...
...
Next Story

Lavanya Tripathi: నీ భార్యననే విషయమే మర్చిపోయా.. ఓ అభిమానిలా చూశా.. లావణ్య త్రిపాఠి కొరియన్ కనకరాజు రివ్యూ వైరల్

Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి పోస్ట్ చేసిన కొరియన్ కనకరాజు రివ్యూ తెగ వైరల్ గా మారింది. వరుణ్ నటనను, విమర్శలను తట్టుకుని నిలబడిన తీరును కొనియాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు చూసేయండి.

Published on: Aug 10, 2026, 12:31:41 IST
Advertisement

Lavanya Tripathi: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కొరియన్ కనకరాజు' చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాపై వరుణ్ భార్య లావణ్య త్రిపాఠి ప్రశంసలు కురిపించింది.

కొరియన్ కనకరాజు రివ్యూ

నీ భార్యననే విషయమే మర్చిపోయా.. ఓ అభిమానిలా చూశా.. లావణ్య త్రిపాఠి కొరియన్ కనకరాజు రివ్యూ వైరల్ (instagram-itsmelavanya)
నీ భార్యననే విషయమే మర్చిపోయా.. ఓ అభిమానిలా చూశా.. లావణ్య త్రిపాఠి కొరియన్ కనకరాజు రివ్యూ వైరల్ (instagram-itsmelavanya)

తన భర్త వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాతో హిట్ కొట్టడంతో లావణ్య త్రిపాఠి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ కు లావణ్య ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఆనందంలోనే తన ఇన్ స్టాగ్రామ్ లో కొరియన్ కనకరాజు రివ్యూను పంచుకుంది.

లావణ్య త్రిపాఠి ఏమందంటే?

"ఈ సినిమాలో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ అద్భుతమనే చెప్పాలి. తెరపై నిన్ను చూస్తుంటే కొన్నిసార్లు నేను నీ భార్యననే విషయమే మరిచిపోయి, ఒక సాధారణ అభిమానిగా నీ నటనను ఆరాధించడం మొదలుపెట్టాను. ఆన్-స్క్రీన్ మాత్రమే కాకుండా, కెమెరా వెనుక కూడా ఈ సినిమా విజయం కోసం నువ్వు పడిన కష్టాన్ని దగ్గరుండి చూశాను" అని లావణ్య రాసుకొచ్చింది.

విమర్శల నుంచి నేర్చుకుని

సినిమా ప్రయాణంలో ఎదురైన విమర్శలను, నెగెటివిటీని వరుణ్ తేజ్ ఎదుర్కొన్న తీరును లావణ్య ప్రత్యేకంగా అభినందించింది.

"వచ్చిన విమర్శల నుంచి మంచిని స్వీకరిస్తూ, అనవసరమైన నాయిస్ ను పక్కనపెట్టి నువ్వు ముందుకు సాగిన తీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నీలోని ఆ పట్టుదలే నిన్ను ఈరోజు విజేతగా నిలబెట్టింది. ఇక నుంచి నీ ప్రయాణం పైపైకే.. బెస్ట్ ఇంకా రాబోతోంది" అని వరుణ్‌కు లావణ్య ఆల్‌ ది బెస్ట్ చెప్పింది.

టీమ్ మొత్తానికి గ్రాండ్ థ్యాంక్స్

ఆ మ్యూజిక్ తో ప్రాణం

దర్శకుడు మేర్లపాక గాంధీ మేకింగ్ ను లావణ్య త్రిపాఠి ప్రత్యేకంగా ప్రస్తావించింది. "హ్యూమర్, ఎమోషన్స్, మ్యాడ్‌నెస్‌ను సరిగ్గా మేళవించి సినిమాను వినోదాత్మకంగా మలిచారు" అని డైరెక్టర్ గురించి చెప్పింది. ‘‘తమన్ మ్యూజిక్, బీజీఎం ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ప్రతీ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి" అని లావణ్య తన రివ్యూలో రాసుకొచ్చింది.

అలాగే హీరోయిన్ రితికా నాయక్, డిఓపి మనోజ్, నిర్మాతలు (ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యువి క్రియేషన్స్), స్టైలిస్టులు (అశ్విన్, హసన్ ఖాన్, ఐషు రాజీవ్ రెడ్డి)పై లావణ్య త్రిపాఠి ప్రశంసల జల్లు కురిపించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks