కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ బయోపిక్.. అతని మేనల్లుడే లీడ్ రోల్లో.. టీజర్ రిలీజ్.. ఊగిపోతున్న ఫ్యాన్స్

కింగ్ ఆఫ్ పాప్‌గా పేరుగాంచిన దివంగత మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ టీజర్ వచ్చేసింది. అతని మేనల్లుడు జాఫర్ జాక్సనే అతని పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆ పాప్ కింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Published on: Nov 6, 2025, 22:10:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మైఖేల్ జాక్సన్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ప్రపంచ సంగీత చరిత్రలో అతడొక ఎవర్‌గ్రీన్ లెజెండ్. అతని జీవితంపై బయోపిక్ రాబోతోందని అనౌన్స్ చేసినప్పుడు అభిమానుల ఆనందానికి అవధులు లేవు. చాలా కాలం ఆలస్యం తర్వాత ఇప్పుడు మేకర్స్ 'మైఖేల్' సినిమా మొట్టమొదటి అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో దివంగత సంగీత దిగ్గజం పాత్రలో అతని మేనల్లుడు నటించడం విశేషం.

కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ బయోపిక్.. అతని మేనల్లుడే లీడ్ రోల్లో.. టీజర్ రిలీజ్.. ఊగిపోతున్న ఫ్యాన్స్
కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ బయోపిక్.. అతని మేనల్లుడే లీడ్ రోల్లో.. టీజర్ రిలీజ్.. ఊగిపోతున్న ఫ్యాన్స్

'మైఖేల్' టీజర్‌ ఇలా..

కింగ్ ఆఫ్ పాప్ గా పేరుగాంచిన మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఈ మైఖేల్ మూవీ రూపొందుతోంది. గురువారం (నవంబర్ 6) టీజర్ రిలీజ్ చేశారు. నిమిషం నిడివి గల ఈ టీజర్ ద్వారా మైఖేల్ మేనల్లుడు, జెర్మైన్ జాక్సన్ కుమారుడు అయిన జాఫర్ జాక్సన్.. 'కింగ్ ఆఫ్ పాప్' పాత్రలో ఎలా ఒదిగిపోయాడో ఒక చిన్నపాటి గ్లింప్స్ చూపించారు.

ఇందులో మైఖేల్ అత్యంత పాపులర్ అయిన ఆల్బమ్‌లలో ఒకటైన ‘థ్రిల్లర్’ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న సమయంలో.. జాఫర్ లెజెండరీ నిర్మాత క్విన్సీ జోన్స్ (కెండ్రిక్ సామ్సన్)తో కలిసి పనిచేసే సీన్ కనిపిస్తుంది. "దీని కోసం మీరు చాలా కాలం వేచి చూశారని నాకు తెలుసు. ట్రాక్స్ పూర్తయ్యాయి, పాటలు సిద్ధంగా ఉన్నాయి. మనం మొదటి నుంచి మొదలు పెడదాం.. ఇది నీ కథ" అని సామ్సన్ చెప్పే డైలాగ్‌తో పాటు, జాక్సన్ ఫొటోలు వేగంగా ఫ్లాష్ అవుతాయి.

ఈ మూవీ స్టోరీ లైన్ ఇలా ఉంది. “మైఖేల్ ప్రపంచం ఎన్నడూ చూడని అత్యంత ప్రభావవంతమైన ఆర్టిస్టులలో ఒకరి జీవితాన్ని, వారసత్వాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తుంది. ఈ సినిమా అతడి మ్యూజిక్ నే కాదు.. మైఖేల్ జాక్సన్ జీవిత కథను చెబుతుంది. స్టేజ్ వెనుక ఆయన జీవితాన్ని, అలాగే ప్రారంభ సోలో కెరీర్‌లోని కొన్ని ఐకానిక్ ప్రదర్శనలను హైలైట్ చేస్తూ, ప్రేక్షకులకు మైఖేల్ జాక్సన్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా దగ్గరగా చూసే అవకాశం ఇస్తుంది. ఇక్కడి నుంచే ఆయన కథ మొదలవుతుంది” అని మేకర్స్ చెప్పారు.

అభిమానుల స్పందన ఎలా ఉందంటే?

మైఖేల్ మూవీ టీజర్ చూసిన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఒక అభిమాని స్పందిస్తూ.. “ఈ భూమిపై నడిచిన అత్యంత గొప్ప ఎంటర్‌టైనర్. ఇంటర్నెట్ లేకుండా, సోషల్ మీడియా లేకుండానే, ఆయన ప్రపంచాన్ని రాజులా పాలించారు. ఇప్పటికీ ఎంజే సాధించిన గ్లోబల్ స్టార్‌డమ్ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరు" అని కామెంట్ చేశారు.

"జాఫర్ తన మామయ్య పాత్ర పోషించడం చూసి నాకు నవ్వు వచ్చింది.. ఈ సినిమాపై నాకు చాలా ఆశలు ఉన్నాయి. దేవుడా, దయచేసి దీన్ని గొప్పగా చేయి. లవ్ యూ ఎంజే" అని మరొక అభిమాని అన్నారు.

"నాకు మాటలు రావట్లేదు. ఇది నమ్మశక్యం కాదు. వచ్చే ఏడాది కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం" అని ఇంకొకరు తమ ఉద్వేగాన్ని పంచుకున్నారు. మైఖేల్ సినిమాలో జాఫర్‌తో పాటు నియా లాంగ్, లారా హారియర్, జులియానో క్రూ వాల్డి, మైల్స్ టెల్లర్, కోల్మాన్ డొమింగో వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంటోయిన్ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More