Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన నయా మూవీ 'చెన్నై లవ్ స్టోరీ' ప్రమోషన్లలో ఒక ఊహించని సంచలన విషయాన్ని రివీల్ చేశారు. మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ హీరోగా రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'సంబరాల ఏటి గట్టు' (SYG) మొదట తన దగ్గరికే వచ్చిందని ఆసక్తికర నిజం బయటపెట్టారు. అయితే ఆ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడం, తనతో అంత బడ్జెట్ మూవీ రిస్క్ అనే వదులుకున్నట్లు చెప్పడం విశేషం.
రూ. 2 కోట్ల కథ.. రూ. 80 కోట్ల స్కేల్

'ఎస్ఆర్ కళ్యాణమండపం' షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే డైరెక్టర్ రోహిత్ కేపీ తనకు ఈ లైన్ చెప్పాడని కిరణ్ అబ్బవరం గుర్తుచేసుకున్నారు. మొదట కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌లో నార్మల్ సినిమాగా ప్లాన్ చేసిన ఈ కథను, డైరెక్టర్ విజన్ నచ్చి పెద్ద క్యాన్వాస్‌లో తెరకెక్కించాలని తానే సలహా ఇచ్చానని తెలిపారు.
'హనుమాన్' లాంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి రోహిత్‌ను పరిచయం చేసింది కూడా తానేనని చెప్పారు.
స్క్రిప్ట్ డెవలప్ అయ్యే కొద్దీ కథ స్కేల్, బడ్జెట్ భారీగా పెరిగిపోయాయని కిరణ్ వివరించారు. దాదాపు రూ. 70 నుంచి 80 కోట్ల వరకు బడ్జెట్ అవసరమని తేలింది. అయితే ఆ టైమ్‌లో తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్‌ఫార్మ్ చేయకపోవడంతో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పారు. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి తనతోనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ.. తన మార్కెట్ రేంజ్ కంటే అంత పెద్ద మొత్తాన్ని రిస్క్ చేయడం ఏమాత్రం సేఫ్ కాదని భావించి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ చేతుల్లోకి 'సంబరాల ఏటి గట్టు'
కిరణ్ నో చెప్పడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాయి దుర్గా తేజ్ దగ్గరకు వెళ్ళింది. భారీ స్కేల్లో గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు రూ. 100 కోట్లకు పైగా దాటింది.
{{/usCountry}}కిరణ్ నో చెప్పడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాయి దుర్గా తేజ్ దగ్గరకు వెళ్ళింది. భారీ స్కేల్లో గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు రూ. 100 కోట్లకు పైగా దాటింది.
{{/usCountry}}పీటర్ హెయిన్ కొరియోగ్రఫీలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు మెయిన్ పిల్లర్స్‌గా నిలవనున్నాయి.
'చెన్నై లవ్ స్టోరీ'పై ఫుల్ కాన్ఫిడెన్స్
తన సొంత మార్కెట్, ప్రొడ్యూసర్ సేఫ్టీ గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడిన కిరణ్ అబ్బవరం నిజాయితీకి ఫ్యాన్స్, ట్రేడ్ విశ్లేషకులు హాట్సాఫ్ చెబుతున్నారు. ప్రస్తుతం రవి నంబూరి డైరెక్షన్‌లో శ్రీ గౌరిప్రియ హీరోయిన్‌గా వస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాపై కిరణ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన ఈ యూత్‌ఫుల్ లవ్ డ్రామా జులై 24న థియేటర్లలోకి రాబోతోంది. వింటేజ్ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన కెరీర్‌కు పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇస్తుందని కిరణ్ గట్టిగా నమ్ముతున్నారు.