేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

దర్శకురాలి ప్రతిభపై యశ్ ప్రశంసలు

ఇటీవల కామిక్ కాన్ (ComicCon) ఈవెంట్‌లో యశ్ మాట్లాడుతూ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పనితీరును కొనియాడారు. "ఆమె ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. తను చేసే పనిపై ఆమెకు గట్టి నమ్మకం ఉంది. గీతూ అద్భుతమైన రచయిత్రి. ఈ ప్రయాణంలో నేను ఆమె దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక మహిళా దర్శకురాలిగా భావోద్వేగాలను, రొమాన్స్‌ను లేదా సెన్సువాలిటీని తెరపై చూపించే విధానం చాలా భిన్నంగా, గొప్పగా ఉంటుంది" అని యష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా కన్నడ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ రొమాంటిక్ సీన్లను తొలగించమని కోరినట్లు వస్తున్న వార్తలు నిజమేనా?

జవాబు: లేదు.. ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని కియారా అద్వానీ స్పష్టం చేశారు. వాటిని ఆమె "అబ్సల్యూట్ నాన్సెన్స్" అని కొట్టిపారేశారు.

ప్రశ్న: టాక్సిక్ సినిమాలో యశ్ ఎన్ని పాత్రల్లో కనిపిస్తారు?

జవాబు: టాక్సిక్ సినిమాలో యశ్.. రాయ, టికెట్ అనే రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రశ్న: టాక్సిక్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?

జవాబు: ప్రస్తుతానికి విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించలేదు. 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe