...
...
Next Story

Lavanya Tripathi: రూమ్‌లో కూర్చుని ఏడ్చేశా.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి లైఫ్‌లో అంతటి షాకింగ్ సంఘటనా?

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి షాకింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను బయటపెట్టింది. ఓ డైరెక్టర్ తీరు నచ్చక ఆమె గతంలో తమిళ సినిమా వద్దనుకుంది. కానీ ఆ తర్వాత లావణ్యను టార్గెట్ చేస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. కేసు కూడా పెట్టారు. ఈ విషయాలను తాజాగా లావణ్య వెల్లడించింది.

Published on: Mar 15, 2026, 08:58:33 IST
Advertisement

మెగా కోడలు లావణ్య త్రిపాఠి షాకింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను బయటపెట్టింది. తన లైఫ్ లో జరిగిన అనూహ్య సంఘటన గురించి ఆమె తాజాగా వెల్లడించింది. లావణ్య ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తన సినీ కెరీర్ లోని చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ ఘటన కారణంగా రూమ్ లో కూర్చుని ఏడవాల్సి వచ్చిందని పేర్కొంది.

లావణ్య త్రిపాఠి కామెంట్లు

లావ‌ణ్య త్రిపాఠి
లావ‌ణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి తాజాగా ఓ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయింది. అక్కడ మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు ఆన్సర్ చెప్తూ తన సినీ కెరీర్ లో చోటు చేసుకున్న ఓ షాకింగ్ ఘటనను బయటపెట్టింది. తన జీవితంలోనూ కఠిన పరిస్థితులు ఉన్నాయని, వాటిని దాటుకుని ముందుకు వెళ్తున్నానని ఆమె పేర్కొంది.

ఆ డైరెక్టర్ నచ్చక

‘‘ఒక సింగిల్ వుమెన్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. గతంలో నాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు. సపోర్ట్ చేసేందుకు ఎవరూ ఉండరు. ఓ సారి తమిళ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ డైరెక్టర్ తీరు నాకు నచ్చలేదు. నేను రాంగ్ కావొచ్చు కానీ నాకు సౌకర్యంగా అనిపించలేదు’’ అని లావణ్య త్రిపాఠి తనకు జరిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

ఇంటికి వచ్చే ఏడ్చేశా

‘‘నాకు కంఫర్టబుల్ లేకపోవడంతో ఆ సినిమాకు నో చెప్పేశా. దీంతో వాళ్లు నాపై కేసు పెట్టారు. నా గురించి మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయి. ఆ టైమ్ లో నేను ఎవరికీ చెప్పలేదు. ఎవరిని హెల్ప్ అడగలేదు. ఇంటికి వచ్చి ఏడ్చేశా. కానీ మళ్లీ ఆలోచించా. ఓ టీ తాగి చిల్ అయ్యా. ఇలాంటి సంఘటనలు మనల్ని బలంగా మారుస్తాయి. ఇది కొవిడ్ కు ముందు జరిగింది’’ అని లావణ్య త్రిపాఠి పేర్కొంది.

సతీ లీలావతి

లావణ్య త్రిపాఠి తాజాగా తనపై సోషల్ మీడియా వేధింపులపై పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks