జీ తెలుగులో ప్రసారమవుతున్న కొత్త డ్యాన్స్ షో 'ఆట' (Aata) ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో గెస్ట్‌గా వచ్చిన లావణ్య త్రిపాఠి, జడ్జిగా ఉన్న నిహారికల మధ్య జరిగిన సరదా సంభాషణ, వరుణ్ తేజ్‌తో ఫోన్ కాల్ ఎపిసోడ్ ప్రేక్షకులను నవ్విస్తోంది. చెల్లి ఫోన్ కట్ చేసి భార్య ఫోన్ ఎత్తిన వరుణ్ తేజ్ చెప్పిన కారణం హైలైట్‌గా నిలిచింది.
ఆడపడుచు కట్నం.. బూతులు వచ్చన్న లావణ్య

జీ తెలుగు ఛానెల్‌లో ప్రారంభమైన కొత్త డ్యాన్స్ షో 'ఆట'. ఈ షోకి యాంకర్ సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల జడ్జిగా ఉంది. తాజాగా విడుదలైన ప్రోమోలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి గెస్ట్‌గా వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో జరిగిన ఒక ఫన్ గేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
షో ప్రారంభంలో నిహారిక.. లావణ్యను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికింది. యాంకర్ సుధీర్ నిహారికను ఉద్దేశించి.. "వదిన దగ్గర ఆడపడుచు కట్నం తీసుకున్నావా?" అని అడుగుతాడు. దీనికి నిహారిక స్పందిస్తూ.. ఇది అడిగినందుకు నిన్ను కూడా జైల్లో వేస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ఆమెకు తెలుగు రాదు కదా అని సుధీర్ అంటే.. నాకు బూతులు కూడా వచ్చు అని లావణ్య అనడం విశేషం.
చెల్లి vs భార్య.. వరుణ్ ఎవరి ఫోన్ ఎత్తాడంటే?
సుధీర్ ఒక ఆసక్తికరమైన గేమ్ ప్లాన్ చేశాడు. నిహారిక, లావణ్య ఇద్దరూ ఒకేసారి వరుణ్ తేజ్ (Varun Tej)కు ఫోన్ చేయాలని, అతను ఎవరి ఫోన్ లిఫ్ట్ చేస్తాడో చూద్దామని ఛాలెంజ్ విసిరాడు. వరుణ్ తేజ్ తన చెల్లి నిహారిక ఫోన్ కట్ చేసి, వెంటనే భార్య లావణ్య ఫోన్ లిఫ్ట్ చేశాడు.
నిహారిక అలిగి "నా ఫోన్ ఎందుకు కట్ చేశావ్?" అని అడగగా.. "నేను బాబు (వాయువ్) డైపర్ మారుస్తున్నాను" అని వరుణ్ సమాధానం ఇచ్చాడు. "మరి లావణ్య కాల్ అంత ఫాస్ట్ గా ఎలా ఎత్తారు?" అని సుధీర్ అడగగా.. "నీకు ఇంకా పెళ్లి కాలేదు, పిల్లలు లేరు.. నీకు ఆ కష్టాలు తెలియవులే" అంటూ వరుణ్ సెటైర్ వేశాడు. దీంతో సెట్ లో నవ్వులు పూశాయి. ఈ ఎపిసోడ్‌లో రంభ, అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు.
వరుణ్ - లావణ్య ఫ్యామిలీ
{{/usCountry}}నిహారిక అలిగి "నా ఫోన్ ఎందుకు కట్ చేశావ్?" అని అడగగా.. "నేను బాబు (వాయువ్) డైపర్ మారుస్తున్నాను" అని వరుణ్ సమాధానం ఇచ్చాడు. "మరి లావణ్య కాల్ అంత ఫాస్ట్ గా ఎలా ఎత్తారు?" అని సుధీర్ అడగగా.. "నీకు ఇంకా పెళ్లి కాలేదు, పిల్లలు లేరు.. నీకు ఆ కష్టాలు తెలియవులే" అంటూ వరుణ్ సెటైర్ వేశాడు. దీంతో సెట్ లో నవ్వులు పూశాయి. ఈ ఎపిసోడ్‌లో రంభ, అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు.
వరుణ్ - లావణ్య ఫ్యామిలీ
{{/usCountry}}వరుణ్ తేజ్, లావణ్య 2023 నవంబర్‌లో ఇటలీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి 2025 సెప్టెంబర్ 9న కుమారుడు 'వాయువ్' (Vaayuv) జన్మించాడు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు (శివ రామ్, అన్వీర దేవి) జన్మించిన సందర్భంలో.. మెగాస్టార్ చిరంజీవి గతంలో చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలను లావణ్య తిప్పికొట్టింది. "అది నా కుటుంబం. నా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే నేను ఒప్పుకోను" అని ఆమె స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది.