Korivi Movie Title Announcement Glimpse On Director Sridhar Gade Birthday: 'ఎస్‌ఆర్ కళ్యాణమండపం' సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన దర్శకత్వ ప్రతిభతో ఆడియెన్స్ మనసు దోచుకున్న శ్రీధర్ గాదె మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చారు.
శ్రీధర్ గాదె పుట్టినరోజు సందర్భంగా

శ్రీధర్ గాదె పుట్టినరోజు (అక్టోబర్ 31)ను పురస్కరించుకుని ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూడో చిత్రం టైటిల్‌ను నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి 'కొరివి' అనే వైవిధ్యమైన శీర్షికను ఖరారు చేశారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా కొరివి సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఆది సాయికుమార్, ఆనంద్ దేవరకొండ సిననిమాలతో
గతంలో ఆది సాయికుమార్ తో 'చుట్టాలబ్బాయి', ఆనంద్ దేవరకొండతో 'హైవే' వంటి విభిన్న చిత్రాలను అందించిన వెంకట్ తలారి కొరివి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటు కొరివి గ్లింప్స్ వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
మాయానది నిధి.. దెయ్యం కాపలా: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
ఈ కొరివి గ్లింప్స్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పల్లెటూరి వాతావరణంలో (విలేజ్ బ్యాక్‌డ్రాప్) సాగే హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. మాయానది తీరంలో దాగి ఉన్న ఒక అపారమైన నిధికి కాపలా కాసే 'కొరివి' అనే దెయ్యం కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మేకింగ్ విజువల్స్
కొరివి గ్లింప్స్‌లో చూపించిన మేకింగ్ విజువల్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పాతకాలపు హారర్ కథలకు భిన్నంగా, సరికొత్త కథాకథనంతో పెద్ద తెరపై థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
'కమిటీ కుర్రోళ్లు' హీరోతో సరికొత్త కాంబినేషన్
{{/usCountry}}కొరివి గ్లింప్స్‌లో చూపించిన మేకింగ్ విజువల్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పాతకాలపు హారర్ కథలకు భిన్నంగా, సరికొత్త కథాకథనంతో పెద్ద తెరపై థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
'కమిటీ కుర్రోళ్లు' హీరోతో సరికొత్త కాంబినేషన్
{{/usCountry}}ఇటీవల 'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో మెప్పించిన యంగ్ నటుడు ఈశ్వర్ రచిరాజు ఈ కొరివి సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా నందు మురళీధర్, లిఖిత కథానాయికలుగా అలరించనున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలలో కనిపిస్తారు.
కొరివిలో ఇతర నటీనటులు
అలాగే సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య తదితరులు ఈ కొరివి సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం కొరివి సినిమా రెగ్యులర్ షూటింగ్ వేగంగా సాగుతోంది.
టాప్ టెక్నీషియన్ల కలయిక
కొరివి చిత్రానికి సాయి కార్తీక్ స్వరాలు సమకూరుస్తుండగా, సతీష్ రెడ్డి మాసం ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యాక్షన్ సీన్స్ దిలీప్ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటుండగా, ప్రొడక్షన్ డిజైనర్‌గా నాని దేవరపల్లి పనిచేస్తున్నారు. కో-రైటర్‌గా టి.ఎన్. సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విప్లవ్, ఎడిటింగ్ బాధ్యతలను శ్రీధర్, వి.బి.జే చూస్తున్నారు.
డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్
"సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది" అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. హారర్ జానర్ ప్రేమికులకు 'కొరివి' ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.