Lakshmi Manchu: టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా, నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్‌గా లక్ష్మీ మంచు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే తాజాగా అభిమానులతో జరిగిన 'హానెస్ట్ టౌన్ హాల్' (Honest Town Hall) ఇంటరాక్షన్ సెషన్‌లో తన కుటుంబం, కెరీర్ ఎదుగుదలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మంచు కుటుంబంలో జన్మించకపోతే తన కెరీర్ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. 'మంచు' అనే సర్ నేమ్‌ను టాలీవుడ్‌లో మొదట ఉపయోగించింది తానేనని, ఆ తర్వాతే సోదరులు విష్ణు, మనోజ్ తమ పేర్ల చివర 'మంచు' అని చేర్చుకున్నారని సంచలన నిజం వెల్లడించారు.
‘మంచు కాకపోయి ఉంటే కెరీర్ మరోలా ఉండేది’
ఫ్యాన్ ఇంటరాక్షన్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు లక్ష్మీ మంచు ఎంతో నిజాయతీగా సమాధానమిచ్చారు. "ఒకవేళ నేను మంచు ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని కాకపోయి ఉంటే, నా కెరీర్ ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎంతో ఉన్నతంగా ఉండేదని నేను భావిస్తున్నాను. మా ఇంట్లో ఉన్న ముగ్గురు మగవాళ్లు (మోహన్ బాబు, విష్ణు, మనోజ్) నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించారు. నేను వారిని ఎంతో ప్రేమిస్తాను. కానీ అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మాది పక్కా పితృస్వామ్య (Patriarchal) కుటుంబం. అక్కడ నేనేదైనా సాధించాలి లేదా నాకు ఏదైనా కావాలి అని గట్టిగా చెప్పాలంటే ఎంతో పోరాడాల్సి వచ్చేది" అని లక్ష్మీ వివరించారు.
'మంచు' అనే సర్ నేమ్ వాడింది మొదట నేనే..
ఇంటిపేరును ఇండస్ట్రీలో వాడటంపై కూడా లక్ష్మీ మంచు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. "మీరు జాగ్రత్తగా గమనిస్తే.. మా కుటుంబం నుంచి పరిశ్రమలోకి వచ్చిన అందరికంటే తక్కువ సమయమే నేను ఇక్కడ ఉన్నాను. కానీ అందరికంటే ముందు 'మంచు' అనే సర్ నేమ్‌ను వాడింది నేనే. అంతకుముందు నా సోదరులను ఎం. విష్ణువర్ధన్ బాబు, ఎం. మనోజ్ కుమార్ అని పిలిచేవారు. నాన్నను కూడా మోహన్ బాబు అని మాత్రమే పిలిచేవారు కానీ 'మంచు మోహన్ బాబు' అని కాదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 'లక్ష్మీ మంచు' అని పేరు పెట్టుకున్న తర్వాతే, వారు కూడా 'మనుజ్ మంచు', 'విష్ణు మంచు'గా పేర్లు మార్చుకున్నారు" అని స్పష్టం చేశారు.
కుటుంబ వాతావరణం, ముంబైకి మకాం
{{/usCountry}}ఇంటిపేరును ఇండస్ట్రీలో వాడటంపై కూడా లక్ష్మీ మంచు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. "మీరు జాగ్రత్తగా గమనిస్తే.. మా కుటుంబం నుంచి పరిశ్రమలోకి వచ్చిన అందరికంటే తక్కువ సమయమే నేను ఇక్కడ ఉన్నాను. కానీ అందరికంటే ముందు 'మంచు' అనే సర్ నేమ్‌ను వాడింది నేనే. అంతకుముందు నా సోదరులను ఎం. విష్ణువర్ధన్ బాబు, ఎం. మనోజ్ కుమార్ అని పిలిచేవారు. నాన్నను కూడా మోహన్ బాబు అని మాత్రమే పిలిచేవారు కానీ 'మంచు మోహన్ బాబు' అని కాదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 'లక్ష్మీ మంచు' అని పేరు పెట్టుకున్న తర్వాతే, వారు కూడా 'మనుజ్ మంచు', 'విష్ణు మంచు'గా పేర్లు మార్చుకున్నారు" అని స్పష్టం చేశారు.
కుటుంబ వాతావరణం, ముంబైకి మకాం
{{/usCountry}}లక్ష్మీ మంచు తన కుటుంబంపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి పురుషులను గౌరవించడం, పూజించడం మాత్రమే తనకు నేర్పించారని, ఆ భావజాలం నుంచి బయటకు రావడానికి తనకు సమయం పట్టిందని చెప్పారు.
ప్రస్తుతం ఆమె తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి ముంబైలో నివాసముంటున్నారు. భర్త ఆండీ శ్రీనివాసన్ అమెరికాలో ఉంటుండగా, లక్ష్మీ ముంబై వేదికగా హిందీ, తెలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది 'పూకీ', 'లేచింది మహిళా లోకం' వంటి చిత్రాలతో అలరించిన ఆమె, ఆహా (Aha) ప్లాట్‌ఫామ్‌లో 'టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్' షోకి జడ్జిగా వ్యవహరించారు.