...
...
Next Story

Kiara Advani: టాక్సిక్ డైరెక్టర్ నన్ను కనీసం ఎవరికీ హాయ్ కూడా చెప్పనివ్వలేదు.. పూర్తిగా అదే జోన్‌లో ఉండాలంది: కియారా

Kiara Advani: టాక్సిక్ మూవీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ పై కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తనను సెట్స్ లో కనీసం ఎవరికీ హాయ్, హలో కూడా చెప్పనీయలేదని, దానికి కారణమేంటో కూడా వివరించింది.

Published on: May 29, 2026, 19:31:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Kiara Advani: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తున్న భారీ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic). గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ విశేషాలను, సెట్స్‌లో తనకు ఎదురైన ఒక విచిత్రమైన అనుభవాన్ని కియారా ఇటీవల పంచుకున్నారు. సెట్స్‌లోకి అడుగుపెట్టగానే ఎవరికీ ‘హాయ్, గుడ్ మార్నింగ్’ వంటి పలకరింపులు చెప్పకూడదని డైరెక్టర్ గీతూ తనకు కండిషన్ పెట్టినట్లు కియారా వెల్లడించారు.

సెట్స్‌లో నో 'హాయ్.. హలో'

Kiara Advani: టాక్సిక్ డైరెక్టర్ నన్ను కనీసం ఎవరికీ హాయ్ కూడా చెప్పనివ్వలేదు.. పూర్తిగా అదే జోన్‌లో ఉండాలంది: కియారా
Kiara Advani: టాక్సిక్ డైరెక్టర్ నన్ను కనీసం ఎవరికీ హాయ్ కూడా చెప్పనివ్వలేదు.. పూర్తిగా అదే జోన్‌లో ఉండాలంది: కియారా

బాంబే టైమ్స్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. తనకు సాధారణంగా షూటింగ్ సెట్‌కి వెళ్లగానే అందరినీ నవ్వుతూ పలకరించే అలవాటు ఉందని చెప్పారు. కానీ ‘టాక్సిక్’ సెట్స్‌లో మాత్రం దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఇందుకు భిన్నమైన రూల్ పెట్టారట.

"నువ్వు రేపు సెట్‌కి వచ్చేటప్పుడు నీ టీమ్‌తో సహా ఎవరికీ ‘హాయ్, హలో’ లాంటి పలకరింపులు చెప్పకూడదు. నేరుగా ఆ పాత్ర తాలూకు ఎమోషనల్ జోన్‌లోకి వచ్చేయాలి అని గీతూ నాకు చెప్పారు. ఆ రోజంతా నేను ఆ క్యారెక్టర్ మూడ్‌లోనే ఉండాలని ఆమె అలా చేశారు" అని కియారా అద్వానీ చెప్పింది.

కన్నడ, ఇంగ్లీష్‌లలో షూటింగ్.. కియారాకు పెద్ద సవాల్

టాక్సిక్’ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి చిత్రీకరించడం తనకు పెద్ద సవాల్‌గా మారిందని కియారా ఒప్పుకున్నారు.

మొదట ఒక సీన్‌ను ఇంగ్లీష్‌లోకి పర్ఫెక్ట్ టేక్ వచ్చే వరకు షూట్ చేసి, ఆ తర్వాత అదే సీన్‌ను కన్నడలో రీటేక్ చేసేవారట. కన్నడ తన మాతృభాష కాకపోవడంతో, షూటింగ్‌కు ముందు రోజు రాత్రంతా డైలాగులను బట్టీ పట్టేదాన్ని అని కియారా తెలిపారు.

ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్ డ్యుయల్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాను దాదాపు రూ.700–800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మొదట ఈ చిత్రం ఏప్రిల్ 2025లో, ఆ తర్వాత మార్చి 19, 2026 న విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇరాన్-అమెరికా వివాదం కారణంగా మిడిల్ ఈస్ట్ మార్కెట్ దెబ్బతినడం, అలాగే బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ 2’ తో క్లాష్‌ను నివారించడానికి మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలలో సౌత్ సినిమాలకు భారీ మార్కెట్ ఉండటంతో కలెక్షన్లపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'టాక్సిక్' సెట్స్‌లో కియారా అద్వానీకి డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఎలాంటి కండిషన్ పెట్టారు?

షూటింగ్ సెట్‌లోకి రాగానే తన టీమ్‌తో సహా ఎవరికీ ‘హాయ్, హలో’ చెప్పకూడదని, నేరుగా క్యారెక్టర్ జోన్‌లోకి వెళ్లిపోవాలని గీతూ కండిషన్ పెట్టారు.

2. ‘టాక్సిక్’ సినిమాలో కియారా పాత్ర పేరు ఏంటి, ఆమె ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు?

ఈ సినిమాలో కియారా పాత్ర పేరు ‘నాడియా’. ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఒకేసారి షూట్ చేయడంతో, కన్నడ రాని కియారా షూటింగ్‌కు ముందు రోజు రాత్రంతా డైలాగులు బట్టీ పట్టాల్సి వచ్చేదట.

3. 'టాక్సిక్' సినిమా విడుదల ఎందుకు ఆలస్యమైంది, ఇప్పుడు ఎప్పుడు విడుదల కానుంది?

ఇరాన్-అమెరికా వివాదం కారణంగా మిడిల్ ఈస్ట్ మార్కెట్ ఎఫెక్ట్ అవ్వడం, ‘ధురంధర్ 2’ సినిమాతో పోటీని తట్టుకోవడానికి ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ చిత్రం ఇప్పుడు జూన్ 4, 2026 న థియేటర్లలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe