Korean Kanakaraju: నక్కతోక తొక్కిన మెగా హీరో.. రిలీజ్ కు ముందే 72 శాతం బడ్జెట్ రికవరీ.. హారర్ థ్రిల్లర్ ఓటీటీకి డిమాండ్!

Korean Kanakaraju OTT: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నక్క తోక తొక్కాడు. అతని అప్ కమింగ్ క్రేజీ హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' రిలీజ్ కు ముందే అదరగొడుతోంది. డిజిటల్ ఓటీటీ, శాటిలైట్ తదితర హక్కుల రూపంలో ఏకంగా 72 శాతం రికవరీ చేసింది. ఈ చిత్రం బిజినెస్ లెక్కలు, ట్రేడ్ విశ్లేషణపై రిపోర్ట్ చూసేయండి.

Published on: Jul 24, 2026, 14:16:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Korean Kanakaraju OTT: విలక్షణమైన కథాంశాలతో అలరించే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన మార్క్ కామెడీతో ఆకట్టుకునే మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ హారర్ కామెడీ డ్రామా.. విడుదలకు ముందే ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నక్కతోక తొక్కిన మెగా హీరో.. రిలీజ్ కు ముందే 72 శాతం బడ్జెట్ రికవరీ.. హారర్ థ్రిల్లర్ ఓటీటీకి డిమాండ్!
నక్కతోక తొక్కిన మెగా హీరో.. రిలీజ్ కు ముందే 72 శాతం బడ్జెట్ రికవరీ.. హారర్ థ్రిల్లర్ ఓటీటీకి డిమాండ్!

రూ. 26 కోట్లతో సంచలనం

సుమారు రూ.38 కోట్ల అంచనా బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాపై ఇండస్ట్రీలో మొదటినుంచీ మంచి క్రేజ్ ఉంది. ఫిల్మ్ నగర్ లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు ఊహించని ధరకు అమ్ముడయ్యాయి. డిజిటల్ (OTT), టీవీ శాటిలైట్, ఆడియో, హిందీ డబ్బింగ్ హక్కులు కలిపి ఏకంగా రూ.26 కోట్ల భారీ మొత్తాన్ని సాధించాయని టాక్.

అంటే కేవలం నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారానే నిర్మాతలు తమ బడ్జెట్‌లో దాదాపు 72 శాతం రికవర్ చేయడం విశేషం. కొరియన్ కనకరాజు మూవీ ఓటీటీ డీల్ కు ఉన్న డిమాండ్ కు ఇదే నిదర్శనం.

నిర్మాతల ధీమా

నాన్-థియేట్రికల్ డీల్స్‌తో సగం సేఫ్ జోన్‌లోకి వచ్చిన కొరియన్ కనకరాజు చిత్రానికి థియేట్రికల్ హక్కుల రూపంలో మరో రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మార్క్‌ను అందుకుంటే వరుణ్ తేజ్ సినిమా విడుదల కాకుండానే పక్కా లాభాల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

టీజర్ బూస్ట్

కొరియన్, ఇండియన్ కల్చర్స్‌ను బ్లెండ్ చేస్తూ మేర్లపాక గాంధీ మార్కు హారర్ కామెడీతో వచ్చిన కొరియన్ కనకరాజు టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కమెడియన్ సత్య కామెడీ టైమింగ్, ఎస్.తమన్ అందించిన సంగీతం సినిమాపై ఉన్న హైప్‌ను రెట్టింపు చేశాయి.

దీంతో డిజిటల్ అండ్ శాటిలైట్ బయర్స్ పోటీపడి మరీ హక్కులను కైవసం చేసుకున్నారు. ఈ సినిమాలో రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్‌గా నటించగా, యూవీ క్రియేషన్స్ (UV Creations), ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఆ జోనర్ కారణం

వరుణ్ తేజ్ గత చిత్రాల ఫలితాల తర్వాత ఈ ప్రాజెక్ట్ రీ-సౌండ్ చేయడం ట్రేడ్‌లో విశేషంగా మారింది. రూ.38 కోట్ల మీడియం బడ్జెట్ సినిమాకు రూ.26 కోట్ల నాన్-థియేట్రికల్ రికవరీ రావడం వెనుక ఓ కారణం ఉంది.

'హారర్ కామెడీ' జోనర్‌కు ఓటీటీ అండ్ హిందీ డబ్బింగ్ మార్కెట్‌లో ఉన్న విపరీతమైన డిమాండే దీనికి ప్రధాన కారణం. మేర్లపాక గాంధీ కామెడీ ట్రాక్ రికార్డ్, తమన్ మ్యూజిక్ బ్రాండ్ వాల్యూ ఈ ప్రాజెక్ట్‌ను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే సురక్షితమైన జోన్‌లో నిలబెట్టాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More