కొత్త సినిమాలు చూడటానికి వీకెండ్ కోసం ఎదురుచూసే సినీ ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ముఖ్యంగా మలయాళ సినిమాలను ఇష్టపడే వారికి ఈ శుక్రవారం (జనవరి 16) చాలా స్పెషల్. రెండు భారీ సినిమాలతో పాటు, ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కూడా డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న టాప్ మలయాళ సినిమాల లిస్ట్ ఇదే.
1. కలంకావల్ (Kalamkaval) - సోనీ లివ్

థియేటర్లలో ఈ సినిమా చూడలేకపోయిన వారు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొట్టాయికోనంలో జరిగే ఒక సాధారణ పోలీస్ విచారణ.. వరుస హత్యల గుట్టును ఎలా రట్టు చేసిందనేది ఉత్కంఠభరితమైన కథ. సీరియల్ కిల్లర్ ‘సైనైడ్ మోహన్’ ఉదంతం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో.. విలన్ ‘స్టాన్లీ దాస్’ పాత్రలో మమ్ముట్టి నటన అద్భుతం. వినాయకన్ పోలీసుగా నటించాడు. థ్రిల్లర్ ప్రియులు అస్సలు మిస్ కాకూడని సినిమా ఇది.
2. భ.భ.బా (Bha.Bha.Ba) జీ5 ఓటీటీ
కేరళ ముఖ్యమంత్రి కిడ్నాప్ అయితే ఏంటి పరిస్థితి అనే పాయింట్‌తో వచ్చిన సినిమా ఇది. దిలీప్ హీరోగా నటించిన ఈ సినిమాలో మోహన్‌లాల్ ఒక అతిథి పాత్రలో మెరిశాడు. భారీ తారాగణం ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. అసలు సినిమా ఎందుకు ఆడలేదో తెలుసుకోవడానికైనా లేదా ఆసక్తికరమైన పాయింట్ కోసమైనా ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు.
3. కిర్కన్ (Kirkkan) - సన్ నెక్ట్స్
కిర్కన్ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామా. 2005లో కొట్టాయం దగ్గర్లో జరిగిన ఒక అమ్మాయి మరణం, అది హత్యగా తేలడం, దాని చుట్టూ సాగే పోలీసు దర్యాప్తు.. ఇదే ఈ సినిమా కథ. నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ‘వన్ టైమ్ వాచ్’గా ఉంటుంది.
4. ఎకో (Eko) - నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ ఎకో మూవీ మానవ భావోద్వేగాలను లోతుగా చూపిస్తుంది. ఇదొక స్లో-బర్న్ థ్రిల్లర్. నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకు బలం. సందీప్ ప్రదీప్ నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
5. ఇత్తిరి నేరమ్ (Ithiri Neram) - అమెజాన్ ప్రైమ్ వీడియో
{{/usCountry}}నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ ఎకో మూవీ మానవ భావోద్వేగాలను లోతుగా చూపిస్తుంది. ఇదొక స్లో-బర్న్ థ్రిల్లర్. నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకు బలం. సందీప్ ప్రదీప్ నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
5. ఇత్తిరి నేరమ్ (Ithiri Neram) - అమెజాన్ ప్రైమ్ వీడియో
{{/usCountry}}సమాజం విధించిన కట్టుబాట్లు, స్త్రీపురుషుల మధ్య సంబంధాల నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా ఇది. రోషన్ మాథ్యూ, జరీన్ షిహాబ్ తమ నటనతో ఈ సినిమాకు మంచి బలం చేకూర్చారు. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.