టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా నడుస్తున్న కాలం ఇది. ప్రతి స్టార్ హీరో పాత సినిమాలను ఏదో ఒక సందర్భంలో రీరిలీజ్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ కొదమసింహం కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరుని కౌబాయ్ పాత్రలో చూపించిన ఈ మూవీ రీరిలీజ్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.
కొదమసింహం రీరిలీజ్ ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి 1990లో నటించిన సూపర్ హిట్ మూవీ కొదమసింహం. కే మురళీమోహన్ రావు డైరెక్ట్ చేశాడు. పరచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాను ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత నవంబర్ 21న రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవితోపాటు సోనమ్, మోహన్ బాబు, రాధ, కన్నడ ప్రభాకర్ లాంటి వాళ్లు నటించారు. మూవీ రీరిలీజ్ ట్రైలర్ 4కే క్వాలిటీలో రిలీజై అభిమానులకు కనులవిందు చేసింది.
చిరు కౌబాయ్ పాత్ర, నిధి వేట ఈ మూవీని ప్రత్యేకంగా నిలిపాయి. అప్పట్లోనే రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. దివంగత కైకాల సత్యనారాయణే ఈ సినిమాను నిర్మించి, అందులో నటించాడు. మూవీలో చిరంజీవి నటన, మ్యూజిక్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. 20 సెంటర్లలో 100 రోజులు ఆడిన మూవీ ఇది. అలాంటి సినిమాను 4కే క్వాలిటీతో రీరిలీజ్ చేస్తుండటం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
రీరిలీజ్‌ల హవా
టాలీవుడ్ లో కొంత కాలంగా పాత సినిమాలను రీరిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తోంది. అయితే అది ఇప్పుడు మరీ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది. ఎందుకంటే వచ్చే మూడు వారాల్లో ఏకంగా ఆరు సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఈవారం అంటే నవంబర్ 14న శివ మూవీతో అది మొదలుకానుంది. నాగార్జున, ఆర్జీవీ సూపర్ హిట్ మూవీ అయిన శివ కూడా 4కే క్వాలిటీలో రాబోతోంది.
ఇక ఆ మరుసటి రోజే అంటే నవంబర్ 15న సిద్ధార్థ్, త్రిష మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా రానుంది. నవంబర్ 21న కొదమసింహం రానుండగా.. నవంబర్ 22న కార్తీ నటించిన ఆవారా, నవంబర్ 28న సూర్య నటించిన సికిందర్, నవంబర్ 29న మహేష్ బాబు నటించిన బిజినెస్‌మ్యాన్ రీరిలీజ్ కానున్నాయి.
{{/usCountry}}ఇక ఆ మరుసటి రోజే అంటే నవంబర్ 15న సిద్ధార్థ్, త్రిష మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా రానుంది. నవంబర్ 21న కొదమసింహం రానుండగా.. నవంబర్ 22న కార్తీ నటించిన ఆవారా, నవంబర్ 28న సూర్య నటించిన సికిందర్, నవంబర్ 29న మహేష్ బాబు నటించిన బిజినెస్‌మ్యాన్ రీరిలీజ్ కానున్నాయి.
{{/usCountry}}