టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం 'కె ర్యాంప్' శనివారం (అక్టోబర్ 18) థియేటర్లలో విడుదలైంది. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ సినిమా.. ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం 'డ్యూడ్', సిద్ధు జొన్నలగడ్డ మూవీ ‘తెలుసు కదా’తో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతోంది. ఈ పోటీ మధ్య అబ్బవరం సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
డెబ్యూ డైరెక్టర్

కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. జైన్స్ నాని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా కథానాయికగా నటించింది. వీరితో పాటు సాయి కుమార్, నరేష్ విజయకృష్ణ, కామ్నా జఠ్మలానీ, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేష్ తాండ, శివ బొమ్మక్కు ఈ చిత్రాన్ని నిర్మించారు.
కె ర్యాంప్ ట్విటర్ రివ్యూ
మార్నింగ్ షోల తర్వాత చాలా మంది తమ రివ్యూలను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఒక యూజర్ 'కె ర్యాంప్' సెకండాఫ్‌ను ప్రశంసించారు. సినిమాను 'డీసెంట్' అని పేర్కొంటూ ఆ పోస్ట్‌లో ఇలా రాశారు. “నా షో పూర్తయింది, సెకండాఫ్ బాగుంది..!! డిజార్డర్ క్యారెక్టరైజేషన్ సీన్స్, కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయ్యాయి. ఫాదర్ సెంటిమెంట్ మినహా, సీన్ 1 నుంచే కుమార్ అబ్బవరం షో అదరిపోయింది. క్లైమాక్స్ బాగుంది. మొత్తంగా ఒక డీసెంట్ ఎంటర్‌టైనర్. 2.5/5 ” అని పోస్టు చేశాడు.
యావరేజ్
మరో యూజర్ ఈ సినిమాకు యావరేజ్ రేటింగ్ ఇచ్చి ఇలా రాశారు. “మంచి ప్రయత్నమే కానీ ఫ్లాట్‌గా సాగింది. ఓవరాల్.. 2.35/5. కొన్ని అరుదైన మంచి క్షణాలు ఉన్నాయి, కానీ మొత్తంగా ఒక యావరేజ్ సినిమా. కంటెంట్ జానర్ కిరణ్ అబ్బవరానికి సరిపోతుంది. ముఖ్యంగా బీజీఎం అద్భుతంగా ఉంది. సంగీతమే ఈ సినిమాను కాపాడింది. కథ ఫర్వాలేదు” అని పేర్కొన్నాడు.
{{/usCountry}}మరో యూజర్ ఈ సినిమాకు యావరేజ్ రేటింగ్ ఇచ్చి ఇలా రాశారు. “మంచి ప్రయత్నమే కానీ ఫ్లాట్‌గా సాగింది. ఓవరాల్.. 2.35/5. కొన్ని అరుదైన మంచి క్షణాలు ఉన్నాయి, కానీ మొత్తంగా ఒక యావరేజ్ సినిమా. కంటెంట్ జానర్ కిరణ్ అబ్బవరానికి సరిపోతుంది. ముఖ్యంగా బీజీఎం అద్భుతంగా ఉంది. సంగీతమే ఈ సినిమాను కాపాడింది. కథ ఫర్వాలేదు” అని పేర్కొన్నాడు.
{{/usCountry}}ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, మరో యూజర్ ఇలా రాశారు. “ కె ర్యాంప్ మొదటి భాగం మిశ్రమంగా ఉంది. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేదు. కామెడీ లౌడ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది, కానీ అందరికీ నచ్చకపోవచ్చు. మొత్తంగా సెకండాఫ్ మెరుగ్గా ఉంటుందనే ఆశతో చూడొచ్చు!” అని పోస్టు చేశాడు.
“ఫన్ కామెడీ, హీరో-హీరోయిన్ల మధ్య ఆకట్టుకునే సన్నివేశాలతో సెకండాఫ్ అదరగొట్టింది, ఎమోషనల్ క్లైమాక్స్‌తో ముగిసింది” అని కిరణ్ అబ్బవరం సినిమా క్లైమాక్స్‌కు మరో యూజర్ ఫిదా అయ్యాడు.
ఔట్‌డేటెడ్
వెంకీ రివ్యూస్ ఈ సినిమాను 'ఔట్‌డేటెడ్' అని పేర్కొంటూ ఘాటైన రివ్యూ ఇచ్చింది. “కె ర్యాంప్ ఒక సిల్లీ, ఔట్‌డేటెడ్ సినిమా. ఇది మొదటి నుంచి చివరి వరకు ఓవర్ ది టాప్‌గా ఉంది!. ఈ సినిమా చాలా సాధారణ కథతో, మనం ఎన్నోసార్లు చూసిన రొటీన్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. కేవలం వినోదాన్ని పంచే జానర్‌కు ఇది వర్కవుట్ అయ్యేదేమో కానీ ఇక్కడ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ హద్దులు దాటి చిరాకు తెప్పించేలా, సిల్లీగా అనిపిస్తుంది. దర్శకుడు కొన్ని కామెడీ సీన్స్‌ను మాత్రమే పండించగలిగాడు. మిగతా రచన పేలవంగా, లోతు లేకుండా ఉంది. కిరణ్ అబ్బవరం ఎప్పటిలాగే ఎనర్జీని పాత్రకు అందించాడు, కానీ గత చిత్రాల మాదిరిగానే రిపీట్‌గా అనిపించింది’’ అని పోస్టు చేశారు.