మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలను, పరిణితి కలిగిన కథలను ఎంచుకునే పనిలో ఉన్నాడు. తాజాగా అతడు డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక ఎమోషనల్ డ్రామా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు వీరి కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.
తండ్రి పాత్రలో చిరు.. కూతురిగా కృతి శెట్టి

ఈ సినిమాలో చిరంజీవి ఒక పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. తప్పిపోయిన తన కూతురి కోసం ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం అని సమాచారం. అయితే చిరు కూతురి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన మేకర్స్.. చివరకు ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టిని (Krithi Shetty) ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడం, ఆమె వయసు కూడా పాత్రకు సరిగ్గా సరిపోవడంతో కృతిని ఎంపిక చేశారట. ఈ విషయాన్ని ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వరుస ప్లాపుల్లో ఉన్న కృతికి బంపర్ ఆఫర్..
కృతి శెట్టికి ఇది నిజంగా జాక్‌పాట్ అని చెప్పాలి. ఇటీవల వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఆమెకు.. ఏకంగా మెగాస్టార్ సినిమాలో, అందులోనూ అతని కూతురిగా నటించే అవకాశం రావడం కెరీర్‌కు పెద్ద బూస్ట్ అవుతుంది. ఈ సినిమాలో కృతి సరసన ఒక యువ హీరో నటించనున్నాడు. ఆ పేరు త్వరలోనే వెల్లడి కానుంది.
‘మన శంకర వరప్రసాద్’ సక్సెస్ జోష్‌లో..
మరోవైపు సంక్రాంతికి విడుదలైన చిరు లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సక్సెస్ ఆనందంలో చిరు తన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ నోట్ కూడా రాశాడు.
{{/usCountry}}మరోవైపు సంక్రాంతికి విడుదలైన చిరు లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సక్సెస్ ఆనందంలో చిరు తన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ నోట్ కూడా రాశాడు.
{{/usCountry}}అభిమానులు, ప్రేక్షకుల విజిల్స్, చప్పట్లే తనకు శక్తి అని, అవే తనను ముందుకు నడిపిస్తున్నాయని చిరంజీవి అన్నాడు. అంతేకాదు అటు అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై రివ్యూ ఇస్తూ.. ఇది సంక్రాంతి బాస్‌బస్టర్ అని అనడం విశేషం.