OTT Crime Thriller: మూవీ రిలీజ్‌కు ముందే క‌న్నుమూసిన డైరెక్ట‌ర్‌.. మూడు వారాల‌కే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్‌!

OTT Crime Thriller: ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. అయితే ఈ మూవీ దర్శకుడు రిలీజ్ కు ముందే చనిపోయారు. ఇప్పుడా చిత్రం మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 28, 2026, 14:19:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Crime Thriller: లేటెస్ట్ తెలుగు క్రైమ్ యాక్షన్ డ్రామా 'KJQ: కింగ్ జాకీ క్వీన్' (KJQ: King Jackie Queen) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టింది. థియేట్రికల్ విడుదలైన తర్వాత సరిగ్గా మూడు వారాలకు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Crime Thriller: మూవీ రిలీజ్‌కు ముందే క‌న్నుమూసిన డైరెక్ట‌ర్‌.. మూడు వారాల‌కే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్‌!
OTT Crime Thriller: మూవీ రిలీజ్‌కు ముందే క‌న్నుమూసిన డైరెక్ట‌ర్‌.. మూడు వారాల‌కే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్‌!

ప్యారడైజ్ ప్రొడ్యూసర్

'దసరా', 'ది ప్యారడైజ్' వంటి భారీ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ కేజేక్యూ మూవీని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయింది.

నటీనటుల పనితీరుకు ప్రశంసలు దక్కినప్పటికీ, థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ కేజేక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేకపోయింది. అప్పట్లో కేవలం తెలుగు భాషలోనే థియేటర్లలోకి తీసుకొచ్చారు.

ఓటీటీలో నాలుగు భాషల్లో

ఇవాళ (ఆగస్టు 28) ఓటీటీలోకి కేజేక్యూ మూవీ వచ్చేసింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో నాలుగు భాషల్లో రిలీజైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో తెలుగు ఒరిజినల్‌తో పాటు తమిళం, కన్నడ, మలయాళ డబ్బింగ్ వెర్షన్లలో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల దక్షిణాదిలోని ఇతర ప్రాంతీయ భాషల ప్రేక్షకులకు కూడా ఈ క్రైమ్ డ్రామా రీచ్ పెరిగే అవకాశం లభించింది.

దర్శకుడు మరణం

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దివంగత దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) ప్రతిభ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ, సినిమా వెండితెరపై విడుదల కాకముందే ఆయన కన్నుమూయడం చిత్రబృందాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. తన చివరి దర్శకత్వ ప్రయోగాన్ని ప్రేక్షకులు తెరపై చూడటాన్ని ఆయన స్వయంగా వీక్షించలేకపోయారు.

1990ల క్రైమ్ స్టోరీ

1990ల కాలం నాటి మురికివాడలు, గ్యాంగ్‌స్టర్ కల్చర్, నేర సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. నేరం, అధికారం, వ్యక్తిగత పగ, వైరం చుట్టూ తిరిగే ముగ్గురు ప్రధాన పాత్రల జీవితాలను ఉత్కంఠభరితంగా ఈ చిత్రంలో ఆవిష్కరించారు. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా ఇందులో కీలక పాత్రలు పోషించారు.

ఇదే స్పెషల్

ఇక ఈ కేజీక్యూ సినిమాలో మరో స్పెషాలిటీ ఉంది. అదే 'ది ప్యారడైజ్' చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే శశి తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన 'KJQ: కింగ్ జాకీ క్వీన్' చిత్రం ఓటీటీ వేదికగా డిజిటల్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో, ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More