Kiara Advani: బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన మూవీ 'షేర్షా' (Shershaah). కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ ప్రేమ ప్రయాణం అందరూ అనుకున్నంత సులువుగా సాగలేదని, ఒక దశలో ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చి బ్రేకప్ వరకు వెళ్లిందని వీరు వెల్లడించారు.

కరణ్ జోహార్ పాపులర్ షో 'కాఫీ విత్ కరణ్' ఆఖరి సీజన్ (సీజన్ 9) ఎపిసోడ్లో ఈ జంట పాల్గొని తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ఆసక్తికరమైన రహస్యాలను వెల్లడించారు.
"నాకు హాట్ అండ్ కోల్డ్ వద్దు.. కియారా ఘాటు హెచ్చరిక"
'లస్ట్ స్టోరీస్' ప్యాకప్ తర్వాత ఒక పార్టీలో తొలిసారి కలుసుకున్న కియారా-సిద్ధార్థ్, 2019లో 'షేర్షా' ప్రాజెక్ట్ ద్వారా దగ్గరయ్యారు. అయితే సినిమా కార్గిల్ షెడ్యూల్ ప్రారంభమవ్వడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి వీరిద్దరి మధ్య పెద్ద రచ్చ జరిగింది.
కియారా ఆనాటి ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ.. "కార్గిల్ బయలుదేరే ముందు రాత్రి నేను సిద్ధార్థ్‌తో స్పష్టంగా చెప్పేశాను. 'నువ్వు నా విషయంలో చాలా హాట్ అండ్ కోల్డ్ గా వ్యవహరిస్తున్నావు. నాకు అర్థం కావడం లేదు. నా విషయంలో ఉంటే పూర్తిగా ఉండాలి లేదా వెళ్ళిపోవాలి. ఈ రెండింటి మధ్య ఊగిసలాడే మనస్తత్వం నాకు నచ్చదు, నేను భరించలేను' అని తెగేసి చెప్పాను" అని చెప్పింది.
ఆ సమయంలో సిద్ధార్థ్ కూడా కియారాతో ఏకీభవించారు. తన కెరీర్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం కావడం వల్ల, రిలేషన్షిప్లో సీరియస్‌గా కమిట్ అయితే పనికి అంతరాయం కలుగుతుందని భావించి ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
30 రోజుల కార్గిల్ ఫోన్ కాల్స్.. మళ్లీ చిగురించిన బంధం!
బ్రేకప్ చెప్పుకుని సిద్ధార్థ్ మల్హోత్రా కార్గిల్ షూటింగ్‌కు వెళ్లారు. అక్కడ కనీస వసతులు లేని అత్యంత ప్రతికూల వాతావరణంలో, సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని ప్రదేశంలో ఒక నెల రోజుల పాటు షూటింగ్ జరిగింది. అయితే విడిపోయినప్పటికీ కియారా జ్ఞాపకాలు సిద్ధార్థ్‌ను వదల్లేదు.
{{/usCountry}}బ్రేకప్ చెప్పుకుని సిద్ధార్థ్ మల్హోత్రా కార్గిల్ షూటింగ్‌కు వెళ్లారు. అక్కడ కనీస వసతులు లేని అత్యంత ప్రతికూల వాతావరణంలో, సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని ప్రదేశంలో ఒక నెల రోజుల పాటు షూటింగ్ జరిగింది. అయితే విడిపోయినప్పటికీ కియారా జ్ఞాపకాలు సిద్ధార్థ్‌ను వదల్లేదు.
{{/usCountry}}నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా, రోజూ షూటింగ్ ప్యాకప్ అయిన వెంటనే సిద్ధార్థ్ కియారాకు కాల్ చేసేవారు లేదా మెసేజ్‌లు పెట్టేవారు. వరుసగా 30 రోజుల పాటు ప్రతీ రాత్రి కార్గిల్ నుంచి కియారాతో మాట్లాడటంతో ఇద్దరి మధ్య దూరం తగ్గి, బంధం మరింత బలపడింది. ఈ 30 రోజుల నిరంతర సంభాషణలే తమను మళ్లీ ప్రేమికులుగా మార్చాయని కియారా వివరించారు.
రాజస్థాన్‌లో రాజసం.. ఇప్పుడు రెండోసారి గర్భం!
కొన్నేళ్ల పాటు తమ ప్రేమాయణాన్ని గుట్టుగా ఉంచిన ఈ జంట 2023లో రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోటలో సాంప్రదాయ హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2025 జులైలో కుమార్తె 'సారాయా' (Saraayah) జన్మించింది. అక్టోబర్ 2026లో కియారా అద్వానీ మళ్లీ గర్భవతి అని ఈ జంట అధికారికంగా ప్రకటించింది.
ఇక 2003లో ప్రారంభమైన 'కాఫీ విత్ కరణ్' టాక్ షో.. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar)లో 9వ సీజన్‌తో ముగింపు పలుకుతోంది. చివరి సీజన్లో విడిపోయి మళ్లీ ఒకటైన తమ ప్రేమ కథను పంచుకుని కియారా-సిద్ధార్థ్ జోడీ వీక్షకులకు ప్రత్యేకమైన జ్ఞాపకాలను అందించింది.